Home » Entertainment » Karthika Deepam 14 July 2022 Full Episode
Entertainment

Karthika Deepam 14 July Today Episode: జ్వాలే శౌర్య అని తెలిసి నిరుపమ్ షాకింగ్ నిర్ణయం.. శౌర్యను బయటికి తీసుకెళ్లిన నిరుపమ్.. ఇంతలో ట్విస్ట్

Authored By
Varun G
The Telugu News | Updated on: July 14, 2022, 10:39 am
Advertisement

Karthika Deepam 14 July Today Episode: కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జులై 2022, గురువారం ఎపిసోడ్ 1404 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య ఇంటికి రాగానే.. హాల్ లో ఉన్న హిమ, శౌర్య కలిసి దిగిన ఫోటోను చూస్తుంది. ఈ ఫోటో ఇక్కడెందుకు పెట్టారు. నేను ముందే చెప్పాను కదా. నా లైఫ్ నేను బతుకుతాను అని. నాకు నచ్చినట్టుగా ఉంటానని. ఇలా చేస్తే నేను ఇప్పుడే వెళ్లిపోతా అని అంటుంది శౌర్య. ఇంతలో ఆ ఫోటోను తీసి విసిరేయబోతుంది. ఆ ఫోటోను నిరుపమ్ పట్టుకొని లోపలికి వచ్చి.. శౌర్యను అక్కడి నుంచి తీసుకెళ్తాడు. నేరుగా రవ్వ ఇడ్లీ బండి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ కూర్చొని ఏదో చెప్పబోతాడు డాక్టర్ సాబ్. కానీ.. తను మాత్రం ఏం మాట్లాడదు. నీ వాళ్లు ఎవరో తెలిసి కూడా ఎందుకు ఇలా ఏం తెలియనట్టుగా ఉన్నావు అని ప్రశ్నిస్తాడు నిరుపమ్. కానీ.. తను మాత్రం నాకు ఎవ్వరూ లేరు అంటుంది. ఆ తర్వాత డాక్టర్ సాబ్ ఏదో చెప్పబోతే అస్సలు వినదు. వద్దు డాక్టర్ సాబ్.. మీరు నాకు ఏం చెప్పొద్దు.. నేను ఏం వినను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

karthika deepam 14 july 2022 full episode

మరోవైపు శౌర్యను సుందరంగా రెడీ చేసింది. చీర కట్టిస్తుంది సౌందర్య. తనను చీరలో చూసి హిమ, ఆనంద రావు ఇద్దరూ సంతోషపడతారు. నీ కూతురును చూడండి. చీర కట్టింది అని కార్తీక్, దీప ఫోటోలతో మాట్లాడుతుంది సౌందర్య. నీ కోపం ఎప్పుడు పోతుంది శౌర్య అని అనుకుంటుంది హిమ. అమ్మ, డాడీ.. మీకు మాటిచ్చినట్టుగానే నిరుపమ్ బావకు, శౌర్యకు పెళ్లి జరిగేలా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. నన్ను మీరే దీవించాలి అంటుంది హిమ. మరోవైపు మన సమస్యకు ఎలాంటి సొల్యూషన్ దొరకడం లేదు అంటుంది శోభ.

Advertisement

జ్వాల నిరుపమ్ ను ప్రేమిస్తుందని తెలుసో లేదో.. మరోవైపు హిమ.. నిరుపమ్ ను పెళ్లి చేసుకోమని జ్వాలను అడుగుతోంది. ఇప్పటికే వెడ్డింగ్ కార్డులు పంచారు. మనం ఇప్పుడు స్పీడ్ పెంచకపోతే మనకు తర్వాత ఏం చేయలేం అంటుంది శోభ. దీంతో స్వప్న కూడా ఏం చేయలేకపోతుంది.

Karthika Deepam 14 July Today Episode: స్వప్నతో మాట్లాడిన శోభ

తొందరపడకు శోభ. మనం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటుంది స్వప్న. శోభ మాత్రం నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది శోభ. నన్ను ఆ నానమ్మ, మనవరాలు ఇద్దరూ చెంప మీద కొట్టారు. అది నేను మరిచిపోయాను అనుకుంటున్నారు. నేనే రంగంలోకి దిగుతాను అంటుంది శోభ.

Advertisement

మరోవైపు శౌర్య అన్నం తింటూ ఉంటుంది. నీకు ఏం కావాలి అని అడుగుతుంది సౌందర్య. దీంతో నాన్నంటే ప్రాణం. తెచ్చిస్తావా? నీ డాక్టర్ మనవడు అంటే ఇష్టం.. తెచ్చిస్తావా అని అడుగుతుంది శౌర్య. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. మనం కావాల్సినవి దొరికితే జీవితం ఎందుకు అవుతుంది అంటుంది శౌర్య.

ఇంతలో హిమ వస్తుంది. నువ్వు కూడా భోం చేద్దువురా అని అడుగుతుంది సౌందర్య. దీంతో నేను తర్వాత తింటా అంటుంది హిమ. దీంతో రా వచ్చి కూర్చో అంటాడు ఆనంద రావు. వద్దులే నేను తర్వాత తింటా అంటే.. నానమ్మ రమ్మని చెప్పు అంటుంది శౌర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి