Karthika Deepam 18 Dec Today Episode : కార్తీక్ కు భారీ షాకిచ్చిన రుద్రాణి.. కోటేశ్ అప్పు కట్టాలంటూ ఒత్తిడి.. మరోవైపు మోనితకు చుక్కలు చూపించిన సౌందర్య

Advertisement
Advertisement

Karthika Deepam 18 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 డిసెంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 1226 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోటేశ్, శ్రీవల్లి ఇద్దరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఆ బాబు మోనిత బిడ్డ అని ఎవ్వరికీ తెలియదు. చివరకు కార్తీక్, దీపకు కూడా తెలియదు. ఇంటికి వచ్చాక.. బాబును చూసి.. ఈ బాబు రోజుల బిడ్డలా లేడు కదా అంటాడు కార్తీక్. దీంతో దీప కూడా అదే మాట అంటుంది. దీంతో కోటేశ్ షాక్ అవుతాడు. నిజం చెప్పు కోటేశ్.. ఈ బిడ్డ ఎవరు అని అడుగుతుంది దీప. దీంతో ఈసారి కూడా బిడ్డ చనిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియలేదు. డాక్టర్ ఇక కాన్పు అవడం కష్టం అని చెప్పారు. దీంతో హాస్పిటల్ లోనే ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకున్నాం అంటాడు కోటేశ్. మరోవైపు ఆ కోటేశ్ ఇంట్లోకి వచ్చినట్టు రుద్రాణి మనిషి వచ్చి చెబుతాడు. దీంతో రుద్రాణికి తీవ్రమైన కోపం వస్తుంది.

Advertisement

karthika deepam 18 december 2021 full episode

ఇక.. శౌర్య, హిమ ఇద్దరూ పిల్లాడితో ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీవల్లి.. దీపను ఇలా అడుగుతుంది. అక్క.. అసలు మీరు ఎవరు? మిమ్మల్ని చూస్తుంటే బాగా కలిగిన కుటుంబంలా కనిపిస్తున్నారు అంటుంది శ్రీవల్లి. దీంతో దీప, కార్తీక్ షాక్ అవుతారు. శ్రీవల్లి అలా అడిగినందుకు కోటేశ్.. తనపై సీరియస్ అవుతాడు. దీంతో దీప పర్లేదులే అంటుంది. పిల్లలను ఆడుకోవాలని చెబుతుంది దీప. ఆ తర్వాత మాది విజయనగరం అని చెబుతుంది. మేము మాది కలిగిన కుటుంబం.. లేని కుటుంబం అని కాదు కానీ.. హాయిగా బతికే కుటుంబం.. అని చెబుతుంది. ఇప్పటికి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను అని అంటుంది. మరోవైపు మోనిత.. సౌందర్య ఇంట్లోనే ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది. హాల్ లో తను పెట్టిన ఫోటోతో సెల్ఫీలు దిగుతూ ఉంటుంది. ఇంతలో సౌందర్య వస్తుంది.

Advertisement

ఆ ఫోటోను నేలకేసి కొడుతుంది. ఈ ఫోటోను నేను నేలకేసి కొడుతా అని మీరు ఊహించారా? అని అంటుంది సౌందర్య. మోనితకు బాగా క్లాస్ పీకుతుంది. నీకు భయపడి నిన్ను ఏమీ అనడం లేదనుకున్నావా? నిన్ను చంపడానికి, నిన్ను ఇంట్లో నుంచి గెంటేయడానికి నాకు క్షణం పట్టదు అని వార్నింగ్ ఇస్తుంది సౌందర్య.

మరోవైపు రుద్రాణి మనిషి కార్తీక్ ఇంటికి వస్తాడు. నిన్ను అక్క రమ్మంటోంది అంటాడు. రాకపోతే అంటాడు కార్తీక్. అక్కే వస్తుంది ఇక్కడికి అంటాడు. రుద్రాణి మళ్లీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తుందో అని భయపడతాడు కార్తీక్. దీంతో నేనే వస్తాను అని వాళ్లతో వెళ్తాడు కార్తీక్.

మరోవైపు శ్రావ్య, ఆదిత్య.. ఇద్దరూ ఆ మోనిత గురించే ఆలోచిస్తుంటారు. ఇంట్లోకి వచ్చి ఆ మోనిత ఇంత రచ్చ చేస్తుంటే అందరం చూస్తూ కూర్చున్నాం.. అంటాడు. అవును.. ఆ మోనితకు అందరూ భయపడుతున్నారు అందుకే ఆ మోనిత రెచ్చిపోతోంది అంటుంది శ్రావ్య.

Karthika Deepam 18 Dec Today Episode : కార్తీక్ ను తన దగ్గరకు రావాలంటూ పిలిచిన రుద్రాణి

కట్ చేస్తే రుద్రాణి దగ్గరికి వెళ్తాడు కార్తీక్. ఈరుద్రాణి అంటే అటు పది ఊళ్లు.. ఇటు పది ఊళ్లు చెప్పుకుంటాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా నేను మంచిదాన్ని అని చెప్పుకోరు. అది నా రేంజ్. నేను అందరూ అనుకున్నట్టే చాలా చెడ్డతిక్కదాన్ని. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను.. నచ్చకపోతే నేలకేసి కొడతాను అంటుంది రుద్రాణి. ఆ దస్తావేజుల మీద సంతకం పెట్టు అంటుంది.

ఏ ఊరో తెలియదు.. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అయినా కూడా ఇంట్లో ఉండమన్నా. ఆ కోటేశ్ గాడి సామాన్లు ఎందుకు ఇంట్లో వేశావు. వాళ్లను కొట్టావు.. నీ పెళ్లాం.. ఆ శ్రీవల్లి, కోటేశ్ ను ఏకంగా ఇంట్లోనే పెట్టేసుకుంది. ఇన్ని మంచిపనులు చేసి మీరు అంతా పుణ్యం సంపాదిస్తే ఎలా అంటుంది రుద్రాణి.

దీంతో ఏమాత్రం ఆలోచించకుండా కార్తీక్ సంతకం పెట్టేస్తాడు. దీంతో రుద్రాణి సంతోషం వ్యక్తం చేస్తుంది. అక్కా సంతకం పెట్టాడు సరే.. మరి డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తావు అంటాడు. దీంతో నేనేమీ పిచ్చిదాన్ని కాదురా. డబ్బులు ఇవ్వకపోతే.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా.. అందులో ఒకరిని నా ఇంటికి తెచ్చుకుంటానని ఈ అగ్రిమెంట్ లో రాశాను అని చెబుతుంది రుద్రాణి.

దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. తర్వాత కార్తీక్ ఇంటికి వచ్చి పిల్లలను చూసి కంటతడి పెడతాడు. కార్తీక్ ఏడుస్తున్నాడని చూసి దీప లేస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Zodiac Signs : 29 జనవరి 2026 గురువారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు జేబులో రాగి నాణెం ఉంచుకోండి

Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…

32 minutes ago

Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్..!

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…

2 hours ago

Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…

9 hours ago

Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం

Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…

10 hours ago

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

11 hours ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

12 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

13 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

14 hours ago