Karthika Deepam 17 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 1251 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుద్రాణి అప్పు తీర్చడం కంటే.. తీర్చకుండా ఉండాలనే రుద్రాణి అడ్డుకట్ట వేస్తున్నట్టుంది. ఈ విషయం డాక్టర్ బాబుకు చెప్పాలా వద్దా? రుద్రాణి అప్పు ఎలా తీర్చాలి. తన బారి నుంచి ఎలా తప్పించుకోవాలి. తన పిల్లలను ఎలా తప్పించాలి.. అని బాధపడుతూ ఉంటుంది దీప. ఇంతలో ఆనంద్ వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. దీంతో ఆనంద్ కు పాలు తీసుకొని వచ్చి పాలు తాగిస్తుంది దీప. ఇంట్లో గ్యాస్ అయిపోయింది కదా.. ఆ సంగతే మరిచిపోయాను. హోటల్ లో అప్పారావును అడిగితే సిలిండర్ ఇస్తాడేమో అనుకుంటుంది దీప.
బావ.. ఇదేమో ప్రకృతి ఆశ్రమానికి.. ఇదేమో రుద్రాణి అక్కకు డెలివరీ ఇవ్వాలి అని అప్పారావు.. కార్తీక్ కు పార్శిల్ ఇస్తాడు. రుద్రాణి అనేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి రుద్రాణి నీకు తెలుసా అంటాడు. లేదు.. తెలియదు అంటాడు. ఆమెతో పెట్టుకోవద్దు అంటాడు అప్పారావు. ఆ రుద్రాణి చాలా డేంజర్.. అక్కడ ఏం మాట్లాడకు.. పార్శిల్ ఇచ్చామా.. వచ్చామా అన్నట్టుగా ఉండాలి. మరోసారి తీరిగ్గా ఉన్నప్పుడు రుద్రాణి అక్క గురించి మొత్తం చెబుతాను అంటాడు అప్పారావు. దీంతో రుద్రాణి గురించి అన్ని విషయాలు మరోసారి గుర్తుకు తెచ్చుకుంటాడు కార్తీక్. పార్శిల్ తీసుకొని సైకిల్ వేసుకొని బయలుదేరుతాడు కార్తీక్. అప్పుడే దీప కూడా హోటల్ కు వస్తుంది. కార్తీక్ సైకిల్ మీద అప్పుడే వెళ్లిపోతాడు. అప్పుడే అప్పారావు దగ్గరికి వచ్చి గ్యాస్ సిలిండర్ కావాలి అని అడుగుతుంది.
దీంతో రెండు నిమిషాల ముందు వచ్చి ఉంటే నీకే మాటిచ్చేవాడిని. ఇంతకుముందే మా బావకు మాటిచ్చాను. వాళ్ల ఇంట్లో కూడా సిలిండర్ అయిపోయిందట.. అంటాడు అప్పారావు. ఒక్కరోజు అడ్జెస్ట్ చేసుకో అంటాడు అప్పారావు. మరోవైపు మోనిత ఇంట్లోకి వచ్చిన ఆవిడ.. మోనిత లవ్ స్టోరీ విని కంటతడి పెట్టుకుంటుంది.
మీ ప్రేమ గ్రేట్ మేడమ్ అంటుంది విన్నీ. మీరు ఆర్డినరీ అనుకున్నాను కానీ.. మీరు ఎక్స్ ట్రా ఆర్డినరీ అంటుంది విన్ని. మీరు పెద్ద పెద్ద త్యాగాలు చేశారు మేడం. మీది నెంబర్ వన్ లవ్ స్టోరీ మేడమ్ అంటుంది. ప్రపంచంలో ఇలాంటి ప్రేమ కథ ఉందని చాలామందికి తెలియదు అంటుంది మోనిత.
మరోవైపు కార్తీక్.. పార్శిల్ తీసుకొని ప్రకృతి వైద్యశాలకు వెళ్తాడు. నేను వెళ్లి గోరు వెచ్చని నీళ్లు తెస్తాను అంటుంది సౌందర్య. వద్దులే సౌందర్య అంటాడు ఆనందరావు. సరే.. తీసుకురా అంటాడు. ఇంతలో కార్తీక్.. పార్శిల్ పట్టుకొని వస్తాడు.
కాస్త డల్ గా ఉంది నేను పడుకుంటాను. నువ్వు వెళ్లిరా సౌందర్య అంటాడు ఆనంద రావు. ఇంతలో కార్తీక్.. పార్శిల్ తీసుకొని లోపలకి రాబోతాడు. సౌందర్య వాటర్ కోసం అటువైపు వెళ్తుంది. కార్తీక్ అప్పుడే రూమ్ లోకి వెళ్తాడు. చూస్తే అక్కడ ఆనంద రావు పడుకొని ఉంటాడు. ఆనంద రావును చూసి కార్తీక్ షాక్ అవుతాడు.
డాడీ ఇక్కడ ఉన్నాడు ఏంటి. డాడీకి ఏమైంది అని టెన్షన్ పడతాడు కార్తీక్. దేవుడా.. డాడీకి ఏమైంది అని అనుకుంటాడు. ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారంటే నా గురించి బాధపడుతున్నారా? అన్నీ ఉన్నా ఈ ఊరికి వచ్చి ప్రకృతి వైద్యశాలలో చేరారా.. నన్ను క్షమించండి డాడీ అనుకుంటాడు కార్తీక్.
ఇంతలో వాటర్ తీసుకొని సౌందర్య రూమ్ లోపలికి వస్తుంది. కార్తీక్.. డోర్ లోపల దాచుకుంటాడు. ఏమండి.. అని పిలుస్తుంది సౌందర్య. మమ్మీ డాడీకి నేను భోజనం తీసుకొచ్చానా. దిక్కులేని వాళ్లలా ఇక్కడ జాయిన్ అయ్యారా.. అనుకుంటాడు కార్తీక్.
లేవండి.. భోజనం చేసి పడుకోండి అంటుంది సౌందర్య. ఆకలిగా లేదు సౌందర్య అంటాడు ఆనంద రావు. భోజనం చేస్తుంటే నాకు పెద్దోడే గుర్తొస్తున్నాడు సౌందర్య అంటాడు ఆనంద రావు. ఇన్నాళ్లు రుచికరమైన భోజనం చేస్తూ.. నీడపట్టునే ఇంట్లో హాయిగా ఉన్నాను. ప్రతి ముద్దు తినబోతున్నప్పుడల్లా నా కొడుకు తిన్నాడో లేదో.. అయ్యో నా మనవరాళ్లు తిన్నారో లేదో.. దీప తిన్నదో లేదో అని నాకు అనిపిస్తుంది సౌందర్య.. అంటాడు.
అందుకే భోజనం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. ఏంటి సౌందర్య మన జీవితాలు ఇలా అయిపోయాయి. పెద్దోడు ఇలా చేస్తాడు అనుకోలేదు సౌందర్య. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు.. కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లివస్తాను అంటే మనం వద్దంటామా అంటాడు ఆనంద రావు. కార్తీక్ ను మళ్లీ చూస్తానో లేదో అని నమ్మకం లేదు అంటాడు.
నాకు ఏదైనా జరగరానిది జరిగి నాకు ఏమైనా అయితే అప్పుడు నా పరిస్థితి ఏంటి. అప్పుడు నేను ఏం చేయాలి. కనీసం నా కర్మకాండలు అయినా వస్తాడో రాడో అని అంటూ ఏడుస్తాడు ఆనంద రావు. మరోవైపు రుద్రాణి మనుషులు శౌర్య, హిమలకు భోజనం తీసుకొస్తారు.
పిల్లలు ఇద్దరూ అక్కడ ఆడుకుంటూ ఉంటారు. రుద్రాణి మనుషులను చూసి ఏంటి చెప్పండి అంటారు. రుద్రాణి అక్క భోజనం పంపించింది అంటే సరే ఇవ్వండి తింటాం అంటారు. ఆ బాక్స్ తీసుకొని మిగితా పిల్లలు అందరికీ పెడతారు శౌర్య, హిమ. వాళ్లకు పెట్టి అక్కడి నుంచి జంప్ అయిపోతారు పిల్లలు.
ఇంటికి వస్తారు పిల్లలు. రుద్రాణి మనుషులు బాక్స్ పట్టుకొని స్కూల్ కు వచ్చారు అని దీపతో చెబుతారు పిల్లలు. రుద్రాణి ఆగడాలు ఎక్కువయ్యాయని అనుకుంటుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.