Karthika Deepam 16 July Today Episode : శౌర్యకు ఐలవ్యూ చెప్పిన నిరుపమ్.. హిమకు ఈ విషయం తెలుస్తుందా? నిరుపమ్ శౌర్యను పెళ్లి చేసుకుంటాడా?

Karthika Deepam 16 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 జులై 2022, శనివారం ఎపిసోడ్ 1406 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనుషుల ప్రాణాలు అవలీలగా తీయడం నీకు తెలుసు. నమ్మక ద్రోహం చేయడం నీకు తెలుసు. చేసిందంతా చేసి.. ఇప్పుడొచ్చి నా ప్రాణాలు తీసుకో అంటున్నావా. నా దగ్గర ప్రాణం తీసేంత కోపం లేదు కానీ.. నిన్ను క్షమించేది లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శౌర్య. మరోవైపు హిమ, నిరుపమ్ పెళ్లి జరగదు అని ప్రేమ్.. స్వప్నకు మాటిచ్చిన విషయం తెలిసిందే. కానీ.. పెళ్లిని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. ఏం చేయాలి అని అనుకుంటాడు. మరోవైపు శౌర్య ఆటోలో ఓ వ్యక్తి ఎక్కి.. మణికొండకు వెళ్లాలంటాడు. దీంతో సరే అంటుంది. తను ఉండే వీధికే తీసుకొస్తాడు. కొంచెం ముందుకు వెళ్లి ఆపు అంటాడు. ఇంతలో సౌందర్య ఇంటి ముందు ఆపుతాడు. ఇది నా ఫ్రెండ్ ఆనంద రావు ఇల్లు అంటాడు. అదా సంగతి అని అనుకుంటుంది శౌర్య.

karthika deepam 16 july 2022 full episode

మరోవైపు ఆనంద రావును కలుసుకుంటాడు తన ఫ్రెండ్. రారా.. ఎన్ని రోజులు అయింది కలవక. ఇప్పటికి తీరిక దొరికిందా నీకు అంటాడు. ఇంతలో శౌర్య లోపలికి రావడం చూస్తాడు ఆ వ్యక్తి. ఇదేంటి.. ఈ ఆటో అమ్మాయి ఇంట్లోకి వస్తుంది అని అనుకుంటాడు. షాక్ అవుతాడు. ఏయ్ అమ్మాయి.. డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావేంటి.. వెళ్లిపో అంటాడు. దీంతో రావద్దా అంటుంది. ఇది మా ఇల్లు అంటుంది శౌర్య. దీంతో ఏంటమ్మా నీ రౌడీఇజం.. అంటాడు. దీంతో నా ఫోటో ఉంది చూడండి అంటుంది శౌర్య. దీంతో ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు. నేను ఆటో నడుపుతాను. ఈయన మా తాతయ్య. ఇదే నా ఇల్లు. ఇంకా ఏంటి సార్.. అలా చూస్తున్నారు. ఆధారాలు కూడా చూపించాలా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఏంట్రా ఆ అమ్మాయి మీ మనవరాలా? అని అడుగుతాడు. దీంతో అవును.. నా పెద్దబ్బాయి కూతురు అంటాడు. ఏంటి అంటే.. అవన్నీ తర్వాత చెబుతాను అంటాడు ఆనంద రావు. మరోవైపు హిమ.. శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. శౌర్య.. ఇంటికి వచ్చిందన్న ఆనందం తప్ప తన కోపం ఏమాత్రం తగ్గలేదు అని అనుకుంటుంది హిమ.

Karthika Deepam 16 July Today Episode : ఎలాగైనా శౌర్యను చేసుకో అని నిరుపమ్ కు నచ్చజెప్పిన హిమ

మరోవైపు శౌర్య కూడా తన తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నిరుపమ్ వచ్చి వెనుక నుంచి చేయి వేస్తాడు. హిమ అనుకుంటాడు. ఇద్దరూ ఒకటే డ్రెస్ వేసుకునే సరికి.. తను హిమ అనుకొని ఐలవ్యూ అంటాడు. దీంతో శౌర్య తెగ సంతోషిస్తుంది. కానీ.. వెంటనే వెనక్కి తిరుగుతుంది.

వెనక్కి తిరిగిన శౌర్యను చూసి నిరుపమ్ షాక్ అవుతాడు. సారీ శౌర్య అంటాడు. నేను హిమ అనుకున్నా అంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో హిమ వస్తుంది. నాకు తలనొప్పిగా ఉంది బావా అంటుంది. బావ మూడ్ బాగున్నట్టుంది. శౌర్య గురించి చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకుంటుంది.

బావ నిన్ను ఒకటి అడిగాను ఏం చేశావు అని అడుగుతుంది. దీంతో ఏం అడిగావు మరిచిపోయా అంటాడు. నేను అడిగింది.. మన పెళ్లి క్యాన్సలేషన్ గురించి అంటుంది హిమ. దీంతో షాక్ అవుతాడు నిరుపమ్. ఏం మాట్లాడుతున్నావు. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేశాం. అందరినీ పిలిచాం అంటాడు.

దీంతో అదే ముహూర్తానికి శౌర్య మెడలో నువ్వు తాళి కట్టు అంటుంది హిమ. ప్రేమను ఎలా బదిలీ చేస్తావు హిమ అంటాడు నిరుపమ్. శౌర్యకు నువ్వంటే ఇష్టం.. ఇష్టం కాదు ప్రాణం బావ అంటుంది హిమ. కానీ.. నిరుపమ్ మాత్రం వినడు. నువ్వంటే నాకు ఇష్టం. నాకు ప్రాణం అంటాడు.

కానీ.. శౌర్యను పెళ్లి చేసుకోమనడం ఏంటి అంటాడు. శౌర్య మీద నీకు గొప్ప ప్రేమ ఉండొచ్చు. త్యాగశీలిగా నన్ను అడగొచ్చు. నేను శౌర్యను పెళ్లి చేసుకుంటే శౌర్య సంతోషిస్తుందేమో కానీ.. నా సంతోషం మాటలేమిటి. నా జీవీతం గురించి ఆలోచించవా. నేను ఎలా సంతోషంగా ఉంటాననుకుంటున్నవు అంటాడు నిరుపమ్.

ఇవన్నీ బయటి నుంచి శౌర్య వింటుంది. బావ అని చెప్పినా కూడా వినకుండా వెళ్లిపోతాడు నిరుపమ్. దీంతో అక్కడి నుంచి శౌర్య కూడా వెళ్లిపోతుంది. శౌర్యను హిమ చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

3 minutes ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

12 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

15 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

18 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

22 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago