Karthika Deepam 18 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 జనవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 1252 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలు భయపడుతూ ఇంటికి వచ్చి ఆ రుద్రాణి మళ్లీ స్కూల్ కు బాక్స్ పంపించింది అని అంటారు. దీంతో దీపకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు కార్తీక్.. సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. తన తండ్రి తల్లి పరిస్థితి గురించి తెలుసుకొని షాక్ అవుతాడు. ఏం చేయాలో తనకు అర్థం కాదు. డాడీ ఇలా అవ్వడానికి కారణం నేనే. ఈ పాపమంతా నాదే. కళ్లతో చూసి కూడా డాడీ అని పిలవలేకపోయాను. మమ్మీ డాడీ బాధపడుతుంటే మీరు బాధపడకండి. నేను బాగానే ఉన్నాను.. అని అరిచి చెప్పలేకపోయాను.. అని అనుకుంటాడు కార్తీక్.
ఇంతలో కార్తీక్ హోటల్ కు వస్తాడు. ఏంటి బావా ఇంత తొందరగా వచ్చావు.. అని అంటాడు అప్పు. నా మనసు ఏం బాగాలేదు. ఈరోజుకు నువ్వు ఇచ్చేసేయ్ అంటాడు కార్తీక్. దీంతో ఏమైంది అని అనుకుంటాడు అప్పారావు. మరోవైపు రిజిస్ట్రేషన్ కు సమయం అవుతోంది. త్వరగా వెళ్దాం పదా అంటుంది రుద్రాణి. దీంతో అక్క నాకు కొంచెం పని ఉంది. వెళ్తూ వెళ్తూ ప్రకృతి వైద్యశాలలో మా ఆవిడకు మందులు తీసుకెళ్దాం అక్క అంటాడు అబ్బులు. దీంతో సరే అంటుంది రుద్రాణి. కట్ చేస్తే ఆనందరావు, సౌందర్య.. ఇద్దరూ ప్రకృతి వైద్యశాలలో యోగా చేస్తుంటారు. యోగా గురువు వాళ్లకు యోగా నేర్పిస్తూ ఉంటాడు. ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెబుతాడు. పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి అని చెబుతాడు. ఇంతలో రుద్రాణి కారు ప్రకృతి వైద్యశాలకు వచ్చి ఆగుతుంది.
అబ్బులు వచ్చి మా ఇంటి ఆవిడకు మందులు ఇస్తా అన్నారు కదా.. ముందు మందులు ఇవ్వండి అంటాడు అబ్బులు. బాబు.. నేను ఇక్కడ ధ్యానం నేర్పిస్తున్నాను. ఇలా వచ్చి అరవొచ్చా.. తప్పు కదా అంటాడు గురువు. దీంతో మా అక్క తిడుతుంది. ముందు మందులు ఇవ్వండి అంటాడు అబ్బులు. వీడు ఇంకా రావడం లేదేంటి అని రుద్రాణి అక్కడికి వస్తుంది. గురువు గారు ఆగమంటున్నారు అంటాడు.
గురువు లేడు గిరువు లేడు అంటూ ఏదేదో వాగుతుంది రుద్రాణి. దీంతో సౌందర్య లేచి.. ఎందుకు అమర్యాదగా మాట్లాడుతున్నారు అంటుంది సౌందర్య. దీంతో నువ్వు ఎవరే అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది రుద్రాణి. దీంతో రుద్రాణి చెంప చెళ్లుమనిపిస్తుంది సౌందర్య.
దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఇది ప్రకృతి వైద్యశాల.. మేం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇక్కడ వచ్చి లొల్లి చేస్తావా.. నీలాంటి వికృత మనుషులను స్థానం లేదుపో అంటుంది సౌందర్య. ఈ రుద్రాణినే కొట్టిన రెండో దానివి నువ్వు. తెలిసికొట్టినా.. తెలియకకొట్టినా తప్పు తప్పే. దీనికి పదింతలు పగ తీర్చుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రుద్రాణి.
మరోవైపు దీప.. తన పిల్లల గురించి రుద్రాణికి చెల్లించాల్సిన అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఓ కారు స్పీడ్ గా వెళ్తుంది. కళ్లు నెత్తికెక్కాయా చూసుకొని నడపండి అంటుంది దీప. అది రుద్రాణి కారు. దీంతో రుద్రాణఇ మనుషులు కారు దిగుతారు. కారు ఎలా నడుపుతున్నావు. కళ్లు మూసుకొని నడుపుతున్నావా.. తాగి నడుపుతున్నావా అంటుంది.
దీంతో అది రుద్రాణి అక్క బండి ఏం చేస్తావు ఏంటి అంటాడు దీంతో మనోడి చెంప చెళ్లుమనిపిస్తుంది. మర్యాదగా మాట్లాడు.. అంటుంది. ఇంతలో అబ్బులు వెళ్తాడు. ఇంకో వ్యక్తి.. ఇప్పుడే ఆశ్రమంలో ఓ మహిళ వాయినం ఇచ్చింది.. అసలే చిరాకులో ఉంది అంటాడు.
కట్ చేస్తే మోనిత.. విన్నితో మాట్లాడుతూ ఉంటుంది. చూశావా విన్ని ఈ లోకమే ఇంత అంటూ ఏదో చెబుతుంది మోనిత. నన్ను ఒకప్పుడు తిట్టిన వాళ్లు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు అంటుంది. ఈ లోకమే ఇంత అంటుంది. దీపక్క అభిమాన సంఘాల్లో మార్పు వచ్చింది. క్రమంగా మోనిత అభిమాన సంఘాలుగా మారిపోతున్నారు అంటుంది.
మరోవైపు కార్తీక్.. ఎందుకు నా వాళ్లందరినీ బాధపెట్టాలి అని అనుకుంటాడు. మరోవైపు సౌందర్య, ఆనంద రావు ఇద్దరూ ఆశ్రమంలో కూర్చొని ఉంటారు. నువ్వు అనవసరంగా తన మీద చేయి చేసుకున్నావేమో అంటాడు ఆనంద రావు. ఆ విషయం మీరు మరిచిపోండి అంటుంది సౌందర్య.
రుద్రాణిని కొట్టింది సౌందర్యే అనే విషయం తెలియక.. తనను ఒకసారి కలిసి వెళ్దామని ఆశ్రమానికి వస్తుంది దీప. కానీ.. అక్కడ తన అత్తామామను చూసి షాక్ అవుతుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.