Karthika Deepam 16 Dec Today Episode : సౌందర్య ఇంట్లో మోనిత రచ్చ.. దీపకు భారీ షాక్ ఇచ్చిన రుద్రాణి.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam 16 Dec Today Episode : సౌందర్య ఇంట్లో మోనిత రచ్చ.. దీపకు భారీ షాక్ ఇచ్చిన రుద్రాణి.. ఇంతలో మరో ట్విస్ట్

Karthika Deepam 16 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 డిసెంబర్ 2021, గురువారం 1224 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన కొడుకును కిడ్నాప్ చేసిన తర్వాత మోనిత.. సౌందర్య ఇంటికే వచ్చి ఉంటోంది. అక్కడే తిష్ట వేసింది. నా కొడుకు దొరికే దాకా నేను ఇక్కడే ఉంటా అని చెప్పింది. ఉదయం కాగానే.. స్నానం చేసి.. దేవుడికి పూజ చేసి దేవుడి […]

 Authored By gatla | The Telugu News | Updated on :16 December 2021,9:00 am

Karthika Deepam 16 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 డిసెంబర్ 2021, గురువారం 1224 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన కొడుకును కిడ్నాప్ చేసిన తర్వాత మోనిత.. సౌందర్య ఇంటికే వచ్చి ఉంటోంది. అక్కడే తిష్ట వేసింది. నా కొడుకు దొరికే దాకా నేను ఇక్కడే ఉంటా అని చెప్పింది. ఉదయం కాగానే.. స్నానం చేసి.. దేవుడికి పూజ చేసి దేవుడి పాట పాడుతుంది. ఇంతలో అందరూ హాల్ లోకి వస్తారు. హారతి తీసుకోండి అత్తయ్య గారు అని అంటుంది. కానీ.. ఎవ్వరూ హారతి తీసుకోరు. ఆదిత్య, శ్రావ్య కూడా అక్కడే ఉంటారు. ఇంతలో ప్రియమణిని కాఫీ తీసుకురా అందరికీ అంటుంది. కాఫీ తీసుకొచ్చాక.. ఆ ట్రేను సౌందర్య కింద పడేసి.. ఏం అనుకుంటున్నావో నువ్వు అసలు.. నా ఇంటికి వచ్చి పూజ గదిలో కూర్చొని పూజ చేసి కాఫీలు తెచ్చి.. ఏంటి ఈ రచ్చ.. అంటుంది. ఇంతలో ఆదిత్య.. ఏంటి మమ్మీ దీనితో మాటలు.. మెడ పట్టి గెంటేయక అంటాడు.

karthika deepam 16 december 2021 full episode

karthika deepam 16 december 2021 full episode

వద్దు అని ఆపేస్తుంది శ్రావ్య. ఆగు ఆదిత్య అంటుంది. సౌందర్య ఎంత తిట్టినా కూడా మోనిత మాత్రం ఇంట్లో నుంచి వెళ్లదు. మీరు మా అత్తగారు. మీకు నన్ను తిట్టే హక్కు ఉంది అంటుంది. మీరు అవునన్నా కాదన్నా నేను ఈ ఇంటి కోడలును. నా కొడుకు ఈ ఇంటి వారసుడు అని చెప్పి ప్రియమణిని తీసుకొని లోపలికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే కార్తీక్.. రుద్రాణితో జరిగిన గొడవ గురించే ఆలోచిస్తుంటాడు. ఇంతలో దీప.. కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. కాఫీ తాగండి కార్తీక్ బాబు అంటుంది. ఏంటి కార్తీక్ బాబు అలా చూస్తున్నారు. కాఫీ చల్లారి పోతుంది. తాగండి కార్తీక్ బాబు అంటుంది. కార్తీక్ బాబు.. రాత్రి జరిగిన విషయం మరిచిపోండి. ఆ రుద్రాణి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి. మీకు నేనున్నాను కార్తీక్ బాబు అంటుంది దీప. మిమ్మల్ని, పిల్లలను నేను చూసుకుంటాను. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. కార్లలో తిప్పలేను. బంగ్లాలో ఉంచలేను కానీ.. కడుపు నిండా భోజనం పెడతా. గుట్టుగా సంసారాన్ని నడుపుతాను.. అంటుంది.

కార్తీక్ బాబు మీరు ఎక్కువగా ఆలోచించకండి. మన జీవితాల్లో ఏవో కష్టాలు వచ్చాయి అనుకోకండి అంటుంది. దీంతో అనుకోకుండా ఎలా ఉండగలం దీప. ఎన్నెన్నో జరిగాయి. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అంటాడు కార్తీక్. ఇప్పుడు ఏమైంది. ఇంతకుముందు డాక్టర్ బాబు అనేదాన్ని. ఇప్పుడు కార్తీక్ బాబు అంటున్నా.. అంటుంది.

ఇంతకుముందు కాఫీ కప్పులో ఇచ్చేదాన్ని. ఇప్పుడు గ్లాస్ లో ఇచ్చాను. అప్పటికంటే ఇప్పుడే మన మధ్య దగ్గరి తనం పెరిగింది డాక్టర్ బాబు అంటుంది దీప. 11 ఏళ్లు దూరం అయ్యాం. అందుకేనేమో దేవుడు మనల్ని అలా కలిసి ఉండేలా చేశాడు అంటుంది. ఇంత జరిగినా ఇంత పాజిటివ్ గా ఎలా ఆలోచిస్తున్నావు దీప.. ఏంటి నీ ధైర్యం అంటాడు కార్తీక్. దీంతో మీరే నా ధైర్యం కార్తీక్ బాబు అంటుంది.

మీరు ఉండగా నాకు ఏంటి భయం అంటుంది. నాకు ఇద్దరు పిల్లలు కాదు.. ముగ్గురు పిల్లలు. మిమ్మల్ని కూడా కంటికి రెప్పలా చూసుకుంటాను అని మనసులో అనుకొని… నేను వంటలు చేయడానికి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. మీరు పిల్లలు రెడీ అయ్యాక స్కూల్ కు తీసుకొని రండి అని అంటుంది దీప. దీంతో వంలక్క కాఫీ బాగుంది అంటాడు కార్తీక్.

Karthika Deepam 16 Dec Today Episode : ఆనందరావును బుట్టలో వేసుకుందామనుకున్న మోనిత ప్లాన్ ఫెయిల్

కట్ చేస్తే.. రుద్రాణి వేప పుల్ల వేసుకొని పళ్లు తోముకుంటూ ఉంటుంది. ఒరేయ్ అబ్బులు.. మన ఊరిలో ఏం జరుగుతోంది అని అడుగుతుంది. దీంతో శ్రీవల్లి ఇంట్లోకి వచ్చిన వాళ్లు అని ఏదో చెప్పబోతాడు.. అది శ్రీవల్లి ఇల్లు కాదు.. మన ఇల్లురా. ఇప్పుడు చెప్పు అంటుంది రుద్రాణి.

ఆ ఇంట్లోకి వచ్చినవాళ్లు మమ్మల్ని కొట్టారు. నిన్ను కూడా కొట్టారు. ఎందుకు వాళ్లను వదిలేస్తున్నావు అలా అంటే.. అన్ని విషయాల్లో అంత ఆవేశం పనికిరాదు. సమయం చూసి దెబ్బ కొట్టాలి.. కండలు కాదు…కొంచెం బుర్ర ఉపయోగించాలి అంటుంది రుద్రాణి.

కట్ చేస్తే.. మోనిత.. ఆనంద రావు వెళ్తుండగా ఆయన కాళ్లు పట్టుకుంటుంది. దీంతో ఏంటమ్మా ఇది అంటాడు. నా జీవితాన్ని మీరే కాపాడాలి. దీపక్క లేనప్పుడు నాదగ్గరికి ఆయనే వచ్చాడు కదా. 11 ఏళ్లు నా చుట్టూ తిరిగాడు కదా. దీపక్క వచ్చాక నన్ను కాదంటే నేను ఎలా బతకాలి అంటుంది మోనిత.

కార్తీక్ మనసులో, ఈ ఇంట్లో నాకు కోడలుగా స్థానం కావాలి అంటుంది. మీకు నా మద్ధతు కావాలి అంటుంది. ఎన్నో అవమానాల పాలు అయ్యాను అయినా కూడా నాకు కార్తీక్ మీద ఇంత కూడా ప్రేమ తగ్గలేదు.. అంటుంది మోనిత. కార్తీక్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. ఇంట్లో నాకు ఒక చిన్న స్థానం ఇచ్చినా చాలు. ఎక్కడో ఒక చోట ఉంటాను. ఈ ఇంట్లో మాత్రం నేనుండాలి. కార్తీక్ నా కొడుకును ఎత్తుకోవాలి.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది.

అలా నట్టింట్లో ఏడవకూడదు అంటాడు ఆనంద రావు. ఏడవకపోతే ఏం చేయమంటారు మామయ్య గారు.. అంటుంది మోనిత. కనీసం మీరైనా నా బాధను అర్థం చేసుకోండి. నాకు మీ మద్దతు కావాలి. రోజు మీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటాను మామయ్య గారు అంటుంది. మిమ్మల్ని అయినా నేను ఎలాగైనా నా వైపునకు తిప్పుకుంటాను అనుకుంటుంది మోనిత.

కట్ చేస్తే.. దీప పని కోసం స్కూల్ కు వెళ్తుంటుంది. ఇంతలో మేడమ్ కనిపిస్తుంది. దీప ఆగు అంటుంది. మేడమ్ హెడ్ మాస్టర్ తో మాట్లాడారా అంటుంది. దీప.. ఈ పని వేరే వాళ్లకు ఇవ్వాలంటూ పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అంటుంది మేడమ్. ఎందుకు మేడమ్.. నేను బాగానే వంట చేస్తాను. ఎంత పెద్ద వంట అయినా క్షణాల్లో చేసేస్తాను అంటుంది దీప.

ఈ పని నీకు ఇవ్వలేను అంటుంది మేడమ్. నీకిస్తే నేను ఇబ్బందుల్లో పడతాను అంటుంది. రాత్రి హెడ్ మాస్టర్ తో మాట్లాడా. ఆయన సరే అన్నారు కానీ.. ఒక వ్యక్తి నీకు ఈ పని ఇవ్వకుండా ఆపారు.. అంటుంది. ఎవరు మేడమ్ అంటుంది. దీంతో రుద్రాణి అంటుంది. ఆమెకు నీకు ఏ శతృత్వం ఉందో నాకు తెలియదు కానీ.. ఆమె మాట కాదని నేను ఈ పని నీకు ఇవ్వలేను అంటుంది మేడమ్.

సారీ దీప.. నేను నీకు మాటిచ్చాను కానీ.. రుద్రాణిని ఎదురించలేను అంటుంది. మేడమ్ థాంక్స్.. మీ వంతు సాయం చేద్దామనుకున్నారు. మీరు బాగుండాలి అని చెబుతుంది దీప. పని దొరకకపోవడంతో ఏం చేయాలో దీపకు అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది