Karthika Deepam 14 Oct Today Episode : నాన్న మంచోడు కాదు మోసగాడు.. అని దీపతో చెప్పిన హిమ.. అది విన్న కార్తీక్ ఏం చేస్తాడు?

Karthika Deepam 14 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 14 అక్టోబర్ 2021, తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమకు బాగా జ్వరం వస్తుంది. హిమకు వచ్చిన జ్వరం చూసి అందరూ షాక్ అవుతారు. తనకు జ్వరం వచ్చిందని తన చేయి పట్టుకొని చూద్దామని కార్తీక్ చేయి పెడితే కార్తీక్ చేయిని లాగేస్తుంది హిమ. నువ్వు నన్ను చూడాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు ఏం ట్రీట్ మెంట్ చేయొద్దు అని మొండికేస్తుంది హిమ. దీంతో వేరే డాక్టర్ ను పిలుస్తాడు ఆదిత్య.కట్ చేస్తే.. జైలులో సుకన్యకు.. ప్రియమణి ఫోన్ చేస్తుంది. హిమకు జ్వరం వచ్చిందని చెబుతుంది.

karthika deepam 14 october 2021 full episode

హిమ కోసం అయినా కొంపదీసి కార్తీక్ అమెరికా వెళ్దామని అనుకుంటే అప్పుడు ఏం చేయాలి. వామ్మో.. నా పరిస్థితి ఏంది.. కార్తీక్ అమెరికా వెళ్లకుండా ఆపాలి. నా బిడ్డకు తండ్రి కార్తీక్ అని ఒప్పించాలి.. సారీ కార్తీక్.. మనకోసం మన బాబు కోసం తప్పదు.. అని అనుకుంటుంది మోనిత.వేరే డాక్టర్ వచ్చి ట్రీట్ మెంట్ చేసి ఏం పర్వాలేదు.. తగ్గుతుంది అని చెబుతుంది డాక్టర్. డాక్టర్ వెళ్లిపోయాక.. సౌందర్య.. హిమ దగ్గర కూర్చొని.. హిమ ఏంటిది. ఎందుకిలా చేస్తున్నావు. పెద్దవాళ్ల విషయం నీకెందుకు. ముందు ఆ మోనిత గురించి ఆలోచించడం మానేయ్.. అంటుంది సౌందర్య.

డాక్టర్ బాబు మీరు నాతో తప్పు చేయించారు. మోనిత విషయం గురించి పిల్లలకు చెబుతాదమని అంటే మీరే వద్దన్నారు.. అంటాడు కార్తీక్. నిజం చెప్తే ఇన్ని తలనొప్పులు ఉండేవి కాదు కదా అంటాడు ఆదిత్య. ఏంతో కొంత అయినా చెప్పినా బాగుండేది డాక్టర్ బాబు అంటుంది దీప. హిమకు వచ్చిన జ్వరానికి నేనే కారణం అంటావా? అంటాడు కార్తీక్. ఒకరకంగా మీరే డాక్టర్ బాబు. ఆసుపత్రికి మోనిత వచ్చినప్పుడు అందరికీ చెబితే అయిపోతుండే కదా.. అంటుంది దీప. నాకు పిల్లల భవిష్యత్తే ముఖ్యం.. అని అంటాడు కార్తీక్.

Karthika Deepam 14 Oct Today Episode : మా నాన్న మంచోడే కానీ.. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా అని అనుకున్న శౌర్య

కట్ చేస్తే.. శౌర్య తన నాన్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మా నాన్న మంచోడే. నేనే తప్పుగా నాన్నను అర్థం చేసుకున్నా కావచ్చు అని అనుకుంటుంది శౌర్య. ఇంతలో అక్కడికి ప్రియమణి వచ్చి ఏంటి శౌర్యమ్మ దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు.. అని అడుగుతుంది. మోనిత ఆంటి ఇంటికి వచ్చినప్పుడల్లా నాన్న గారు బిస్కెట్లు తినేవారు తెలుసా.. అని చెబుతుంది ప్రియమణి. ఏదోలా శౌర్యను రెచ్చగొట్టాలని చూస్తుంది కానీ.. తనకు అది కుదరదు. శౌర్య.. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

karthika deepam 14 october 2021 full episode

దూరం నుంచి హిమను చూస్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో హిమకు పాలు తీసుకొని వస్తుంది దీప. ఏమైందండి.. లోపలికి రండి అని అడుగుతుంది దీప. వద్దులే.. నేను దూరం నుంచే చూస్తాను.. అంటాడు. ఇంతలో హిమకు పాలు తీసుకెళ్లి ఇస్తుంది దీప. నాకు పాలు వద్దమ్మా అంటుంది. డాడీ మీద నీకు కోపం లేదా అని అడుగుతుంది హిమ. మాట్లాడవేంటమ్మా అని అంటుంది.


హిమ అవన్నీ తర్వాత మాట్లాడుకుందా అంటే.. లేదు ఇప్పుడే చెప్పు.. నీకు డాడీ మీద కోపం ఉందా? లేదా? అని అడుగుతుంది. కోపం అప్పుడప్పుడు వచ్చినా వెంటనే పోతుంది.. అనగానే లేదు డాడీ నిన్ను కూడా మోసం చేశాడు. అయినా నువ్వు ఏం అనవా? అంటుంది. హిమ తప్పు అలా అనకూడదు.. అంటే నాకు బయటికి వెళ్లాలని ఉంది. కానీ బయట డాడీ కనిపిస్తారని ఆయన్ను చూడటం ఇష్టం లేకే ఇక్కడ ఉన్నాను తెలుసా? అంటుంది హిమ. డాడీ మనల్ని అందరినీ మోసం చేశాడు. అయినా నువ్వు ఏం మాట్లాడవు కదా.. అంటుంది. డాడీ మంచోడు అమ్మా.. అంటే మంచోడు కాదు.. మోసగాడు అంటుంది హిమ.

Recent Posts

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

56 minutes ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

1 hour ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

2 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

3 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

4 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

5 hours ago

Spicy Food : కారం తిన్న వెంటనే నోరు మండుతుంది ఎందుకు? దీని వెనుక‌ శాస్త్రీయ కారణం ఇదే!

Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…

6 hours ago

Vastu Tips : ఇంట్లో పావురాల గూడు శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా?

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…

8 hours ago