Karthika Deepam 18 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1279 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన బాబాయిని టెన్షన్ పడొద్దని అంటుంది మోనిత. చెప్పే వాళ్లు వంద చెబుతారు నువ్వు అవేమీ పట్టించుకోకు. దీప నీకు ఏదో చెప్పిందని నువ్వు అస్సలు టెన్షన్ పడకు అంటుంది మోనిత. కార్తీక్ నిజంగా మనకు హెల్ప్ చేస్తాడా అని అడుగుతాడు తన బాబాయి. కార్తీక్ కు నేనంటే చాలా ఇష్టం. నీకెందుకు బాబాయి. కార్తీక్ తో నీకు ఆపరేషన్ చేయిస్తాను. నా మీద నమ్మకం లేదా అని అడుగుతుంది మోనిత. అది కాదమ్మా.. ఈ గొడవల్లో కార్తీక్ నాకు ఆపరేషన్ చేయనంటాడేమోనని భయంగా ఉంది అంటాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు బాబాయి. నేను ఉన్నాను కదా. అంతా నేను చూసుకుంటాను. నీకు ఆపరేషన్ జరుగుతుంది. నేను చేయిస్తాను సరేనా. ఉండు నీకు పాలు తీసుకొస్తాను అని బుజ్జగిస్తుంది మోనిత.
మరోవైపు ఆనంద్ తో అందరూ సంతోషంగా ఆడుతూ ఉంటారు. ఇంతలో శ్రావ్య వచ్చి అత్తయ్య భోజనం చేద్దాం రండి అంటుంది. నానమ్మ ఈరోజు ఏం వంటలు చేశారు అని అడుగుతుంది శౌర్య. నీకు ఏది ఇష్టమో నాకు తెలుసు కదా. మీకు నచ్చినవి చేయించాను అంటుంది సౌందర్య. పద దీప అని అంటాడు కార్తీక్. దీంతో మీరు వెళ్లండి డాక్టర్ బాబు. కాసేపాగి తింటాను అంటుంది దీప. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏమైందిరా పెద్దోడా అంటే. ఏం కాలేదు మమ్మీ.. నేను చూసుకుంటానులే అంటాడు కార్తీక్. మోనిత వాళ్ల బాబాయికి ఆపరేషన్ చేస్తా అనేసరికి దీపకు నచ్చడం లేదు అని అనుకుంటాడు. ఇక నుంచి మోనిత గొడవ ఉండకుండా చేద్దామని నేను అనుకుంటున్నా. దీప ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని అనుకుంటాడు కార్తీక్.
మరోవైపు కార్తీక్.. మోనిత బాబాయి రిపోర్ట్స్ చూస్తాడు. నేను రాసిచ్చిన మందులు వాడండి.. అంటాడు. సరే డాక్టర్ గారు.. ఆపరేషన్ అని అనబోతాడు. దీంతో బాబాయి ఆపరేషన్ గురించి కార్తీక్ చూసుకుంటాడు అని చెబుతుంది మోనిత. దీంతో అవునండి.. సర్జరీ విషయాలు నేను తనకు చెబుతాను అంటాడు కార్తీక్.
నన్ను కొన్నాళ్లు బతికిస్తారా అంటాడు బాబాయి. దీంతో నువ్వేం టెన్షన్ పడకు బాబాయి అని అతడిని బయటికి పంపిస్తుంది. ఈ ఆపరేషన్ అయ్యాక మాట తప్పవు కదా అని అడుగుతాడు కార్తీక్. దీంతో మాట అంటే మోనిత.. మోనిత అంటే మాట అంటుంది మోనిత.
కార్తీక్.. ఇలా డైరెక్ట్ గా చెబుతున్నావంటే ఈ ఆపరేషన్ చేసి నన్ను వదిలించుకుందామని అనుకుంటున్నావా.. మనిద్దరం కలవాలని మనం అనుకున్నామా లేదు కదా. ఇది దేవుడి లీల కార్తీక్. నువ్వు డాక్టర్ వి. నేను డాక్టర్ ని. మన అబ్బాయిని కూడా డాక్టర్ ను చేద్దాం కార్తీక్ అంటుంది మోనిత.
కార్తీక్.. నువ్వంటే నాకు ఎంతిష్టమో.. నువ్వంటే నాకు ఎంత ప్రేమో.. ఎంత గౌరవమో నీకు తెలియదా అని అంటుంది. ఆహా.. నేనంటే నీకు గౌరవం కూడా ఉందా. నిజంగా గౌరవం ఉంటే.. ఇలాంటి పిచ్చి పనులు మానేయ్. నన్ను వెంటాడకు. నా కుటుంబాన్ని వదిలేయ్. నన్ను ప్రశాంతంగా ఉండనీయ్ అంటాడు కార్తీక్.
అలా ఎలా మాట్లాడుతున్నావు కార్తీక్. నేను నీ భార్యను. మనకు ఒక బాబు ఉన్నాడు అంటుంది మోనిత. షట్ అప్ మోనిత. ఇకనైనా ఇవన్నీ ఆపేయ్ ప్లీజ్ అంటాడు కార్తీక్. దీంతో సరే కార్తీక్.. నువ్వే ఇలా అంటుంటే నేనేం మాట్లాడను చెప్పు. ముందైతే బాబాయి ఆపరేషన్ చేయి.. నామీద కోపంతో అది ఆపొద్దు వస్తాను అని చెబుతుంది మోనిత.
నిజమైన ప్రేమను ఈ ప్రపంచం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. బయటికి వచ్చి బాబాయి ఆపరేషన్ తోనే మనం కలిసే ఆపరేషన్ నేను ప్లాన్ చేసుకున్నా అని మనసులో అనుకుంటుంది మోనిత.
మరోవైపు దీప.. కార్తీక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా డాక్టర్ బాబు మీద నిషేధం పోవడానికి మోనిత ప్రయత్నించిందా. తన స్వార్థం లేకుండా మోనిత ఎందుకు ఇలా చేస్తుంది. మోనితకు నిజంగా తన బాబాయి మీద అంత ప్రేమ ఉందా? లేక తన బాబాయి ఆపరేషన్ ను అడ్డం పెట్టుకొని కొత్త నాటకాన్ని మొదలు పెట్టిందా అని అనుకుంటుంది దీప.
ఏది ఏమైనా మోనితను మాత్రం వదిలిపెట్టకూడదు. తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది దీప. మరోవైపు కార్తీక్ ఆసుపత్రిలో ఉంటాడు. ఆనంద రావు ఆసుపత్రికి వస్తాడు. కార్తీక్ రూమ్ లోకి డైరెక్ట్ గా వస్తాడు ఆనంద రావు. డాడీ మీరెప్పుడు వచ్చారు అంటాడు.
ముందు పేషెంట్ ను చూడు. మనం తర్వాత మాట్లాడుకుందాం అంటాడు ఆనంద రావు. ఏంటి డాడీ చెప్పకుండా వచ్చారు అంటాడు. నువ్వు చెప్పకుండా వెళ్లలేదా అంటాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయానని కోపమా అంటాడు కార్తీక్. మాకు కోపం వస్తే ఏం చేస్తాంలే అంటాడు ఆనంద రావు.
నీ ప్రాక్టీస్ గ్రీక్టీస్ మొత్తం ఆపేసేయ్.. ఇక నుంచి నువ్వు డాక్టర్ పని చేయొద్దు. ఇక నుంచి నువ్వు ఏదైనా బిజినెస్ చూసుకో అంటాడు ఆనంద రావు. ఆ మోనిత బాబాయి ఆపరేషన్ ఎందుకు చేస్తా అన్నావు. ఆ మోనిత నీ దగ్గరికి వచ్చిందట. నువ్వు ఆపరేషన్ చేస్తా అన్నావట.. ఇదంతా ఏంటి అంటాడు ఆనంద రావు.
మరోవైపు మోనిత బాబాయి టెన్షన్ తో ఉంటాడు. నా ఆయుధం ఏంటో ఆలోచిస్తోందేంటటి అని అనుకుంటుంది మోనిత. ఏంటి బాబాయి.. ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు మోనిత నా ఆపరేషన్ గురించి అంటాడు. నా ఆపరేషన్ గురించి ఆలోచిస్తూ భయపడుతున్నారా. మీరు మంచివాళ్లు. మీరేం టెన్షన్ పడకండి అంటుంది మోనిత.
బాబాయి సిక్స్త్ సెన్స్ బాగానే పని చేస్తుంది. పోయే కాలం దాపురిస్తే ఇలాగే తెలుస్తుందట అని అనుకుంటుంది మోనిత. సడెన్ గా వచ్చాను కదా అమ్మ.. అంటాడు బాబాయి. నీ ఆపరేషన్ ను అడ్డు పెట్టుకొని నేను దీపం శాపం అనే మరో ఆపరేషన్ ను స్టార్ట్ చేశాను అని అనుకుంటుంది మోనిత.
మరోవైపు ఆనందరావు, కార్తీక్.. ఇద్దరూ ఆవేశంగా ఇంటికి వస్తారు. ఏమైంది అని సౌందర్య అడుగుతుంది. దీంతో దీప మీద అరుస్తాడు. దీప తన అభిప్రాయాలను అందరి మీద రుద్దింది అంటాడు కార్తీక్. దీప ఎక్కడికి వెళ్లింది అంటే లేదు అంటుంది సౌందర్య.
ఆ మోనిత వాళ్ల బాబాయికి ఆపరేషన్ అని తెలిసి వద్దని చెప్పేందుకు వెళ్లాను అని అంటాడు ఆనంద రావు. డాడీ.. దీన్ని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు అంటాడు కార్తీక్. అందరూ అదే మాట అంటారు. అవును అన్నయ్య.. తను మన ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసు కదా అంటాడు ఆదిత్య.
తను ఇబ్బంద పెట్టింది కాబట్టే ఒప్పుకున్నాను. ఈ ఆపరేషన్ చేస్తే అన్నీ వదిలేస్తానన్నది.. అన్నింటినీ మానేస్తానని చెప్పింది.. అంటాడు. దీప మాటలే వింటారా.. దీప కంటే నాకు ఈ ఇంట్లో విలువ లేదా. నాకు ఈ ఇంట్లో ఎటువంటి స్థానం ఉందో అర్థం అవుతుంది అంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.