Karthika Deepam 19 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 19 అక్టోబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన బుక్స్ ఎక్కడున్నాయో వెతుకుతుంటుంది హిమ. ఇంతలో తనకు ఓ డైరీ దొరుకుతుంది. ఏంటా డైరీ అని తీసి చూస్తుంది. ఎవరిది ఈ డైరీ. ఎప్పుడూ చూడలేదు.. అని అనుకుంటుంది హిమ. డైరీ తెరిచి చూస్తే.. తన డాడీ రైటింగ్ లా అనిపిస్తుంది. అంటే ఇది డాడీ డైరీనా అని అనుకుంటుంది హిమ. విహారి ఎవరు? విహారి నా జీవితంలోకి ఎందుకు వచ్చాడు? అని అందులో రాసి ఉంటుంది. డాడీ జీవితంలోకి రావడం ఏంటి? ఈ విహారి డాడీ ఫ్రెండా? ఎప్పుడూ వినలేదే.. అని అనుకుంటుంది హిమ. ఆ తర్వాత పేజీలో దీపా.. నువ్వేంటి ఇలా చేశావ్.. అని రాసి ఉంటుంది. దాన్ని చదివి హిమ షాక్ అవుతుంది. అమ్మేం చేసింది అని అనుకుంటుంది.
కట్ చేస్తే.. సౌందర్య అమెరికా వెళ్లాలంటూ కార్తీక్ కు చెబుతుంది. తప్పు చేసింది ఆ మోనిత. మేమెందుకు అమెరికా వెళ్లిపోవాలి అని అంటాడు కార్తీక్. తనకే కాదు.. మనకు కూడా శిక్ష పడింది డాక్టర్ బాబు అని దీప అంటుంది. పెద్దోడా ఇక నువ్వు ఆలోచించకు. మీరు అమెరికా వెళ్లిపోండి అని అంటుంది. మమ్మీ పారిపోయాడు అనిపించుకోవడం అవసరమా? అంటాడు కార్తీక్. మొన్నటి దాకా ఆదిత్య అనేవాడు. ఇప్పుడు మీరంతా అంటున్నారా? అని అంటాడు కార్తీక్. అది ఒక ఉన్మాదిరా.
దానికి దూరంగా ఉండటమే మేలు అని అంటుంది సౌందర్య. దీప కూడా అమెరికా వెళ్లిపోదాం అని చెబుతుంది.మనకు అన్ని దిక్కులు మూసుకుపోతున్నాయి డాక్టర్ బాబు. మనకు ఉన్న ఒకే ఒక్క దిక్కు.. అమెరికా. లేదంటే మీదగ్గర మరేదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని అంటుంది దీప. ఇప్పటికిప్పుడు అమెరికా అంటే కష్టం కదా.. అని అంటాడు కార్తీక్. వీసాకు అప్లయి చేయాలి కదా.. ఇవన్నీ నీకు తెలియవు దీప అంటాడు కార్తీక్. అవునులే.. నాకేం తెలుసు డాక్టర్ బాబు.
వంటలక్కను కదా.. దోశలు వేసుకునే దాన్ని వీసాల గురించి నాకు తెలియదు అంటుంది. మొత్తం మీద కార్తీక్ ను అమెరికా వెళ్లేందుకు ఒప్పించేలా సౌందర్య, దీప తెగ ప్రయత్నిస్తారు. అన్నీ సర్దుకుంటాయి. అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం.. అని అంటారు సౌందర్య, దీప. దీంతో సరే కానివ్వండి.. మీరందరూ ఒకేమాట మీద ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను. నా పిల్లలు నాతో బాగుంటారనే ఒకే ఒక ఆలోచనతో ఒప్పుకుంటున్నాను అని అంటాడు కార్తీక్.
లంచ్ టైమ్ లో సరిగ్గా భోజనం చేయకుండా కూర్చుంటాడు కార్తీక్. ఏంట్రా ఆ తినడం. మంచిగా తిను అని అంటుంది సౌందర్య. మరోవైపు ఆదిత్య.. కార్తీక్ కోసం వీసా తీసుకొస్తాడు. కార్తీక్ ఫ్యామిలీ యూఎస్ వెళ్లేందుకు సిద్ధం అవుతుంటారు. హిమ.. మనం ఎటూ రేపు అమెరికా వెళ్తున్నాం కదా.. నాన్న మీద ఇకనైనా కోపం తగ్గించుకో అంటుంది శౌర్య. అందరితో కలిసి హ్యాపీగా ఉందాం ఇక అంటుంది శౌర్య. నాన్న మీద నీకు ఇంకా కోపం పోలేదా.. అని అడుగుతుంది శౌర్య. కావాలంటే నువ్వు మరిచిపో.. నేను మారను అంటుంది హిమ. ఏంటే నువ్వు అసలు ఏంటి నువ్వు.. రేపు మనం వెళ్లిపోతున్నాం. అందరితో కలిసి ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు కదా.. అని అంటుంది దీప. రా.. వచ్చి తిను అని చెబుతుంది హిమ.
నేనేం తప్పు చేశానని అందరూ నా మీద అరుస్తున్నారు.. అని హిమ అంటుంది. దాన్ని వదిలేయండి.. నువ్వు తినమ్మా.. అని అంటాడు కార్తీక్. ఈ ప్రేమే ఇంత దాకా తెచ్చిందిరా అంటుంది సౌందర్య. అందరం కలిసి తిందాం. మళ్లీ అందరం ఎప్పుడు కలుస్తామో ఏమో.. అని అంటుంది సౌందర్య. అన్నీ సర్దుకున్నారా? అని సౌందర్య.. శౌర్యను అడుగుతుంది. హా.. మాకిష్టం లేకపోయినా తీసుకెళ్తున్నారు కదా.. అంటుంది శౌర్య.
ఇంతలో విహారి.. తన ఫ్యామిలీతో సహా కార్తీక్ ఇంటికి వస్తాడు. మీరు అమెరికా వెళ్తున్నారని తెలిసి వచ్చాం అని అంటాడు విహారి. ఇంతలో హిమ లేచి.. ఆగండి అంకుల్. మీరు దీపారాధన పుస్తకం రాశారు కదా. మీకు మా అమ్మ ఎలా తెలుసు? మా నాన్నకు మీరంటే ఎందుకు కోపం? అని ప్రశ్నిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.