Home » Entertainment » Karthika Deepam 18 April 2022 Full Episode
Entertainment

Karthika Deepam 18 April Today Episode : జ్వాలకు షాకిచ్చిన నిరుపమ్, హిమ.. జ్వాల ఆటో కాల్చేశారని స్వప్నపై పగ పెంచుకున్న ఇంద్రుడు, చంద్రమ్మ

Authored By
Varun G
The Telugu News | Published on: April 18, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 18 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 1329 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వప్న.. ఎందుకు ఇలా చేస్తున్నావు. తను ఏం తప్పు చేసింది అని అడుగుతాడు సత్యం. దీంతో మీరు మాట్లాడకండి.. ఎవరో అనామనకురాలు వండి పెడితే తింటున్నావు. నీతో నాకు మాటలేంటి అని అంటుంది స్వప్న. హల్ మేడమ్.. మీరు వండి పెడితే మేము వంట చేయాల్సిన అవసరం ఉండదు కదా అంటుంది జ్వాల. దీంతో ఏం కూసావే అంటూ తనను కొట్టబోతుంది. దీంతో ఇంతలో నిరుపమ్ వచ్చి తన చేయి ఆపుతాడు. ఏంటి మమ్మి ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటాడు.

Advertisement

karthika deepam 18 april 2022 full episode

దీనికి గుడిలో చెంప పగులగొట్టినా బుద్ధి రాలేదు. మీరందరూ ఇచ్చిన చనువు వల్లనే అది నెత్తికెక్కింది.. చీ చీ అంటుంది స్వప్న. మేడమ్ చీచీ ఏంటి మేడమ్.. ఆటోలో తిరిగితే తప్పేంటి మేడమ్ అంటుంది జ్వాల. ఏంటి డాక్టర్ సాబ్.. నేను ఏం తప్పు చేశాను.. ఆటో అంటే అంత చులకనా అంటుంది జ్వాల. నా కుటుంబాన్ని మొత్తం గుప్పిట్లోకి తీసుకున్నావు కదే అంటుంది స్వప్న. అక్కడ కొందరు.. ఇక్కడ కొందరు ఉంటే దాన్ని కుటుంబం అనరు అంటుంది జ్వాల. నువ్వెంత నీ బతుకెంత అంటుంది స్వప్న. దీంతో జ్వాల ఇక్కడ.. జ్వాలకు భయపడటం తెలియదు అంటుంది. ఏం చేస్తారు అంటుంది. దీంతో ఏం చేస్తానో చూడు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న.

Advertisement

వెళ్లి జ్వాల ఆటోను తగలబెడుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. జ్వాలకు ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి.. నీ పేరు జ్వాలానా. ఇప్పుడు మండుతున్న ఆ జ్వాలలను చూడు జ్వాల అంటుంది స్వప్న. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది జ్వాల.

ఆ జ్వాలలు ఆరిపోయేదాకా ఉండి ఇంటికెళ్లి ఏడువు అంటుంది స్వప్న. ఇలాంటి వాళ్లను ఇలాగే బుద్ధి చెప్పాలి. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఒళ్లు దగ్గర పెట్టుకో అంటుంది స్వప్న. ఇది నీకే కాదు.. నా జోలికి ఎవరు వచ్చినా సరే.. ఇలాగే జరుగుతుంది. ఇదే నా హెచ్చరిక అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న.

Advertisement

జ్వాల నన్ను తీసుకొచ్చి పెద్ద తప్పు చేశావని నేను ముందే చెప్పాను అని మనసులో అనుకుంటాడు సత్యం. మంటల్లో కాలిపోతున్న తన ఆటోను చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది జ్వాల. మరోవైపు తన అమ్మానాన్న ఫోటోలను చూసి ఏడుస్తాడు రవ్వ ఇడ్లీ.

Karthika Deepam 18 April Today Episode :  స్వప్న ఇంటికెళ్లి తనను తిట్టిన సౌందర్య

మీ పేర్లేమిటో నాకు తెలియదు. అంత మాటకు వస్తే నా పేరు కూడా నాకు తెలియదు. నేను ఎందుకు ఇలా ఒంటరిని అయ్యానో తెలియదు. నేను నష్టజాతకుడిని కాదని నిరూపిస్తాను. అందరూ నన్ను మెచ్చుకునేలా గొప్పవాడిని అవుతాను అని అనుకుంటాడు రవ్వ ఇడ్లీ.

మరోవైపు కోపంతో సౌందర్య.. స్వప్న ఇంటికి వెళ్తుంది. ఆటోను తగులబెడుతావా అని ప్రశ్నిస్తుంది. అవును.. ఆ ఆటోను తగులపెట్టేశాను. నాకు కోపం వచ్చింది. కాదు కాదు ఒళ్లు మండింది అంటుంది స్వప్న. అసలు నువ్వు ఏమనుకుంటున్నావే.. ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది సౌందర్య.

ఏదో ఒక్కసారి నోరు జారినందుకు.. ఆవేశంలో నీ కూతురును అన్నందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధిస్తూనే ఉన్నావు కదా అంటుంది సౌందర్య. మీరు ఇంకా మీ కూతురు మారుతుందని ఆశ పడుతున్నారా? మీ కూతురుకు ఒక దండం. ఇక్కడే ఉంటే మీ ఆరోగ్యం పాడు అవుతుంది. వెళ్దాం పదండి అంటుంది సౌందర్య.

Advertisement

కానీ.. నేను రాలేను సౌందర్య.. నేను ఇక్కడే ఉంటాను అంటాడు ఆనంద రావు. మరోవైపు మమ్మీ ఎంత పని చేసింది. కోపం వస్తే అరుస్తుంది.. తిడుతుంది కానీ.. ఇలా చేస్తుందనుకోలేదు అని అనుకుంటాడు నిరుపమ్. మరోవైపు జ్వాల కూడా ఇంటికెళ్లి బాధపడుతుంది.

రేపటి నుంచి నేను ఏం చేయాలి. నాకేం అర్థం కావడం లేదు అనుకుంటుంది. హిమ కూడా ఇంటికెళ్లి బాధపడుతుంది. అయ్యో.. శౌర్య అత్తయ్య ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. కళ్ల ముందే నీ ఆటోను అత్త కాల్చేసింది. నువ్వెవరో తెలియక నీ మీద కూడా పగ సాధిస్తోంది అనుకుంటుంది హిమ.

ఆటో కాలిపోవడంపై చంద్రమ్మ, ఇంద్రుడు కూడా బాధపడతారు. మన మూడు ప్రాణాలు ఆటో మీదనే కదా నడిచేది అంటాడు ఇంద్రుడు. ఏంటమ్మా మాట్లాడవు. తనకు బుద్ధి లేదా. కడుపు అన్నం తింటుందా.. లేదా.. మన కడుపు కొట్టడం ఏంటి.. పదా వెళ్దాం తన సంగతేంటో తేల్చుకుందాం. చంద్రుడు పదా.. మన సత్తా ఏంటో చూపిద్దాం అంటాడు ఇంద్రుడు.

అందరూ అక్కడే ఉండి కూడా ఎవ్వరూ ఏం మాట్లాడలేదు అని బాధపడుతుంది జ్వాల. నాకు మీ ఆవిడ గారి మీద.. మీ అల్లుడి గారి మీదే కోపం అని ఆనంద రావుతో అంటుంది స్వప్న. ప్రేమ, ఆప్యాయత అనే విలువ నాకు తెలుసు. ఆ విలువ తెలియని వారు అంటేనే నాకు కష్టం అంటుంది స్వప్న.

Advertisement

మరోవైపు హిమ, నిరుపమ్ కలిసి జ్వాల కోసం కొత్త ఆటో కొంటారు. ఆ తర్వాత అందరూ కలిసి రెస్టారెంట్ కు వెళ్లి సరదాగా భోం చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి