Karthika Deepam 16 Sep Today Episode : మోనిత మీద జాలి చూపిస్తున్న దీప.. రత్నసీతతో పిల్లల ఫోటోలను కార్తీక్ ఇంటికి పంపించిన మోనిత.. త్వరలోనే బిడ్డతో సహా కార్తీక్ ఇంటికి మోనిత వచ్చేస్తుందా?
Karthika Deepam 16 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ 16 సెప్టెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1146 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ఇంటికి వెళ్లిన రత్నసీత.. కార్తీక్ కు ఓ కవర్ ఇస్తుంది. ఏంటది.. అని అడుగుతాడు కార్తీక్. ఇది నాది కాదు. మోనిత పంపించింది. నేను మీ దగ్గరికి వస్తున్నాను అని తెలిసి.. మోనిత ఇది మీకు ఇవ్వాలంటూ పట్టుబట్టింది.. అని చెబుతుంది రత్నసీత. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
సారీ సార్.. ఎంత చెప్పినా ఆవిడ వినలేదు.. అని చెబుతుంది. ఆ కవర్ ను అక్కడ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రత్నసీత. ఏముంటుంది అందులో.. అని అందరూ టెన్షన్ పడతారు. దీప వెళ్లి ఆ బ్యాగ్ లో ఏముందో చూస్తుంది. తీరా చూస్తే అందులో బేబీ ఫోటోలు ఉంటాయి. ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ తీసి చదువుతుంది దీప. కార్తీక్ కు చూపిస్తుంది….
Karthika Deepam 16 Sep Today Episode : కార్తీక్ కు లేఖ రాసిన మోనిత…
మైడియర్ నా కార్తీక్. ఇవన్నీ ఏంటని ఆశ్చర్యపోతున్నావా? మనకు పుట్టబోయే బాబు ఇలాగే ఉంటాడు. అచ్చం నీలాగే. ఇవన్నీ నీ బెడ్ రూమ్ లో అంటిస్తే నేను చాలా సంతోషపడతాను. అడుగడుగున నువ్వే గుర్తొస్తున్నావ్. నా మనసు నిండా నీ రూపమే. అందుకే.. నా కడుపులో పెరిగే బిడ్డ నీ ప్రతిరూపంలా ఉంటాడు. అప్పుడే బాబుకు పేరు కూడా పెట్టేసుకున్నాను. మీ నాన్నగారి పేరే.. ఆనంద్. ఎప్పటికైనా నేను తిరిగివచ్చి నిన్ను సొంతం చేసుకుంటాను…… ఇట్లు నీ సహధర్మచారిణి 2.. అని లేఖ పంపిస్తుంది మోనిత. దాన్ని చదివి చింపి అవతల పడేస్తాడు కార్తీక్. నేను భయపడిందే జరగబోతోంది.. అని సౌందర్య టెన్షన్ పడుతుంది. జరగబోయేదానికి గురించి ఇప్పుడే భయపడటం ఎందుకు.. అని ఆనంద రావు అంటాడు. ఏం జరుగుతుంది మమ్మీ.. ఏం జరగదు.. నాకు దీపకు ఉన్నంత జాలి, సహనం ఏం లేవు. ఉత్తరం రాసినట్టు తన తలరాతను తానే రాసుకోలేదు కదా.. అంటాడు కార్తీక్.
ఇంతలోనే పిల్లలు అక్కడికి వచ్చి.. పిల్లల పోస్టర్లు బాగున్నాయే… అంటూ వాటిని చూసి తెగ సంతోషిస్తారు శౌర్య, హిమ. ఎవరు తెచ్చారు నాన్నా అని అడుగుతారు. బాబాయ్ తెచ్చాడు దీపు గాడి కోసం అని చెబుతుంది దీప. పోస్టర్లతో దీపు గాడు ఎలా ఆడుకుంటాడు. వాడు ఇవి చింపేస్తాడు. ఏంటో.. బాబాయ్ కి ఏం తెలియదు.. మనం ఆడుకుందాం రా.. పోస్టర్లతో కాదులే.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
Karthika Deepam 16 Sep Today Episode : ఏసీపీ రోషిణిని ఇరిటేట్ చేసిన మోనిత
కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్ లో మోనిత.. ఏసీపీని కలుస్తుంది. కానిస్టేబుల్ వచ్చి తన డిటెయిల్స్ తీసుకుంటుంది. పేరు చెప్పండి మేడమ్ అనగానే కే. మోనిత కార్తీక్.. అని అంటుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కార్తీకే.. అంటుంది. అడ్రస్ చెప్పండి మేడమ్ అనగానే.. కార్తీక్ ఇంటి అడ్రస్ చెబుతుంది. దీంతో ఏసీపీ ఇరిటేట్ అవుతుంది. ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నావు.. అనగానే నేనేమీ పిచ్చి ఎక్కి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. నా భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే కదా ఉండేది.. అంటూ అలాగే నా మీద ఏం ఏం కేసులు బుక్ చేస్తున్నారు…. అంటూ కోంచెం ఆవేశంతో మాట్లాడి వెళ్తుంది మోనిత. నీలాంటి క్రిమినల్స్ ను ఎలా బుక్ చేయాలో నాకు బాగా తెలుసు మోనిత అని అనుకుంటుంది ఏసీపీ.
కట్ చేస్తే.. కార్తీక్, దీప.. ఆ బొమ్మలనే చూస్తూ ఉంటారు. పోలీసులకు లొంగిపోయి కూడా ఇంకా ఇలా టార్చర్ పెట్టడం మానుకోలేదు చూశారా…. అని అంటాడు కార్తీక్. నేను రాత్రే మీ డాడితో అన్నాను. అది మనల్ని ఇంకా వెంటాడుతుంది అని. అదే జరుగుతోంది ఇప్పుడు.. అంటుంది సౌందర్య. అది మృగం.. ఇలాంటివి ఇంకా చేస్తూనే ఉంటుంది. దాన్ని మనం లెక్కలోకి తీసుకోకుండా ఉండటమే బెటర్. నీకు ఏమాత్రం టెన్షన్ లేదా దీప అని సౌందర్య అడిగితే లేదు అంటుంది. ఎందుకు ఉంటుంది తనకు మానవత్వం ఎక్కువ కదా.. అంటాడు కార్తీక్…
మోనిత ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా.. మీరు మాత్రం ఒక్కటిగా ఉండాలి. అప్పుడే మోనిత ఏం చేయలేదు. మోనిత ప్రశాంతంగా మిమ్మల్ని ఉండనీయకుండా చేసేందుకు చేసే ప్రయత్నాలను పట్టించుకోవద్దు. ఆ మోనిత చేసిన పనికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇప్పుడే చంపేయాలన్నంత కసి పెరిగింది.. అంటూ కార్తీక్ అంటాడు.మోనితను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం.. ఆమె ఏం చేయలేదు అని ఆనంద రావు అనగా… అలా ఎలా మాట్లాడుతున్నారు.. కొడుకుకు నీ పేరే పెట్టుకుంటోందట.. బిడ్డను తీసుకొని వస్తే ఇంట్లోకి రానిస్తారా.. అని అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య…
Karthika Deepam 16 Sep Today Episode : ఆదిత్యను చూసి తెగ నవ్వుకున్న శౌర్య, హిమ
కట్ చేస్తే.. శౌర్య, హిమ.. ఇద్దరూ చెస్ ఆడుతుంటారు. ఇంతలో ఆదిత్య అక్కడికి వస్తాడు. అతడిని చూసి నవ్వుతుంటారు వాళ్లు. ఏమైంది అని అడిగితే ఏం లేదు అంటారు. మనం వేరే చోటుకు వెళ్లి నవ్వుకుందాంరా అని అనుకుంటారు. ఇంతలో రౌడీ ఆగవే.. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని అడుగుతాడు ఆదిత్య. దీపు గాడికి టాయ్స్ తేకుండా.. పోస్టర్లు తెచ్చావా? వాటిని వాడు చింపి పడేస్తాడు.. అంటుంది శౌర్య, పోస్టర్లు నేను తేలేదే.. నేనెప్పుడు తెచ్చాను. నాకేం అర్థం కావడం లేదు.. అనగానే నిజంగానేనా అంటారు పిల్లలు. నిజమే.. పోస్టర్లు ఎవరు తీసుకొచ్చారు అంటాడు ఆదిత్య. దీంతో శౌర్యకు అర్థం అవుతుంది. అమ్మ అబద్ధం చెప్పింది అని అనుకుంటుంది శౌర్య.
కట్ చేస్తే రత్నసీత.. సెల్ లో ఉన్న మోనిత దగ్గరికి వెళ్తుంది. వెళ్లి వచ్చావా.. నా కార్తీక్ ను కలిశావా. లెటర్ ఇచ్చావా అంటూ అడుగుతుంది. నువ్వు వెళ్లే సరికి కార్తీక్ ఉన్నాడా.. బయటికి ఎక్కడికైనా వెళ్లాడా.. అంటుంది. నేను కరెక్ట్ టైమ్ కే వెళ్లాను కానీ.. తను ఇంకా లేవలేదు. దీప కాఫీ ఇచ్చింది. ఈలోగా సార్ వచ్చారు.. మాట్లాడారు కూడా. మీరు చెప్పినట్టు ఆ బ్యాగ్ ఇచ్చి వచ్చాను అంటుంది రత్నసీత. మేడమ్ ఇంకో గంటలో మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తామని మేడమ్ చెప్పమన్నారు.. అని అంటుంది రత్నసీత. కార్తీక్ కూడా వస్తున్నాడా.. అంటే అవును అంటుంది రత్నసీత. నా కార్తీక్ ను చూడబోతున్నాను..అంటూ తెగ ఖుషీ అవుతుంది మోనిత.
Karthika Deepam 16 Sep Today Episode : కోర్టుకు రావాలంటూ కార్తీక్ కు ఫోన్ చేసిన పోలీసులు
ఇంతలో కార్తీక్ కు ఫోన్ వస్తుంది. కోర్టుకు రావాలంటూ పోలీసులు ఫోన్ చేస్తారు. దీప కూడా అక్కడికి వచ్చి మనం కూడా వెళ్లాలా.. అంటుంది…. వెళ్లాలి కదా తప్పదు అని అంటాడు కార్తీక్. మోనిత చేసిన నేరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాలి.. అని అంటాడు కార్తీక్. అంటే మనం మోనిత చేసిన నేరాల గురించి చెబితేనే తనకు శిక్ష పడుతుంది కదా అని అడుగుతుంది దీప. ఇంతలో పిల్లలు అక్కడికి వచ్చి అబద్ధం ఎందుకు చెప్పావు.. అంటారు. ఆ పిల్లల పోస్టర్లు బాబాయ్ తెచ్చాడు అన్నావు. బాబాయిని అడిగితే నాకేం తెలియదు అన్నాడు. నువ్వు మారవా అమ్మా. నాన్నా.. నువ్వు అమ్మని నమ్మకు.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శౌర్య.
అవును.. నేను ఆ పోస్టర్లను తీసుకురాలేదు కదా….. అని అంటాడు ఆదిత్య. ఎవరు తెచ్చారు అంటాడు. నేను చెబుతాను కదారా.. అంటుంది శౌర్య. అక్కడి నుంచి ఆదిత్యను తీసుకెళ్తుంది. ఆ తర్వాత కార్తీక్ కోర్టుకు వెళ్తేందుకు రెడీ అవ్వగా.. … బయటికి వెళ్తుండగా శౌర్య ఆపి నువ్వు బయటికి వెళ్తుంటే నాకు అదోలా ఉంది నాన్నా. నువ్వు మళ్లీ ఇంటికి వస్తావు కదా. నీకేం కాదు కదా అని టెన్షన్ పడుతుంది. ఇక.. కోర్టులో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.