Home » Entertainment » Karthika Deepam 18 May 2022 Full Episode
Entertainment

Karthika Deepam 18 May Today Episode : జ్వాలను కోపంతో కారులో తీసుకెళ్లిన సౌందర్య.. తనే శౌర్య అనే విషయం తెలిసిందా? హిమ గురించి శౌర్య తెలుసుకుంటుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: May 18, 2022, 10:33 am
Advertisement

Karthika Deepam 18 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 మే 2022, బుధవారం ఎపిసోడ్ 1355 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ సాబ్.. మళ్లీ మరు మందు ఎప్పుడు తాగుతారో చెబుతారా అని నిరుపమ్ ను అడుగుతుంది జ్వాల. దేనికి అని అంటాడు నిరుపమ్. దీంతో మళ్లీ మీరు ఐలవ్యూ చెబుతారు కదా.. అందుకు అని మనసులో అనుకుంటుంది జ్వాల. ఇంతలో డాక్టర్ సాబ్.. కారులో వెళ్లిపోతాడు. ఆయన వెళ్లిపోయాక డాక్టర్ సాబ్ ఐలవ్యూ అని చెబుతుంది జ్వాల. కట్ చేస్తే హాస్పిటల్ కు వస్తుంది హిమ. చాలా దీనంగా హాస్పిటల్ లోకి వెళ్తుంది. హాస్పిటల్ స్టాఫ్ తనను ఒక విధంగా చూస్తారు. దీంతో వాళ్లను విచిత్రంగా చూస్తుంది హిమ.

Advertisement

karthika deepam 18 may 2022 full episode

కోపంతో వాళ్లను రెండు మాటలు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. అక్కడ నిరుపమ్ కనిపిస్తాడు తనకు. తనను చూసి షాక్ అవుతుంది హిమ. నిరుపమ్ కూడా తనను చూసి షాక్ అవుతాడు. తనను చూసి ఏం మాట్లాడడు నిరుపమ్. బావ ఈ రోజు ఒక పేషెంట్ కు ఆపరేషన్ ఫిక్స్ చేశావు కదా అని అడుగుతుంది హిమ. దీంతో డాక్టర్ నరేశ్ ను రమ్మన్నాను.. అతడు చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్. దీంతో సారీ బావ అని మనసులో అనుకుంటుంది. మరోవైపు సత్యం కూడా బాధపడుతూ ఉంటాడు. తన కొడుకు నిశ్చితార్థం ఆగిపోయిందని టెన్షన్ పడతాడు.

Advertisement

ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. ఆయన బాధలో ఉండటం చూసి ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు అంటాడు సత్యం. మీకు వడ్డించమంటారా అంటే వద్దమ్మా.. నాకు ఆకలిగా లేదు. నేను తర్వాత తింటా అంటాడు. అలా అంటే లా సార్.. మీరు హ్యాండ్ వాష్ చేసుకొని రండి.. నేను వడ్డిస్తాను అంటుంది జ్వాల.

సత్యం సార్ కు భోజనం వడ్డిస్తుంటుంది కానీ.. ఏం లేదు అని మాట దాటేస్తాడు. సత్యం సార్.. మా పెళ్లికి ఒప్పుకుంటారా అని అనుకుంటుంది జ్వాల. ఈ ఇంటి కోడలుగా నేను అడుగు పెట్టగలనా. ఆటో అమ్మాయిగా నేను వీళ్లకు ఓకే కానీ..  కోడలుగా వీళ్ల మనసును గెలవగలనా అని అనుకుంటుంది జ్వాల.

Advertisement

మరోవైపు ఫైల్ లో తన ఫోటోలు పెట్టుకొని చూస్తుంటాడు నిరుపమ్. ఇంతలో హిమ వచ్చి సారీ బావ అని మనసులో అనుకుంటుంది. నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు. కానీ.. తప్పని పరిస్థితుల్లో నిన్ను కాదనాల్సి వచ్చింది.

Karthika Deepam 18 May Today Episode : ఓ ముసలావిడను కారుతో ఢీకొట్టిన సౌందర్య

నిన్ను క్షమించమని అడిగి.. నన్ను మరిచిపో అని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాను అని అనుకుంటుంది హిమ. నిన్ను మళ్లీ మామూలు మనిషిని చేయాలి అని అనుకొని అతడి దగ్గరికి వెళ్లి బావ అని పిలుస్తుంది హిమ. దీంతో చెప్పండి డాక్టర్ హిమ అంటాడు నిరుపమ్.

బావ ప్లీజ్. నాతో మాట్లాడు బావ.. ప్లీజ్ బావ. నా వైపు చూడు బావ అంటుంది హిమ. నేను చేసింది తప్పే బావ. కానీ.. ఎందుకు చేశావు అని మాత్రం అడగొద్దు. బావ.. చూడు బావ అంటూ ఫైల్ ను లాగుతుంది. ఆ ఫైల్ లో అన్నీ హిమ ఫోటోలే ఉంటాయి. వాటిని చూసి షాక్ అవుతుంది హిమ.

మరోవైపు కోపంగా కారులో వెళ్తుంది సౌందర్య. తనకు ఏం చేయాలో అర్థం కాదు. అదే రోడ్డు మీద ఓ ముసలావిడ నడుస్తూ ఉంటుంది. తనను చూసుకోకుండా కారుతో తనను గుద్దేస్తుంది. దీంతో వెంటనే కారు దిగుతుంది సౌందర్య. మరోవైపు నిరుపమ్ గురించే ఆలోచిస్తూ ఆటోలో వెళ్తుంటుంది జ్వాల.

Advertisement

ఇంతలో సౌందర్యను చూస్తుంది. ఆ ముసలావిడను లేపి తీసుకెళ్లడం చూస్తుంది జ్వాల. నానమ్మ ఫోన్ నెంబర్ తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంలా ఉంది. ఎలాగైనా సరే.. నానమ్మ ఫోన్ నెంబర్ ను ఈరోజు సంపాదిస్తాను అని అనుకుంటంది జ్వాల.

తనను లోపలికి తీసుకెళ్లి.. పళ్లు తీసుకో అని లచ్చమ్మకు ఇస్తుంది. తనకు ట్రీట్ మెంట్ ఇప్పిస్తుంది. ఇంతలో జ్వాల అక్కడికి వస్తుంది. నువ్వు ఇంట్లోకి రావడం చూసి వచ్చాను అంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావా అని వచ్చాను. దానికే ఏదేదో అంటున్నావు అంటుంది.

ఇంతకీ ఈ అవ్వ ఎవరు అని అడుగుతుంది. దీంతో లచ్చవ్వ.. ఈ అమ్మ కారు ముందు పడిపోయాను. దీంతో నాకు ట్రీట్ మెంట్ ఇప్పించింది అంటుంది. ఎలాగైనా తన ఫోన్ నెంబర్ తీసుకోవాలని.. తన ఫోన్ ను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ.. కుదరదు.

జ్వాల తనను చిరాకు పెడుతుంటే.. వెంటనే తన కారులో ఎక్కించుకుంటుంది సౌందర్య. తనను కారులో తీసుకెళ్తుంటుంది సౌందర్య. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి