karthika deepam 19 may 2022 full episode
Karthika Deepam 19 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 మే 2022, గురువారం ఎపిసోడ్ 1356 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీకేనా బాధలు.. మాకు కూడా ఉంటాయని చెబుతుంది సౌందర్య. కానీ.. జ్వాల మాత్రం నువ్వు ఏడవడం ఏంటి అంటుంది. నువ్వు అన్నీ మరిచిపోయి ఇలా హాయిగా ఎలా నవ్వుతున్నావు అని జ్వాలను అడుగుతుంది సౌందర్య. మనిషికి కన్నీళ్లు లోపల ఎక్కడుంటాయి.. అని సౌందర్యనే ప్రశ్నిస్తుంది జ్వాల. దీంతో ఏంటి రౌడీ పిల్ల.. నీకూ బాధలు ఉన్నాయా అని అడుగుతుంది జ్వాల. దీంతో అందరికీ కష్టాలు, బాధలు ఉంటాయి అని చెబుతుంది జ్వాల. ఆశతోనే బతకాలి సీసీ అంటుంది సౌందర్య. నువ్వు మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇంత చిన్న ఏజ్ లో ఇన్ని మాటలు చెబుతున్నావంటే గ్రేట్ అనిపిస్తోంది అంటుంది సౌందర్య. చిన్నప్పుడు నువ్వు ఏం కావాలనుకున్నావు అని అడుగుతుంది సౌందర్య. దీంతో నేను కలెక్టర్ కావాలనుకున్నా అంటుంది జ్వాల. మీ నాన్న ఏం చేస్తారు అని అడుగుతుంది సౌందర్య. దీంతో ఎందుకు అంటుంది జ్వాల. దీంతో.. ఆ ఎదవ అంటూ ఏదో అనబోతుంది సౌందర్య.
karthika deepam 19 may 2022 full episode
దీంతో మా నాన్న చాలా మంచోడు. మా నాన్న హీరో. మా నాన్న దేవుడు అంటుంది జ్వాల. మా నాన్నను దేవుడి కంటే ఎక్కువగా అభిమానించాను.. అందుకే మా నాన్నను తన దగ్గరికి పిలిపించుకున్నాడు దేవుడు అంటుంది జ్వాల. నువ్వు నిజంగా అర్థం కావు అంటుంది సౌందర్య. దీంతో అర్థం అయితే.. ఈ లోకం మనల్ని ఇలా చూడదు అంటుంది జ్వాల. ఆ తర్వాత అక్కడి నుంచి జ్వాల వెళ్లిపోతుంది. మరోవైపు కారులో నిరుపమ్ ను ఒక చోటుకు తీసుకెళ్తుంది హిమ. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు నిరుపమ్. దీంతో నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే అరిచేవారు.. కొట్టేవారు.. కానీ నువ్వు మాత్రం ఏం అనలేదు. అందుకే నువ్వు గొప్పేడివి అంటుంది హిమ. నీ మౌనం నన్ను కాల్చేస్తుంది. నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు అంటుంది హిమ. దిగు బావ.. ఇక్కడెవరో ముసలావిడ ఉన్నారట.. హెల్త బాగోలేదు.. చూడాలన్నారు అంటుంది హిమ.
మరోవైపు సత్యం కోసం కారులో వస్తుంది స్వప్న. నేను ఫోన్ చేసి రమ్మన్నాను కానీ.. నేను రమ్మనలేదు అంటుంది స్వప్న. ఇంట్లోకి రావచ్చు కదా అంటాడు సత్యం. దీంతో మీకొడుకును అదుపులో పెట్టుకోండి అంటుంది స్వప్న. వాడు ప్రేమ ప్రేమ అంటూ దాని వెనుక తిరుగుతున్నాడు. దాని వెనుక తిరగొద్దని చెప్పండి అంటుంది స్వప్న.
వాడు దేవదాసులా మారి.. ప్రేమ ప్రేమ అని తిరగకుండా చెప్పండి అంటుంది స్వప్న. లోకం నాగురించి నా కొడుకు గురించి మాట్లాడుకోకుండా ఉండేందుకు చెప్పడానికి నేను వచ్చాను అంటుంది స్వప్న. వాళ్లిద్దరిని కలపడానికి మీరు ప్రయత్నిస్తే నా వైపు నుంచి రియాక్షన్ సీరియస్ గా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న.
నువ్వు గ్రేట్ అసలు.. నువ్వే నాకు కళ్లు తెరిపించావు అని జ్వాలతో చెబుతుంది సౌందర్య. దీంతో ఎప్పుడూ నువ్వు ఒక్కదానివే కనిపిస్తావు.. మీ మనవరాలు ఉండదా అని అడుగుతుంది జ్వాల. దీంతో దాని టాపిక్ తీయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య.
శౌర్య గురించి నానమ్మకు తెలిసిందా అని భయపడుతుంది హిమ. మరోవైపు తన నెంబర్ తీసుకొని సౌందర్యకు ఫోన్ చేస్తుంది జ్వాల. తర్వాత కట్ చేస్తుంది. తిరిగి ఫోన్ చేస్తుంది సౌందర్య. మాట్లాడరు ఏంటి.. ఎవరు మాట్లాడేది అంటుంది సౌందర్య. దీంతో నానమ్మ నేను శౌర్యను అంటుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
This website uses cookies.