Karthika Deepam 20 July Today Episode : శౌర్యను నిరుపమ్ కు ఇచ్చి పెళ్లి చేసి.. హిమను తాను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసిన ప్రేమ్.. అది వర్కవుట్ అవుతుందా?
Karthika Deepam 20 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 జులై 2022, 1409 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బోనాల పండుగకు నిరుపమ్ బావ కూడా ఉంటే బాగుంటుందని అనుకుంటుంది హిమ. వెంటనే ప్రేమ్ కు ఫోన్ చేసి.. షాపింగ్ కోసం నిరుపమ్ బావను తీసుకొని రా అని అడుగుతుంది హిమ. దీంతో దానికి నువ్వు అంతగా బతిమిలాడాలా. నేను ఒప్పిస్తా కదా అని చెబుతాడు. వెంటనే నిరుపమ్ దగ్గరికి వెళ్లి తను చూస్తున్న పేషెంట్ కేస్ షీట్ ను చూస్తాడు. దాన్ని తీసుకొని ఏం చేస్తున్నావు. అమ్మమ్మ వాళ్ల ఇంట్లో బోనాలు చేస్తున్నారట వెళ్దాం పదా అంటాడు. దీంతో సరే వెళ్దాం పదా అంటాడు నిరుపమ్.
మరోవైపు బోనాల పండుగ కోసం షాపింగ్ కు బయలుదేరుతారు సౌందర్య ఫ్యామిలీ. నేను ఆటోలో వస్తాను నానమ్మ అంటుంది శౌర్య. దీంతో ఎందుకు అందరం కారులో వెళ్దాం అంటుంది సౌందర్య. లేదు నానమ్మ నేను ఆటోలో వెళ్తాను అంటుంది. కానీ.. బోనం సమర్పించేదాకా నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వు చెప్పేది వింటాను అంటుంది సౌందర్య. దీంతో సరే అంటుంది శౌర్య. వెంటనే వెళ్లి కారులో కూర్చొంటుంది శౌర్య. ఆనంద రావు ముందు కూర్చొంటాడు. హిమ వెనుక శౌర్య పక్కన కూర్చోబోతుండగా శౌర్య గుడ్లు ఉరుముతుంది. దీంతో హిమ భయపడుతుంది.
దీంతో తాతయ్య వెనుక కూర్చోలేడు.. నువ్వు వెళ్లి కూర్చో అంటుంది సౌందర్య. దీంతో వెనుక శౌర్య పక్కన కూర్చొంటుంది. మరోవైపు నిరుపమ్, ప్రేమ్ ఇద్దరూ కారులో వెళ్తుంటారు. శౌర్య గురించి అడుగుతాడు ప్రేమ్. శౌర్య మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు.
Karthika Deepam 20 July Today Episode : శాంతాబాయిపై అరిచిన శోభ
తన మీద ప్రత్యేకంగా అభిప్రాయం అంటూ ఏముంటుంది అంటాడు. నీకు తన మీద ఏమైనా కోపం ఉంటే దాన్ని తీసేయ్. పాపం శౌర్య.. తను మంచి అమ్మాయి అంటాడు ప్రేమ్. తనను చూసి ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు ఏంటి అని అడుగుతాడు నిరుపమ్.
మరోవైపు శౌర్యను, నిరుపమ్ ను ఎలాగైనా కలపాలని ఆలోచిస్తుంటాడు ప్రేమ్. ఇంకోవైపు శోభ టెన్షన్ పడుతూ ఉంటుంది. తన పరిస్థితి ఏంటో అర్థం కాక పిచ్చి లేస్తుంది తనకు. బ్యాంక్ వాళ్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి టెన్షన్ పెడుతున్నారు. వాళ్లు చెబితే వినేలా లేరు అని అనుకుంటుంది.
అటు హాస్పిటల్ చేజారిపోతుంది. ఇటు నిరుపమ్, హిమ పెళ్లి జరిగితే ఇటు నిరుపమ్ చేజారి పోతాడు. స్వప్న ఆంటి కూడా చేతులెత్తేసినట్టే మాట్లాడుతోంది. ఏం అర్థం కావడం లేదు అని అనుకుంటుంద. ఇంతలో శాంతాబాయి వస్తుంది. కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి అని అడుగుతుంది.
దీంతో నా దగ్గర ఏమైనా డబ్బులు దాచిపెట్టావా? డబ్బులు లేవు ఏం లేవు వెళ్లు అని గట్టిగా అరుస్తుంది. తర్వాత డబ్బులు ఇచ్చి శాంతాబాయి ఏమనుకోకు. నేను టెన్షన్ లో ఉన్నాను. ఏం అనుకోకు అంటుంది శోభ. దీంతో సరే అంటుంది శాంతాబాయి.
మరోవైపు కారులో సౌందర్య, ఆనంద రావు, హిమ, శౌర్య వెళ్తుంటారు. కారును కావాలని అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది సౌందర్య. దీంతో హిమ మీద శౌర్య, శౌర్య మీద హిమ పడుతుంటారు. నానమ్మ ఏంటిది.. కారు రోడ్డు మీద నడుపు గుంతల మీద కాదు అంటుంది శౌర్య.
దీంతో ఆనాడు మీ మమ్మీ డాడీని కలపడానికి వాడిన ట్రిక్.. ఇప్పుడు మీ ఇద్దరినీ వాడటానికి వాడుతున్నా అని అనుకుంటుంది సౌందర్య. అటూ ఇటూ కారును తిప్పుతూ ఉంటుంది. నానమ్మ ఏంటిది.. నేను డ్రైవ్ చేయాలా అని అడుగుతుంది హిమ. దీంతో నువ్వు డ్రైవ్ చేస్తేనే నేను కారులో కూర్చొంటాను అంటుంది శౌర్య.
సరిగ్గానే నడుపుతాను లే అంటుంది సౌందర్య. తనకు క్యాన్సర్ అని చెప్పి అబద్ధం అని నాకు తెలుసు అని నిరుపమ్ స్వప్నకు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది స్వప్న. దానికి క్యాన్సర్ ఉంది కదా. నెలకో రెండు నెలలకూ అది పోతుంది కదా.. శోభను ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా కానీ.. ఇప్పుడు అది పోదు. పర్మినెంట్ గా నా కోడలుగా అయిపోతుందా? శోభతో నిరుపమ్ పెళ్లి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది స్వప్న.
నిరుపమ్ కు ఏం చెప్పి ఈ పెళ్లి ఆపాలి. సాధ్యమా.. అసాధ్యమా అని అనుకుంటుంది. మరోవైపు నిరుపమ్, ప్రేమ్.. ఇద్దరూ సౌందర్య ఫ్యామిలీతో కలిసి షాపింగ్ చేస్తారు. ఇంతలో ప్రేమ్.. శౌర్య, నిరుపమ్ ను ఒకే కారులో పంపించేందుకు ప్లాన్ వేస్తాడు. శౌర్య మా కారులో రా అంటాడు.
దీంతో వెళ్లి ఆ కారులో కూర్చొంటుంది శౌర్య. దీంతో నిరుపమ్ ను డ్రైవర్ సీట్ లో కూర్చోబెట్టాలనుకుంటాడు ప్రేమ్. కారు నువ్వు నడుపు అంటాడు నిరుపమ్. తర్వాత వెళ్లి సౌందర్య కారులో వెనుక కూర్చొంటాడు. శౌర్యకు కోపం వచ్చి వెనుక కూర్చొంటుంది.
ఆ తర్వాత రెండు కార్లు బయలుదేరుతాయి. హిమ పక్కన కారులో కూర్చొంటేనే ఇంత ఆనందంగా ఉంది. రేపు పెళ్లి పీటల మీద కూర్చొంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అని అనుకుంటాడు. మరోవైపు శౌర్య, నిరుపమ్ ఇద్దరూ ఒకే కారులో వెళ్తున్నారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం ప్రేమ్ బావే. థాంక్స్ బావ అంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.