Karthika Deepam 17 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 1302 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ను ప్రతిసారి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది సౌందర్య. 11 ఏళ్లు దూరం అయ్యారు. పడరాని కష్టాలు పడ్డారు. పాపిష్టిదాన్ని నేనే సరదాగా వెళ్లి రమ్మన్నాను. ఏ ముహూర్తాన అన్నానో కానీ వెళ్లిన వాళ్లు మళ్లీ తిరిగి రాలేదు.. అని వెక్కి వెక్కి ఏడుస్తుంది సౌందర్య. వాళ్లను నేను పంపించకున్నా బాగుండేదేమో అండి అని అంటుంది సౌందర్య. దీంతో వాళ్ల రాతలు అలా రాసి ఉన్నాయి అంతే. మనమేం చేయగలం చెప్పు. వాళ్లకు అలా జరగాలని ఉంది. జరిగింది.. అంటాడు ఆనంద రావు. నేను ఇలాగే ఉంటే.. మీరన్నట్టు పిల్లలు కూడా బెంగపడి పోతారండి. ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను అంటుంది సౌందర్య.
మరోవైపు హిమ.. చంద్రమ్మ, ఇంద్రుడుతో కలిసి పోతుంది. అసలు.. పోలీసులు మిమ్మల్ని ఎందుకు ఆపారు అని అడుగుతుంది హిమ. దీంతో మేము దొంగా పోలీస్ ఆట ఆడుతున్నాం అంటాడు ఇంద్రుడు. ఏం లేదు అంటుంది చంద్రమ్మ. ఏదో కవర్ చేయబోతుంది. అదేంటో అమ్మ.. మీ బాబాయి పోలీసులను చూస్తేనే భయపడిపోతాడు అని చెబుతుంది చంద్రమ్మ. దీంతో అవునమ్మా.. పోలీసులను చూస్తేనే నాకు భయం వేస్తుంది అంటాడు. ఆ తర్వాత మీ ఇంటి దగ్గర వదిలేశాం కదా. మళ్లీ వచ్చావేంటి అని అడుడుతాడు ఇంద్రుడు. దీంతో మా వాళ్లు అక్కడ ఎవ్వరూ లేరు అని చెబుతుంది హిమ.
నువ్వేం బాధపడకు అమ్మ. మీ వాళ్లు ఎవ్వరూ లేరని ఫీల్ అవకు. మనం కలిసి ఉండాలని ఆ దేవుడు రాసిపెట్టాడు. అందుకే మనం కలిశాం అంటాడు ఇంద్రుడు. ఇక నుంచి మనం కలిసే ఉందాం. కలిసే బతుకుదాం. గండా.. తనకు ఆకలిగా ఉందట.. పోయి ఏదైనా తీసుకొనిరా అంటుంది చంద్రుడు.
దీంతో పదండి పిన్ని.. రెస్టారెంట్ కు వెళ్దాం అంటుంది హిమ. రెస్టారెంట్ కా.. అంత దూరం వద్దు. ఇక్కడ బండి ఉంది కదా.. అక్కడ తిందాం అంటుంది చంద్రమ్మ. నేను ఇలా బండి మీద తిన్నానని తెలిస్తే నానమ్మ తట్టుకుంటుందా అని అనుకుంటుంది హిమ.
అమ్మానాన్న చనిపోయారని నానమ్మ ఎంత ఏడుస్తుందో ఏమో.. ఇంటికి వెళ్లాలని ఉంది కానీ.. శౌర్య ఏమంటుందో ఏమో అని బాధపడుతుంది హిమ. నాకు ఆకలిగా లేదు పిన్ని అంటుంది హిమ. దీంతో పదరా.. మనం పెద్ద రెస్టారెంట్ కు వెళ్లి తిందాం అంటాడు ఇంద్రుడు.
కట్ చేస్తే.. సౌందర్య తన కూతురు స్వప్న ఇంటికి వెళ్తుంది. తన అల్లుడికి ఫోన్ చేస్తుంది. అల్లుడు గారు నేను స్వప్న దగ్గరికి వచ్చాను.. అంటుంది. దీంతో మీరు ఇంటి దగ్గరే ఉన్నాను అన్నారు కదా. ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లండి అంటుంది.
ఇంతలో ఇంట్లోకి వస్తుంది సౌందర్య. ఏంటి ఈ నాటకాలు అని అంటుంది స్వప్న. దీంతో నా కూతురు ఇల్లు నేను ఊడవడం నాటకాలా స్వప్న అంటుంది. సడెన్ గా నా ఇంటికి ఎందుకు వచ్చావు తెలుసుకోవచ్చా అని అడుగుతుంది స్వప్న.
నీ ఇల్లు ఏంటే.. నువ్వు నా కూతురువు కావా.. నేను నీ తల్లిని కాదా అంటుంది సౌందర్య. కార్తీక్, దీప వాళ్లు అంతా పోయారని నాకూ బాధగానే ఉంది. కానీ ఈ సందర్భాన్ని వాడుకొని సంబంధాన్ని కలుపుకుందామని వచ్చావా అని అడుగుతుంది స్వప్న.
ఎందుకే గుండెను కోసినట్టు మాట్లాడుతున్నావు అంటుంది సౌందర్య. ఒకప్పుడు నువ్వు నా కూతురు గురించి ఇంతకంటే పదునుగా మాట్లాడావు కదా. అప్పుడు నాకు గుండె కోతగా అనిపించలేదా అంటుంది స్వప్న. దీంతో అలా మాట్లాడకు. మన కుటుంబం అంతా చిన్నాభిన్నం అయింది. అందరం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నా అంటుంది సౌందర్య.
అయినా నా సంసారం బాగుపడాలనే నేను కోరుకుంటున్నా. అందుకే తనను కూడా ఇక్కడికి రమ్మన్నా అంటుంది సౌందర్య. చూడు మమ్మీ. వాళ్లిద్దరూ యాక్సిడెంట్ లో పోయారు. మాటవరసకు డాడీని పలకరిద్దామని వచ్చాను. అంతే కానీ.. నా కూతురు మళ్లీ కలిసిపోయింది. మళ్లీ వరసలు కలుపుకుందామని అనుకోకు అంటుంది స్వప్న.
తమరు వెళ్తే సంతోషిస్తాం అంటుంది స్వప్న. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. అసలే పనిమనిషి కూడా రాలేదు అంటుంది. ఇంతలో నిరుపమ్ కనిపించడం లేదేంటి అని అడుగుతుంది సౌందర్య. బయటికెళ్లాడు. నీకు ఇప్పుడే చెబుతున్నాను.. లేని ప్రేమలు కల్పించుకోవద్దు అంటుంది.
కట్ చేస్తే.. ఇంద్రుడు.. హిమను ఒక పెద్ద రెస్టారెంట్ కు తీసుకొస్తాడు. కూర్చో అమ్మ అంటాడు. పెద్ద హోటలే గండా అంటుంది. నువ్వు ఇక్కడ అన్నీ తినేసేయ్ అంటాడు ఇంద్రుడు. మేము ఇంతలో బయటికి వెళ్లి వస్తాం అంటాడు ఇంద్రుడు.
మరోవైపు వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంటుంది శౌర్య. కార్తీక్, దీప గురించే ఆలోచిస్తూ ఉంటుంది శౌర్య. ఇంతలో రౌడీ అంటూ కార్తీక్ పిలుపు వినిపిస్తుంది. దీంతో నాన్నా అంటూ అతడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అతడిని కౌగిలించుకుంటుంది శౌర్య.
నాన్నా.. నీకేం కాలేదు కదా. దెబ్బలేం తగల్లేదు కదా. అమ్మ ఎక్కడ అంటుంది. దీంతో నాకేం కాలేదురా. నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు కార్తీక్. అమ్మ ఏది అంటుంది. అమ్మ షాపింగ్ కు వెళ్లింది. వచ్చేస్తుందిలే అంటాడు కార్తీక్. జరిగిన దాంట్లో హిమ తప్పేం లేదురా. నువ్వు హిమను ఏం అనకూడదు. తన తప్పేమీ లేదు.. అంటాడు.
ఇద్దరూ కలిసే ఉండాలి.. అంటాడు. కానీ.. శౌర్య వినదు. వద్దురా అలా అనొద్దు. పాపం తను కావాలని అలా చేయలేదు కదా అంటాడు. నా మాట వింటావు కదా అంటాడు కార్తీక్. తప్పు హిమదే. ఈ విషయంలో మాత్రం నువ్వు ఎంత చెప్పినా ఒప్పుకోను.. ఒప్పుకోను.. ఒప్పుకోను అంటుంది శౌర్య. ఆ తర్వాత కార్తీక్ కనిపించడు. నాన్న రాలేదా.. ఇదంతా నా ఊహనా అని అనుకుంటుంది శౌర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.