Home » Entertainment » Karthika Deepam 15 July 2022 Full Episode
Entertainment

Karthika Deepam 15 July Today Episode : కలిసిపోయిన శౌర్య, హిమ.. హిమను హత్తుకున్న శౌర్య.. సంతోషంలో సౌందర్య.. ఇంతలో మరో ట్విస్ట్

Authored By
Varun G
The Telugu News | Updated on: July 15, 2022, 10:38 am
Advertisement

Karthika Deepam 15 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 1405 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను తర్వాత తింటాను అని హిమ అనడంతో వద్దులే రా.. వచ్చి తినమని చెప్పు అంటుంది జ్వాల. దీంతో హిమ, సౌందర్య, ఆనంద రావు సంతోషిస్తారు. పక్కన హిమ కూర్చోవడంతో అక్కడ కాదు.. నా ఎదురుగా కూర్చొని తిను అంటుంది జ్వాల. నన్ను చూస్తూ తిను.. ప్రతిక్షణం నీకు నేనే గుర్తుకు రావాలి అంటుంది జ్వాల. దీంతో హిమ షాక్ అవుతుంది. మరోవైపు హిమ ఫోటోను చూస్తూ మాట్లాడుతాడు నిరుపమ్. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు నిరుపమ్. జ్వాలే శౌర్య అని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ గందరగోళం ఏంటో.. ఈ కన్ఫ్యూజన్ ఏంటో నేను వెంటనే తెలుసుకుంటాను. ఈ చిక్కుముడులు ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు నిరుపమ్.

Advertisement

karthika deepam 15 july 2022 full episode

మరోవైపు శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది హిమ. చిన్నప్పుడు ఎంత బాగా కలిసి ఉండేవాళ్లం శౌర్య. ఇప్పుడు ఏమైంది నీకు అని అనుకుంటుంది హిమ. ఎలాగైనా నీ పెళ్లి చేయాలని చూస్తున్నాను శౌర్య. దానికోసమే నేను క్యాన్సర్ డ్రామా ఆడాను. మీ ఇద్దరినీ కలపాలనే నేను ట్రై చేస్తున్నాను. కానీ.. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. నీకు నిజం చెప్పాలని ఉంది కానీ.. నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే కోపంతో ఎక్కడ వెళ్లిపోతావో అని భయం వేస్తోంది శౌర్య. నిన్ను గాజు బొమ్మలా కాపాడుకోవాలి. అపురూపంగా చూసుకోవాలి. నీ మనసులో ఉన్న కోపాన్ని నేనే తగ్గించాలి అని అనుకుంటుంది హిమ.

Advertisement

మరోవైపు శౌర్య, హిమ ఇద్దరినీ కలపడం కోసం.. వాళ్ల డ్రెస్సులను మొత్తం పిండాలని పనిమనిషికి చెబుతుంది. మరోవైపు ఇద్దరికీ కొత్త డ్రెస్సులను తీసుకొస్తారు. కొత్త డ్రెస్సు తీసుకొచ్చాను. వేసుకో అక్కడ పెట్టా అని బాత్ రూమ్ లో ఉన్న శౌర్యకు చెబుతుంది సౌందర్య. దీంతో సరే నానమ్మ అంటుంది శౌర్య.

Karthika Deepam 15 July Today Episode : ఇద్దరికీ ఒకే రకం డ్రెస్సులు తీసుకొచ్చిన సౌందర్య

మరోవైపు ప్రేమ్ హిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు హిమ.. కొత్త డ్రెస్ వేసుకుంటుంది. ఆ డ్రెస్ వేసుకొని హాల్ లోకి వస్తుంది. ఏంటి స్పెషల్ ఈరోజు. కొత్త డ్రెస్ ఎందుకు వేసుకోమన్నారు అని అడుగుతుంది హిమ. దీంతో ఏదో ఆనందం కోసం ఈ డ్రెస్ ఇచ్చాం.. అంటుంది సౌందర్య.

Advertisement

మరోవైపు జ్వాల కూడా అదే డ్రెస్ వేసుకొని బయటికి వస్తుంది. ఇద్దరిదీ ఒకే డ్రెస్ అవడంతో హిమ షాక్ అవుతుంది. జ్వాల కూడా షాక్ అవుతుంది. తాతయ్య, నానమ్మ వాళ్లు ఇద్దరికీ ఒకే డ్రెస్ ప్లాన్ చేశారా. ఇప్పుడు శౌర్యకు కోపం వస్తే ఏంటి పరిస్థితి అని అనుకుంటుంది హిమ.

అక్కడి నుంచి భయంతో హిమ వెళ్లబోతుండగా ఆగు అంటుంది శౌర్య. నానమ్మ ఏంటిది అని అడుగుతుంది శౌర్య. ఏం లేదమ్మా.. మీ డ్రెస్ లన్నీ వాషింగ్ కు ఇచ్చారు. అందుకే కొత్త డ్రెస్సులు ఇద్దరికీ ఇచ్చాం అంటాడు ఆనంద రావు. దీంతో డ్రెస్సులు ఒకటే అయినంత మాత్రాన.. నాకు జరిగిన ద్రోహాన్ని మరిచిపోను కదా అంటుంది శౌర్య.

ఇలాంటివి ఇంకోసారి చేశావంటే బాగుండదు అని అంటుంది శౌర్య. మరోవైపు హిమకు నిరుపమ్ ఫోన్ చేస్తాడు. దీంతో వస్తున్నా అని చెబుతుంది హిమ. ఇదిలా ఉంటే.. నిరుపమ్, హిమ పెళ్లి ఎలా ఆపాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది స్వప్న. ఇంతలో ప్రేమ్ వస్తాడు. హిమకు సంబంధించి పరిష్కారం ఆలోచించమంటున్నాను కదా అని అడుగుతుంది.

దీంతో ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటాడు. నేను పరిష్కారం చెబుతా అంటాడు. మరోవైపు నిరుపమ్, హిమ ఇద్దరూ కేప్ లో కూర్చొంటారు. మన పెళ్లి విషయంలో శౌర్యను అస్సలు ఇన్వాల్వ్ చేయకు అంటాడు నిరుపమ్. బావ మూడ్ బాగోలేనట్టుంది అని అనుకుంటుంది హిమ.

Advertisement

కాస్త లేట్ అయినా బావ మనసు మార్చుకోవాలి అని అనుకుంటుంది హిమ. ఇంతలో శౌర్య అదే కేప్ లో ఉంటుంది. వాళ్లను చూస్తుంది. చిరాకు పడుతుంది. ఏం మాట్లాడవేంటి హిమ అంటే అక్కడి నుంచి హిమ వెళ్లిపోతుంది. అసలు హిమకు ఏమైంది అని అనుకుంటాడు నిరుపమ్.

కేప్ లో నిరుపమ్, హిమను చూసి కోపంతో ఇంటికి వచ్చి హిమ ఫోటో మీద కోపంతో కత్తులు విసురుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన హిమ.. అంత కోపం ఉంటే నా ఫోటో మీద ఎందుకు నా మీద విసురు అంటుంది. ఫోటో మీద విసిరితే నీ కోపం తగ్గుతుందా శౌర్య. నా మీదికి విసురు అంటుంది హిమ.

దీంతో ఏంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ ప్లాన్ లో ఇదొక భాగమా అని అడుగుతుంది. మరోవైపు నిరుపమ్ ఇంటికి వచ్చి వెనుక నుంచి శౌర్యను చూసి హిమ అనుకొని ఐలవ్యూ చెబుతాడు. కానీ.. తర్వాత తను శౌర్య అని చూసి షాక్ అవుతాడు.

ఆ తర్వాత నువ్వు ఎలాగైనా శౌర్యనే పెళ్లి చేసుకోవాలి అని నిరుపమ్ తో హిమ అంటుంది. వాళ్ల మాటలు వింటుంది శౌర్య. హిమను హత్తుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి