karthika deepam 20 december 2021 episode highlights
Karthika Deepam 20 Dec Tomorrow Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 19 డిసెంబర్ 2021, 1227 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోటేశ్, శ్రీవల్లిల బాబు వాళ్ల బాబు కాదని తెలుసుకుంటారు కార్తీక్, దీప. మళ్లీ డెలివరీ సమయంలో బాబు చనిపోయాడని.. ఆసుపత్రిలో అనాథ బిడ్డను దత్తత తీసుకున్నామని అబద్ధం చెబుతాడు కోటేశ్. దీంతో సరే.. మంచి పని చేశారని అంటారు కార్తీక్, దీప. మిమ్మల్ని చూస్తుంటే పెద్దింటి వాళ్లలా ఉన్నారు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు. మీది ఏ ఊరు అని శ్రీవల్లి.. దీపను ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. మేము ఎందుకు వచ్చామో అన్ని విషయాలు చెప్పలేం కానీ.. మాది విజయనగరం. కొన్ని సమస్యల వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంతకంటే ఇంకేం చెప్పలేం అంటుంది దీప.
karthika deepam 20 december 2021 episode highlights
మరోవైపు మోనిత.. సౌందర్య ఇంట్లో కొంచెం ఎక్కువ చేస్తుంటుంది. కార్తీక్, తను ఉన్న ఫోటోను హాల్ లో పెట్టిన తర్వాత దానితో సెల్ఫీలు దిగుతూ ఉంటుంది. రచ్చ రచ్చ చేస్తుంటుంది. దీంతో సౌందర్యకు కోపం వస్తుంది. దీంతో అక్కడికి వచ్చి ఆ ఫోటోను నేలకేసి కొడుతుంది. దీంతో మోనిత షాక్ అవుతుంది. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నీ కొడుకు పోయాడు.. అని చెప్పి వచ్చావని నేను నిన్ను ఏం అనట్లేదు. అసలే నా కొడుకు ఎటు వెళ్లాడో తెలియక మేము సతమతమవుతుంటే నీ బాధ ఏంటి. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు.. నిన్ను చంపడం, ఈ ఇంట్లో నుంచి గెంటేయడం చిటిక వేసినంత పని నాకు. కానీ.. నీకు భయపడి నేను ఈ పని చేయడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో.. అంటూ సౌందర్య సీరియస్ అవుతుంది. దీంతో మోనిత ఏం మాట్లాడదు.
కట్ చేస్తే.. రుద్రాణి మనిషి రాత్రి పూట.. శ్రీవల్లి ఇంటికి వస్తాడు. కార్తీక్ ను మా అక్క పిలుస్తోంది అంటాడు. నేను రాను అంటాడు కార్తీక్. అయితే మా అక్కే ఇక్కడికి వస్తుంది అంటాడు. దీంతో ఒకవేళ రుద్రాణి ఇక్కడికి వస్తే దీప ఏదైనా తనతో గొడవ పెట్టుకుంటుంది.. అని అనుకుంటాడు. దీంతో అతడితో కలిసి ఒక్కడే కార్తీక్.. రుద్రాణి ఇంటికి వెళ్తాడు.
రుద్రాణి దగ్గరికి వెళ్లగానే దస్తావేజులు చూపించి.. దాంట్లో సంతకం పెట్టు అంటుంది. 3.25 లక్షలు అసలు వడ్డి కలిపి నెల రోజుల్లో తీర్చాలంటూ చెబుతుంది రుద్రాణి. కోటేశ్ ను ఇంట్లో పెట్టుకున్నావు.. మా వాళ్లను కొట్టావు.. వాటన్నింటికీ నువ్వే బాధ్యత వహించాలి.
నెల రోజుల్లో కోటేశ్ అప్పు కట్టలేదనుకో.. ఏం చేస్తానో కూడా ఆ దస్తావేజుల్లో రాశాను. నా ఇష్టం ఉన్నది చేసుకుంటాను.. అంటే నేను తీరుస్తాను.. కోటేశ్ అప్పు నేను తీరుస్తాను అంటాడు కార్తీక్. శభాష్.. అయితే సంతకం పెట్టు. ఆ కోటేశ్ గాడిని ఆదుకో.. అంటుంది రుద్రాణి.
లేదంటే.. నాకేం సంబంధం లేదు. ఆ శ్రీవల్లి, కోటేశ్ లు మీ ఇష్టం అని వెళ్లిపో. నీకేం బాధ ఉండదు అని మరో ఆప్షన్ ఇస్తుంది రుద్రాణి. దీంతో వెంటనే వచ్చి కార్తీక్ సంతకం పెడతాడు. కార్తీక్ సంతకం పెట్టిన తర్వాత అసలు విషయం చెబుతుంది రుద్రాణి.
అక్కా.. సంతకం పెట్టాడు సరే.. మరి డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని తన మనిషి అడుగుతాడు. దీంతో నాకు తెలివి ఉందిరా. డబ్బులు ఇవ్వకపోతే.. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు కదా. అందులో నుంచి ఒకరిని తెచ్చుకుంటానని ఈ దస్తావేజుల్లో రాశాను అని చెబుతుంది రుద్రాణి.
దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. ఇంట్లో పడుకున్న పిల్లలను చూసి భయపడతారు. ఒకవేళ డబ్బులు కట్టకపోతే.. తన పిల్లలను ఎక్కడ తీసుకెళ్తారో అని టెన్షన్ పడతాడు. కార్తీక్ ప్రవర్తనను చూసి దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.