Home » Entertainment » Karthika Deepam 16 November 2022 Full Episode
Entertainment

Karthika Deepam 16 Nov Today Episode : మోనిత ఇంట్లో కార్తీక్, దీపను చూసి సౌందర్య షాక్.. వాళ్లు బతికే ఉన్నారని తెలిసి సంతోషించిన సౌందర్య.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Authored By
Varun G
The Telugu News | Updated on: November 16, 2022, 9:37 am
Advertisement

Karthika Deepam 16 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 1511 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీప నిజంగా నా భార్య కావచ్చు. అందుకే నువ్వు తన అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావు అని మోనితతో అంటాడు కార్తీక్. లేదు కార్తీక్.. నువ్వు నా భర్తవే. దీప భర్తవు కాదు అని అంటుంది మోనిత. ఆ తర్వాత దీప, దుర్గకు ఇద్దరికీ కార్తీక్ మీద అనుమానం వస్తుంది. నిజంగానే కార్తీక్ కు గతం గుర్తొచ్చినట్టుంది దీపమ్మ అంటాడు దుర్గ. దీంతో అవును దుర్గ నాకు కూడా అదే అనిపిస్తోంది అంటుంది దీప. మోనిత విషయంలో కార్తీక్ ప్రవర్తించే తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది. కానీ.. ఆయనకు గతం గుర్తొచ్చిందని ఎలా తెలియాలి. ఆయన అంతట ఆయనే చెప్పాలి అని అనుకుంటుంది దీప.

Advertisement

karthika deepam 16 november 2022 full episode

మరోవైపు ఇంద్రుడు మళ్లీ ఇదివరకు ఉన్న ఊరుకి బయలుదేరుతాడు. ఇంతలో శౌర్య కూడా వస్తానని అంటుంది. దీంతో వద్దు అక్కడ మీ నానమ్మ, తాతయ్య చూస్తారు అని అంటాడు ఇంద్రుడు. దీంతో ఏం కాదు. నేను కూడా వస్తా. కనీసం నాకు బయటికి వెళ్లే ఏ అవకాశం వచ్చినా వదులుకోను అంటుంది శౌర్య. చంద్రమ్మ కూడా వస్తానని అనడంతో ముగ్గురూ కలిసి మళ్లీ దీప, కార్తీక్ ఉన్న ఊరికి బయలుదేరుతారు. మరోవైపు దీప సామాన్లు కొనడం కోసం బయలుదేరుతుండగా అక్కడికి వెళ్లిన మోనిత.. దీపకు మళ్లీ వార్నింగ్ ఇస్తుంది. నిన్ను చంపేస్తా అంటూ బెదిరిస్తుంది. దీంతో నిన్ను నిన్ననే గుడిలో తగులబెట్టాల్సింది కానీ.. బతికిపోయావు అని చెప్పి దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

మరోవైపు కోపంతో రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ ను లాగించేస్తుంది మోనిత. చాలా ఫుడ్ తింటుంది. తను కోపంలో తినే ఫుడ్ చూసి షాక్ అవుతారు కస్టమర్లు. దీప సామాన్లు తెచ్చి చాలా కోపంతో కూర్చొని ఉంటుంది. ఇంటికి తాళం కూడా తీయకుండా కూర్చొని ఉండటం చూస్తాడు కార్తీక్.

ఏమైంది.. తాళం కూడా తీయకుండానే అలాగే కూర్చున్నావు అని అంటాడు కార్తీక్. దీంతో ఆ మోనిత మళ్లీ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లింది. నన్ను చంపేస్తానని అంటుంది అని చెబుతుంది దీప. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ మోనిత మాటలను సీరియస్ గా తీసుకోకు. తన గురించి తెలుసు కదా అని తనను ఓదార్చుతాడు.

Advertisement

Karthika Deepam 16 Nov Today Episode : పాత ఊరుకే వచ్చిన ఇంద్రుడు, చంద్రమ్మ, శౌర్య

ఫుడ్ తిన్నాక బిల్లు తీసుకురా అని హోటల్ సిబ్బందిని అడుగుతుంది మోనిత. దీంతో మీ బిల్లు ఆవిడ కట్టేసింది అని చెబుతారు. చూస్తే తను ఎవరో కాదు.. సౌందర్య. తనను చూసి షాక్ అవుతుంది మోనిత. ఆంటి మీరా.. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.

దీంతో నా సంగతి తర్వాత కానీ.. నువ్వేంటి అంత ఫుడ్ తిన్నావు. కోపంలో ఉన్నావా.. లేక సంతోషంలో ఉన్నావా.. కోపంలో ఉన్నా కూడా అలాగే ఫుడ్ తింటారు అని చెబుతుంది సౌందర్య. దీంతో అదేం లేదు ఆంటి.. ఏదో ఆకలితో ఉండి తిన్నాను అంటుంది.

ఆ తర్వాత మీ ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది సౌందర్య. దీంతో అయ్యో.. ఇంటికి ఎందుకు.. ఏదైనా హోటల్ కు వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది మోనిత. ఎందుకు మీ ఇంట్లో చూడకూడనిది ఏదైనా ఉందా. మొన్న ఆయన వచ్చినప్పుడు కూడా అలాగే కంగారు పడ్డావట.

ఇప్పుడు నేను వస్తే కూడా అంతే కంగారు పడుతున్నావు అని అంటుంది. దీంతో ఏం లేదు. అది బొటిక్ అంటుంది. ఏం కాదు పదా.. నీ కారును నేను ఫాలో అవుతాను. తిక్క తిక్క వేషాలు వేశావంటే అస్సలు బాగోదు. నీ వెనుకే వస్తా అంటుంది సౌందర్య. దీంతో ఏం చేయాలో మోనితకు అర్థం కాదు.

Advertisement

మరోవైపు పాత ఊరికే ఆటోలో వెళ్తుంటారు ఇంద్రుడు, చంద్రమ్మ, శౌర్య. ఈ ఊరే బాగుంది బాబాయి. ఇక్కడే ఉంటే బాగుండేది అని అంటుంది శౌర్య. దీంతో ఇక్కడే ఉందామా మరి. మళ్లీ వచ్చేద్దామా అంటాడు. దీంతో వద్దులేండి బాబాయి. ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నానమ్మ, తాతయ్య వస్తారు అంటుంది శౌర్య.

మొన్నంటే నానమ్మ లేదు కాబట్టి.. ఊరు వెళ్లింది కాబట్టి సరిపోయింది. అదే నానమ్మ వచ్చి ఉంటే నా చేతులు, కాళ్లు కట్టేసి అయినా తీసుకెళ్లి ఉండేది అని అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి