Home » Entertainment » Karthika Deepam 17 June 2022 Full Episode
Entertainment

Karthika Deepam 17 June Today Episode : నిరుపమ్ ఇంటికి వచ్చిన జ్వాలకు షాక్.. హిమ ఎవరో తెలుసుకుంటుందా? శోభ ప్లాన్ ఏంటి?

Authored By
Varun G
The Telugu News | Published on: June 17, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 17 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 జూన్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1381 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా పెళ్లి ఏర్పాట్లు చేయండి అంటాడు. దీంతో స్వప్న, సత్యంకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు సౌందర్య.. కార్తీక్, దీప పెళ్లి రోజు సందర్భంగా ఇల్లు అంతా శుభ్రం చేస్తుంది. నాకు ఈరోజు చాలా పాజిటివ్ గా అనిపిస్తోంది అని వాళ్ల ఫోటోలతో మాట్లాడుతుంది. ఈ ఇంట్లో ఇప్పటి వరకు అన్నీ అవశకునాలే అంటుంది. హిమ విషయంలో అంత ఘోరమైన విషయం తెలుసుకున్నాం. కానీ.. ఈరోజు మీ పెళ్లి రోజు విశేషమూ ఏంటో కానీ.. ఆనందం కలుగుతోంది అని మాట్లాడుతుంది. ఇంతలో స్వప్న, సత్యం ఇద్దరూ వస్తారు. స్వప్న.. చీర బాగుంది.. మెడలో ఏదైనా నక్లెస్ పెట్టుకోపోయావా అని అడుగుతుంది. ఇంతలో తను ఉందా ఇంట్లో అని అడుగుతుంది. దీంతో వాకింగ్ కు వెళ్లింది అని చెబుతుంది సౌందర్య. ఇంతలో ఆనంద రావు వస్తాడు. మేము ఒక మాట చెప్పడానికి వచ్చాం అంటుంది స్వప్న.

Advertisement

karthika deepam 17 june 2022 full episode

శుభవార్త చెప్పడానికి వచ్చాం అంటాడు సత్యం. మీ మనవడు ఒక కబురు పంపించాడు. అది చెప్పి వెళ్దామని వచ్చాం అంటుంది స్వప్న. హిమ రాకముందే మేము వెళ్లిపోవాలి. ఇది కూడా నిరుపమ్ ఆర్డర్ అంటుంది స్వప్న. ఇంట్లో పసుపు దించబోతున్నాం. అందుకోసం మీ మనవడు.. మిమ్మల్ని రమ్మన్నాడు అంటుంది స్వప్న. పసుపు ఎందుకు దంచుతారో తెలుసు కదా అంటుంది. పెళ్లి పనులు మొదలు పెట్టమని నిరుపమ్ చెప్పాడు. ఎలాగైనా హిమను ఇంటికి తీసుకురమ్మన్నాడు నిరుపమ్. ఈ విషయాలన్నీ చెప్పకుండా ఏదో ఒక్కటి చెప్పి తీసుకురండి అంటుంది స్వప్న. డాడీ.. ఏదో ఒకటి చెప్పి హిమను మా ఇంటికి తీసుకురండి. పెళ్లి పనులు మొదలు పెడదాం అంటుంది స్వప్న. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

దీంతో సౌందర్య చాలా సంతోషిస్తుంది. పొద్దున నుంచి మనసు ఆనందంగా అనిపిస్తే ఏంటో అనుకున్నాను. ఈ రకంగా శుభవార్త విన్నాను అంటుంది. అవును సౌందర్య.. నిరుపమ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు కానీ.. హిమను ఎలా ఒప్పించాలి అని అంటాడు ఆనంద రావు.

మరోవైపు రవ్వ ఇడ్లీ హోటల్ దగ్గరికి వెళ్తుంది జ్వాల. ఇదిగో టీ తీసుకో అంటాడు రవ్వ ఇడ్లీ. నువ్వేంట్రా టీ తెచ్చావు. నువ్వు ఈ హోటల్ ఓనర్ వి అంటుంది జ్వాల. ఇంతలో జ్వాలకు నిరుపమ్ ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు అని అడుగుతాడు. మా ఇంటికి రావాలి అంటాడు. ఒక అరగంట ఆగి బయలుదేరు అంటాడు నిరుపమ్. దీంతో సరే అంటుంది జ్వాల.

Advertisement

Karthika Deepam 17 June Today Episode : నిరుపమ్ ప్లాన్ అదుర్స్

నువ్వు రా నీ కోసమే ఎదురు చూస్తుంటాను అంటాడు నిరుపమ్. ఆ తర్వాత టీ తాగుతుంది జ్వాల. అవును.. డాక్టర్ సాబ్ ఇంటికి ఎందుకు రమ్మన్నట్టు. సత్యం సార్, స్వప్న మేడమ్ ఒక్కటయ్యారు. వాళ్ల అమ్మనాన్నలకు నన్ను పరిచయం చేస్తారా.. డైరెక్ట్ గా ఇంటికే రమ్మన్నారు అంటే.. ఇంతకన్నా ఇంకేం కావాలి అనుకుంటుంది.

మరోవైపు శోభ.. నిరుపమ్ ఇంటికి వస్తుంది. ఏంటి ఆంటి.. ఇల్లంతా అలంకరించారు.. ఏమైంది అని అడుగుతుంది కానీ.. స్వప్న ఏం చెప్పదు. మరోవైపు నిరుపమ్.. జ్వాల కోసమే ఈ ప్లాన్ వేస్తాడు. జ్వాలకు అసలు విషయం చెప్పాలని అనుకుంటాడు నిరుపమ్.

హిమతో నిరుపమ్ పెళ్లి చేస్తున్నామని శోభతో చెబుతుంది స్వప్న. ఆ హిమ కొన్ని రోజులే బతుకుతుంది. తన ఆఖరి కోరిక అనుకో. తను చనిపోయాక.. ఎలాగూ నిరుపమ్ నీవాడే అంటుంది స్వప్న. దీంతో శోభకు ఏం చెప్పాలో అర్థం కాదు. మరోవైపు హిమకు క్యాన్సర్ లేదని నిరుపమ్ కు ఎలా చెప్పాలో అర్థం కాదు శోభకు.

మరోవైపు హిమను కారులో తీసుకెళ్తూ ఉంటుంది సౌందర్య. ఎక్కడికి వెళ్తున్నాం అంటే అస్సలు చెప్పదు సౌందర్య. ఆనంద రావును అడిగినా కూడా చెప్పడు. స్వప్న ఇంటికి వెళ్లాక.. నీకు, నిరుపమ్ కు పెళ్లి పనులు మొదలయ్యాయి అని చెబుతుంది స్వప్న. దీంతో షాక్ అవుతుంది హిమ.

Advertisement

ఇంతలో అక్కడికి నిరుపమ్ వస్తాడు. ఏమైంది అని అడుగుతుంది హిమ. దీంతో నువ్వేం మాట్లాడకు హిమ అంటాడు నిరుపమ్. వెళ్లు హిమ.. రెడీ అవ్వు అంటాడు నిరుపమ్. దీంతో ఏం చేయాలో అర్థం కాదు హిమకు. మరోవైపు అరగంట అయిందని నిరుపమ్ ఇంటికి బయలుదేరుతుంది జ్వాల.

నిరుపమ్ ఇంటికి వస్తుంది. ఇంతలో హిమను పెళ్లి కూతురును చేస్తుంది సౌందర్య. జ్వాల తన ఇంట్లోకి రావడం చూస్తుంది శోభ. వామ్మో.. ఇప్పుడు ఇది వచ్చిందేంటి.. ఇప్పుడు కానీ.. హిమను ఇక్కడ చూస్తే.. హిమ ఎవరో తెలిసిపోతుంది అని అనుకుంటుంది శోభ. హిమ కాదంటే.. జ్వాలకు ఇచ్చి పెళ్లి చేస్తారు అని అనుకుంటుంది శోభ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి