Karthika Deepam 20 Jan Today Episode : మోనిత కొడుకు ఆనంద్ ను ఎత్తుకెళ్లిపోయిన రుద్రాణి.. ఇద్దరు పిల్లలను కూడా ఎత్తుకొస్తానని దీపకు వార్నింగ్ ఇచ్చిన రుద్రాణి.. ఇంతలో మరో ట్విస్ట్

Karthika Deepam 20 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ 1254 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుద్రాణిని కొట్టిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది సౌందర్య. దీంతో ఏం ఆలోచిస్తున్నావు సౌందర్య.. అని అడుగుతాడు ఆనందరావు. మన గురించి అడగడానికి ఇక్కడికి వచ్చిన వాళ్లు ఎవరు అయి ఉంటారు అని ఆలోచిస్తున్నాను అంటుంది సౌందర్య. ఏంటో సౌందర్య.. ఈ గొడవలు ఏంటో.. ఎవరెవరో వచ్చి అడగడం ఏంటో.. అవన్నీ వదిలేయ్ సౌందర్య. మనం ఇప్పుడు పడుతున్న బాధ కన్నా ఇవేమీ ఎక్కువ కాదులే అంటాడు ఆనందరావు. పాపం.. కార్తీక్, దీప ఎలా ఉన్నారో పిల్లలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అంటాడు ఆనందరావు.

karthika deepam 20 january 2022 full episode

ఆశ్రమంలో తన అత్తామామలను చూసినప్పటి నుంచి చాలా డిస్టర్బ్ గా ఉంటుంది దీప. ఇంటికి వచ్చి పిల్లలతో కూడా మాట్లాడదు. అత్తయ్య మామయ్య ఇక్కడే ఉన్నారన్న విషయం పిల్లలకు చెప్పాలా? వద్దా? అని అనుకుంటుంది దీప. చిన్నతనంలోనే నాన్నమ్మ, తాతయ్య ప్రేమను వీళ్లకు దూరం చేస్తున్నాను. అసలు.. అత్తయ్య, మామయ్య ఎందుకు వచ్చారు. మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారా? లేక ఆశ్రమంలో ట్రీట్ మెంట్ కోసం వచ్చారా అని అనుకుంటుంది దీప. కాసేపు రెస్ట్ తీసుకుంటాను అమ్మా అంటుంది దీప. ఏమైంది అమ్మా.. డాడీ కూడా డల్ గా ఉన్నారు. డాడీ కూడా సిలిండర్ ఫిక్స్ చేసి ఎక్కడికో వెళ్లిపోయాడు అని చెబుతారు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు దీపకు.

అత్తయ్య, మామయ్య, మేము.. అందరం ఒకే ఊళ్లో ఉన్నాం కానీ.. ఒకరిని మరొకరు చూసుకునే భాగ్యం  మాత్రం లేదు. అసలు వాళ్లు ఎందుకు వచ్చారో మాత్రం అర్థం కాక దీపకు పిచ్చెక్కుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది దీప. డాక్టర్ బాబు ఎక్కడి నుంచి సిలిండర్ తెచ్చి ఉంటారు అని అనుకుంటుంది దీప.

ఇంతలో కార్తీక్.. గేట్ తీసుకొని ఎక్కడికో వెళ్తాడు. డాడీకి ఏమైంది.. మహారాజు, మహారాణిలా ఉంటారు. వీళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనుకొని ఆశ్రమం లోపలికి వస్తాడు. అక్కడ పనిచేసే ఓ వ్యక్తిని వాళ్ల గురించి వాకబు చేస్తాడు. వాళ్లు మీకు ఏమౌతారు అని అడుగుతాడు ఆశ్రమంలో పనిచేసే వ్యక్తి.

దీంతో వాళ్లు నాకు తెలియదు అంటాడు కార్తీక్. వాళ్ల కోసం ఇంకెవరో వచ్చారు. ఇప్పుడు మీరు వచ్చారు అంటాడు. మీరెవరో తెలియనప్పుడు వాళ్లను కలవడం కుదరదు అంటాడు పనిచేసే వ్యక్తి. దీంతో కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వాళ్లను కలిసేందుకు ఇంకెవరు వచ్చారు అని అనుకుంటాడు కార్తీక్.

Karthika Deepam 20 Jan Today Episode : సౌందర్య, ఆనంద రావు గురించి చెప్పాలా? వద్దా? అని టెన్షన్ పడ్డ దీప, కార్తీక్

మరోవైపు ఆనందరావు, సౌందర్య.. ఇద్దరూ రూమ్ లో ఉండగా.. రేపు భోజనం హోటల్ లో నుంచి తెప్పించమంటారా అంటాడు. వద్దు బాబు అంటారు. మీ గురించి అడిగిన ఆవిడ మళ్లీ వచ్చిందా సార్ అంటాడు. మీరు కొట్టిన ఆవిడ అంత మంచిదేమీ కాదు అంటాడు ఆ వ్యక్తి.

కట్ చేస్తే.. కార్తీక్ ఇంటికి వెళ్లి భోజనం చేస్తూ ఉంటాడు. దీపకు ఈ విషయం చెప్పాలా వద్దా అని కంగారు పడతాడు కార్తీక్. ఇప్పుడే తనకు చెప్పొద్దు అని అనుకుంటాడు కార్తీక్. దీప కూడా అత్తయ్య మామయ్యలు ఇక్కడికి వచ్చారని చెప్పాలా? వద్దా? అని దీప కూడా అనుకుంటుంది.

ఏంటండి.. ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది దీప. ఏం లేదు దీప అంటాడు కార్తీక్. పిల్లలతో మీరు మనసు బాగాలేదని అన్నారట అంటుంది దీప. ఇందాక రుద్రాణి దగ్గరికి వెళ్లాను అంటాడు కార్తీక్. పిల్లలకు భోజనాలు పంపొద్దని వార్నింగ్ ఇవ్వడానికి వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాక పిల్లలకు బట్టలు కుట్టించిన విషయాన్ని చెప్పింది అని అంటాడు కార్తీక్.

రుద్రాణిని ఆశ్రమంలో ఎవరో కొట్టారట తెలుసా అంటుంది దీప. నువ్వు ఆశ్రమానికి వెళ్లావా అంటాడు కార్తీక్. అవును.. వెళ్లాను అంటుంది దీప. మరి చూశావా అంటే చూడలేదు.. కనిపించలేదు అంటుంది. కానీ.. ఆవిడ నిజంగానే గొప్ప మనిషి. కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టుకోవాలనిపించింది కానీ.. కనిపించలేదు అంటుంది దీప.

మరోవైపు ఆనంద్ ను ఎత్తుకొచ్చేస్తుంది రుద్రాణి. డబ్బులు కట్టి.. రంగరాజును తీసుకెళ్లు అని దీపకు వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. నువ్వు డబ్బు కట్టకపోతే.. నీ ఇద్దరు పిల్లలను కూడా ఎత్తుకొచ్చేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

1 month ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

1 month ago