Karthika Deepam 14 Sep Today Episode : ఆనంద్ జాడ తెలుసుకున్న హిమ.. దీప ప్లాన్ ఫెయిల్.. కార్తీక్ ను బోల్తా కొట్టించిన మోనిత

Karthika Deepam 14 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 సెప్టెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 1457 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనితకు బాగోలేదని చెప్పి కార్తీక్ డాక్టర్ ను తీసుకొస్తాడు. నిజంగానే జ్వరం వచ్చిందని అనుకొని డాక్టర్ ను తీసుకొచ్చాడా అని అనుకుంటుంది మోనిత. ఇంతలో డాక్టర్ కార్తీక్ ను చూసి మీరు డాక్టరే కదా అంటాడు. దీంతో నేను డాక్టర్ ఏంటి అని అంటాడు కార్తీక్. ఆ తర్వాత మోనితను చూసి మీరు కూడా డాక్టరే కదా అంటాడు. ఇంతకీ మీ పేరేంటి అని అడుగుతుంది మోనిత. దీంతో నన్ను అందరూ డాక్టర్ బాబు అంటారు అంటాడు డాక్టర్. దీప ముందే చెప్పడంతో మోనిత సంగతి తెలుసుకోవడం కోసమే అక్కడికి వస్తాడు డాక్టర్. దీప చెప్పినట్టే ఇది ఖిలాడీ అని అనుకుంటాడు. తనకు జ్వరం లేకున్నా కూడా ఉందని నటిస్తోందని తెలుసుకొని కావాలని కొన్ని మందులు రాస్తాడు. అవి జ్వరం మందులు మాత్రం కాదు. దీంతో కోపంతో వీడు వంటలక్క క్యాండిడేటే అని అనుకుంటుంది మోనిత.

karthika deepam 14 september 2022 full episode

అతడి గల్ల పట్టుకొని ఎవర్రా నువ్వు వంటలక్క మనిషివి కదా నువ్వు అని అంటుంది మోనిత. వీడు ఆ వంటలక్క మనిషే. ఏరా ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా అని అడుగుతుంది మోనిత. దీంతో మోనిత వదులు.. అంటాడు కార్తీక్. ఈయన వాళ్ల అన్నయ్య. ఆయన డాక్టర్ అని చెబితే తీసుకొచ్చా ఇప్పుడు ఏంటి అని అంటాడు కార్తీక్. నేను దీప వాళ్ల అన్నయ్యను అయితే ఇప్పుడు ఏంటి.. మీకు కావాల్సింది డాక్టరే కదా అంటాడు. ఇతడు వచ్చింది ట్రీట్ మెంట్ ఇవ్వడానికి కాదు.. వంటలక్కను మన ఇంట్లో వంట మనిషిగా పెట్టడానికి అంటుంది మోనిత. దీంతో ఏం మాట్లాడుతున్నావు మోనిత అంటాడు కార్తీక్. అది మెల్లగా ఇంట్లో చేరి నిన్ను లోబర్చుకోవాలని చూస్తోంది అంటుంది మోనిత.

ముందు అతడిని ఇక్కడి నుంచి పంపించేయ్ కార్తీక్ అంటుంది మోనిత. దీంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పదమ్మా అని దీపను తీసుకొని వెళ్తాడు. మోనిత.. వంటలక్క అలా ఎందుకు చేస్తుంది అని అంటాడు కార్తీక్.

దీంతో మొదట్నుంచి అది నీ మీద కన్నేసింది. నీకు దగ్గర కావాలని చూస్తోంది అంటుంది మోనిత. ఎందుకు నువ్వు నా మాట వినడం లేదు అంటూ అరిచినట్టు యాక్షన్ చేస్తుంది. మరోవైపు హిమ.. స్కూల్ కు వెళ్తూ శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది.

Karthika Deepam 14 Sep Today Episode : హిమను కలిసిన సరోజక్క

ఎందుకు శౌర్య నా మీద అంత కోపం పెట్టుకున్నావు. అమ్మానాన్నలను దూరం అయినందుకు నీకు ఎంత బాధగా ఉందో నాకు కూడా అంతే బాధగా ఉంది. కానీ.. నువ్వు కూడా నాకు దూరం అయిపోయావు.

మనిద్దరం కలిసి స్కూల్ కు వెళ్లేవాళ్లం కదా అని అనుకుంటూ స్కూల్ కు వెళ్తుండగా సరోజక్క కనిపిస్తుంది. ఎలా ఉన్నావు అని అడుగుతుంది సరోజ. దీప, కార్తీక్ గురించి మాట్లాడుతుంది. శౌర్య ఎలా ఉంది అని అడుగుతుంది.

దీంతో మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. ప్రమాదం జరిగిన ఊళ్లోనే అమ్మానాన్నలు ఎప్పటికైనా వస్తారు అని ఎదురు చూస్తూనే ఉంది అంటుంది హిమ. పాపం.. ఆ మోనితమ్మ కూడా అంతే. డాక్టర్ బాబుకు అలా జరిగాక.. మొత్తం ఆస్తిని, బాబుని మా చెల్లెలుకు ఇచ్చి ఎక్కడికో వెళ్లిపోయింది అని అంటుంది సరోజక్క.

దీంతో ఇప్పుడు తమ్ముడు అంకుల్, ఆంటి దగ్గరే ఉన్నారా అని అంటుంది. దీంతో అవును అంటుంది. తీసుకెళ్తా పదా అని ఆనంద్ దగ్గరికి తీసుకెళ్తుంది సరోజ. కార్తీక్ కు గతం గుర్తకు రాదు కదా అని అనుకుంటున్నా కానీ.. ఈ వంటలక్క రెచ్చిపోతోంది అని అనుకుంటుంది మోనిత.

గతం గుర్తొస్తుందని కార్తీక్ ను నమ్మిస్తే తను ఏం చేయమన్నా చేస్తాడు. అందుకే దీపను కార్తీక్ నుంచి దూరంగా పెట్టాలి. దీపను ఇక్కడి నుంచి తరిమేయడం మన చేతుల్లో లేదు కాబట్టి కార్తీక్ ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి అని అనుకుంటుంది మోనిత.

ఏం ఆలోచిస్తున్నావు మోనిత అని అడుగుతాడు. తప్పిపోయిన మన బాబు గురించా అని అడుగుతాడు. దీంతో కార్తీక్ కు బాబు బాగానే గుర్తున్నాడు. ఎలాగైనా బాబును తీసుకురావాలి అని అనుకుంటుంది మోనిత.

మన బాబు ఆచూకీ తెలిసిందా అని అడుగుతాడు కార్తీక్. దీంతో తెలిసింది కార్తీక్ అంటుంది. బాబు చెన్నైలో ఉన్నాడు. వెళ్లి తీసుకొద్దామనుకున్నా అంటుంది. దీంతో పదా వెళ్దాం అంటాడు కార్తీక్.

దీంతో వద్దు.. నువ్వు ఎందుకు. నీ ఆరోగ్యం బాగోలేదు. నేను వెళ్లి తీసుకొస్తాను. బాబును తెచ్చి నీ చేతుల్లో పెడతాను సరేనా అంటుంది మోనిత. బాబు కోసం ఇంతలా ఆరాటపడుతున్నాడు అంటే బాబును వెంటనే తీసుకురావడం మంచిది అని అనుకుంటుంది మోనిత.

మరోవైపు హిమను.. బాబు దగ్గరికి తీసుకెళ్తుంది. ఆనంద్ తో కాసేపు ఆడుకుంటుంది. తర్వాత ఆనంద్ ను తనతో పాటు ఇంటికి తీసుకెళ్తా అంటుంది హిమ. దీంతో లక్ష్మణ్, అరుణ షాక్ అవుతారు.

ఏమీ అనుకోవద్దమ్మా.. బాబు మాకు బాగా అలవాటు అయిపోయాడు. మేము కూడా బాబు లేకుండా ఉండలేకపోతున్నాం అంటాడు లక్ష్మణ్. మోనితమ్మ బాబును మాకు అప్పగించి బాగా చూసుకోమని ఆస్తి కూడా ఇచ్చింది.

రేపు వచ్చి బాబు ఎక్కడ అంటే మేము ఏం చెప్పాలి చెప్పు అంటాడు లక్ష్మణ్. బాబును మాత్రం తీసుకెళ్తామని చెప్పొద్దు అంటుంది అరుణ. నువ్వే తమ్ముడి దగ్గరికి వచ్చి ఆడుకుంటూ వెళ్తుండు అంటుంది అరుణ.

సరే నేను బాబుతో కాసేపు ఆడుకుంటాను అని అంటుంది హిమ. మరోవైపు నేను ముందే చెప్పాను కదా అన్నయ్య అని దీప.. ఆ డాక్టర్ తో అంటుంది. నేను కావాలనే వేరే మందులు రాశాను అంటాడు డాక్టర్.

అది రాక్షసి. దానికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుందని తెలిస్తే ఇలాగే మీద పడిపోతుంది. నువ్వు ఒక్కడివే వెళ్తే బాగుండేది. నన్ను కూడా చూడగానే దానికి డౌట్ వచ్చింది. నా భర్తను నా దగ్గరికి తెచ్చుకోవడానికి నేను ఇంత బాధపడాల్సి వస్తుంది అంటుంది దీప.

పోరాడి పోరాడి అలసిపోయినా కూడా నేను వదలను. దాని అంతు తేల్చి నా డాక్టర్ బాబును తెచ్చుకుంటాను అంటుంది దీప. డాక్టర్ బాబును ఆ రాక్షసి నుంచి విడిపించుకొని తీసుకురా అది చాలు అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో హై టెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్.. సొంత ఊరుకి కూడా వెళ్లొద్దంటూ ఆగ్రహం..!

Kethireddy Pedda Reddy : తాడిపత్రి రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి…

54 minutes ago

Kaala Sarpa Dosham : మీకు కాల సర్ప దోషం ఉందా… అయితే, శ్రావణ మాసంలో శివునికి ఈ జంట సర్పాలను అర్పించండి…?

Kaala Sarpa Dosham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కొందరికి కాలసర్ప దోషంతో ఉంటుంది. వీరు ఎంతో తీవ్రమైన ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ…

2 hours ago

Junior Movie Public Talk : జూనియర్ మూవీ పబ్లిక్ టాక్.. అదరగొట్టిన గాలి కిరీటి రెడ్డి

Junior Movie Public Talk : kireeti మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ అంటే తెలియని వారు ఉండరు..అలాంటి గాలి…

3 hours ago

Junior Movie Review : జూనియ‌ర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Junior Movie Review  : 'కిరీటి రెడ్డి'..  Kireeti  sreeleela నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా…

4 hours ago

Pregnant Women : నేరేడు పండ్లను… గర్భిణీ స్త్రీలు తిన్నారంటే ఇదే జరుగుతుంది…?

Pregnant Women : ప్రకృతి ప్రసాదించిన పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఇది సీజనల్ పండు. ఇది వేసవికాలం…

4 hours ago

Gas Cylinder : ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చిన సర్కార్..!

Gas Cylinder : ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు దీపం 2 పథకం లో ఒక…

5 hours ago

Home Remedies : మీ కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయని చింతిస్తున్నారా… వీటితో మటుమాయం…?

Home Remedies : ఈ రోజుల్లో చాలామందికి కంటికి నిద్ర లేకపోవడం వలన, కొన్ని జీవనశైలిలో మార్పులు వలన, కళ్ళ…

6 hours ago

Kavitha : రేవంత్ నిర్ణ‌యానికి  జై కొట్టిన కవిత.. ఆ విషయంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి..!

Kavitha  : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా…

7 hours ago