Karthika Deepam 17 May Today Episode : నిరుపమ్, హిమ నిశ్చితార్థం ఆగిపోయిందని జ్వాలకు తెలుస్తుందా? జ్వాల తనను ప్రేమిస్తోందని నిరుపమ్ కు తెలుస్తుందా?

Advertisement
Advertisement

Karthika Deepam 17 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 1354 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీకు ఉన్న తెలివితేటలు ఆ దేవుడు మాకు ఇవ్వలేదు హిమ అంటుంది సౌందర్య. హిమ హాస్టల్ కు వెళ్లిపోతా అని చెప్పడంతో సరే.. వెళ్లు. ఇప్పుడు మాతో ఏం పని ఉంటుంది. మా అవసరం ఏముంటుంది చెప్పు. జాగ్రత్తగా వెళ్లు అంటుంది సౌందర్య. వెళ్లేముందు ఒకే ఒక్క మాటకు సమాధానం చెప్పి వెళ్లవా? పెళ్లి ఎందుకు వద్దన్నావు అని అడుగుతుంది. కానీ.. హిమ మాత్రం కారణం చెప్పదు. నిన్నే అడిగేది.. ఈ ఒక్క సమాధానం నాకు చెప్పి వెళ్లు అంటుంది సౌందర్య. దీంతో నానమ్మ.. నేను ఇప్పుడేమీ చెప్పలేను అంటుంది హిమ. దీంతో నేను నీకు ముందే చెప్పాను. శౌర్య ఇంటికి వచ్చాకే నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పాను. నేను నీకు మాటిచ్చాను హిమ. తీరా వెళ్లేసరికి స్వప్న ముందు నా పరువు తీశావు అని అంటుంది సౌందర్య.

Advertisement

karthika deepam 17 may 2022 full episode

నన్నేమీ అడగొద్దు. నేనేమీ చెప్పలేను అంటుంది హిమ. అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశావు కదా. కారణం ఏంటో నీకు తెలుసు. నీ దగ్గర సమాధానం ఉంది. కానీ.. సమాధానం మాకు చెప్పట్లేదు. నువ్వు పెళ్లి ఎందుకు వద్దన్నావో చెప్పాకే ఈ ఇంటి గడప దాటాలి. నిన్ను ఎవరైనా భయపెట్టారా? పెళ్లి వద్దన్నావంటే నేనెలా నమ్మాలి. దీని వెనుక బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. నువ్వే చెబుతావని ఎదురు చూశాను. ఇప్పుడు నా నుండి తప్పించుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోతా అంటున్నావు. ఎందుకు పెళ్లి వద్దన్నావో చెప్పాకే ఈ ఇంట్లో నుంచి కదలాలి. నానమ్మను బాధపెట్టకుండా ఉండటమే గొప్ప. చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే జ్వరం వస్తుందని బాధపడేవాళ్లం. నువ్వు ఎంత అల్లరి చేసినా.. ఇబ్బంది పెట్టినా నిన్ను ప్రేమగా చూసుకునేవాళ్లం కదా. నువ్వు ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదు. నువ్వు ఎక్కడికీ వెళ్లవు. నేను వెళ్లనివ్వను. భోం చేద్దాం పదా అంటుంది సౌందర్య.

Advertisement

ఇప్పుడు కాదు.. గంటకు.. రేపు కాకపోతే ఎల్లుండి.. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే.. అప్పుడు చెప్పు.. కానీ నాకు సమాధానం కావాలి హిమ అంటుంది సౌందర్య. దీంతో వెళ్లి సౌందర్యను గట్టిగా హత్తుకుంటుంది హిమ. కట్ చేస్తే జ్వాల చాలా హ్యాపీగా ఉంటుంది.

పాటలు వింటూ డ్యాన్సులు వేస్తూ ఉంటుంది. దీంతో ఇంద్రుడు, చంద్రమ్మ ఆశ్చర్యపోతారు. ఈరోజు బయటికెళ్లి టిఫిన్ తిని వద్దాం అంటుంది జ్వాల. ఈరోజు ఖర్చుల గురించి చెప్పొద్దు అంటుంది జ్వాల. అదంతా ఎందుకు మంచిగా.. చికెన్ తెచ్చుకొని ఇంటి వద్దే వండుకుందాం అంటాడు ఇంద్రుడు.

Karthika Deepam 17 May Today Episode : నిరుపమ్ కు క్లాస్ పీకిన స్వప్న

మరోవైపు నిరుపమ్ తన పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. జీవితంలో నేను నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు అంటుంది స్వప్న. నువ్వు తాగి ఇంటికి రావడం ఏంటి అని అడుగుతుంది స్వప్న. అది నిన్ను వద్దన్నది. రిజెక్ట్ చేసింది. దాన్నేదో ప్రేమించావని.. అదే జీవితం అని నువ్వు ఇలా తాగుతూ బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోను అంటుంది స్వప్న.

మన అదృష్టం బాగుండి.. ఆ నష్టజాతకురాలు ఈ ఇంటి కోడలుగా రాలేదు సంతోషించు అంటుంది స్వప్న. రాత్రుళ్లు అలా అసహ్యంగా ఆటోలో అంటుంది స్వప్న. మరోవైపు సౌందర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్వాల. నానమ్మ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటుంది. తన నెంబర్ కనుక్కోవాలి అనుకుంటుంది.

ఇంతలో ఆటోలో డాక్టర్ సాబ్ దగ్గరికి వెళ్తుంది జ్వాల. డాక్టర్ సాబ్.. మీరు కారు ఎలా ఉందో అని నేను వచ్చాను. మీరు ఇక్కడ ఉన్నారేంటి అంటుంది జ్వాల. ఏంటి రౌడీ బేబీ.. కారు ఎటు పోతుందిలే అంటాడు. రాత్రి ఏమైంది అని అంటాడు. రాత్రి నేను ఏమైనా ఎక్కువ మాట్లాడానా అంటాడు నిరుపమ్.

మీరు మందు తాగుతారని నాకు తెలియదు అంటుంది జ్వాల. నిజం చెప్పు.. రాత్రి నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టానా అంటాడు నిరుపమ్. ఏంటో జ్వాల.. పొద్దున్నే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంటాడు నిరుపమ్. ఆ తర్వాత హిమ.. నిరుపమ్ దగ్గరికి వెళ్లినా.. నిరుపమ్ మాత్రం మాట్లాడడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

2 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

1 hour ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

This website uses cookies.