Pushpa Movie : రెండేళ్ల నుంచి ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ శుక్రవారం విడుదలైంది. థియేటర్స్‌లో ఈ సినిమా చూసి మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బన్నీ-సుకుమార్ ల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’పై ఫ్యాన్స్, సినీ లవర్స్ పెట్టుకున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కాంబోలో గతంలో వచ్చిన ‘ఆర్య, ఆర్య-2’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి. కాగా, ‘పుష్ప’ సినిమా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘రంగస్థలం’ తర్వాత చేసినది. ఈ సినిమాను సుకుమార్ ‘రంగస్థలం’తో పోల్చుతూ కొందరు అభిమానులు కంపారిజన్స్ చేస్తున్నారు.సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రం నేటివిటీకి తగ్గట్లు ఉండటంతో పాటు అందులో కఠోరమైన వాస్తవికతను చూపించారని ప్రేక్షకులతో పాటు విమర్శకులూ ప్రశంసించారు.
కాగా, ‘పుష్ప’లో ఎటువంటి అంశం ప్రస్తావించానేది చర్చనీయాంశంగా ఉంది. ఇకపోతే బన్నీ గతేడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన బ్లాక్ బాస్టర్ సినిమా ‘అల వైకుంఠపురములో’ తర్వాత చేస్తున్న పిక్చర్ ఇది. పార్ట్ వన్ ఈ ఏడాది రిలీజ్ కాగా, పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతున్నది. మూడున్నరేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు.ఈ సినిమాను సుక్కు ‘రంగస్థలం’ స్టైల్‌లోనే తీశాడని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే, ‘రంగస్థలం’ ఫిల్మ్ అంతా ఎంగేజింగ్‌గా తీయలేకపోయాడని అంటున్నారు. సినిమాలో హై పాయింట్స్ విషయంలో కొంత అంచనా తప్పారని, ఇంటర్వెల్ పాయింట్ మాత్రమై హైలైట్‌గా తీశారని చర్చించుకుంటున్నారు.
సెకండాఫ్, క్లైమాక్స్ సీన్స్ సినిమాను నిలబెట్టే విషయంలో కొంత విఫలమయ్యాయని ఈ క్రమంలోనే విమర్శలు చేస్తున్నారు కొందరు. అయితే, మొత్తంగా రంగస్థలం సినిమా రేంజ్‌లో పుష్ప లేదని కొందరు సినీ అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సునీల్‌ను మనం ఇప్పటి వరకు కామెడీ హీరోగానే చూశాం. అయితే ఈ సినిమాలో సరికొత్త సునీల్‌ను చూస్తాం. మళయాళ హీరో ఫహాద్ ఫజిల్‌ను మళయాళ మార్కెట్ కోసమే పెట్టారు అనిపించింది.
తొలి భాగంలో అతడి పాత్ర జీరో. మరి సెకండాఫ్‌లో అతడి పాత్రకు స్కోప్ ఉంటుందేమో ? చూడాలి. ఇక అనసూయను రంగస్థలంలో పెట్టాం కదా ? ఆ హిట్ సెంటిమెంట్‌తో మాత్రమే ఇక్కడ పెట్టాలని బలవంతంగా ఆమె పాత్ర ఇరికించినట్టుగా ఉంది. ఆమె పాత్ర వేస్టు.. వేస్టున్నర. ఓవరాల్ గా రంగస్థలం రేంజ్ సినిమా అయితే పుష్ప కాదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.