Karthika Deepam 20 Oct Today Episode : మోనితకు షాకిచ్చిన కార్తీక్.. దుర్గను కాపాడి పోలీసుల ముందు మోనితను ఇరికించాడు.. కార్తీక్ కు గతం గుర్తుకొచ్చి మోనితను ఆడేసుకుంటున్నాడు

Advertisement
Advertisement

Karthika Deepam 20 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 అక్టోబర్ 2022, గురువారం ఎపిసోడ్ 1488 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు అంటుంది మోనిత. దీంతో ఉన్నమాటే కదా మోనిత. మొన్న ఎప్పుడో నీకు, దుర్గకు డాక్టర్ బాబు అడ్డం అని శివతో బయటికి తీసుకెళ్లమని చెప్పావు కదా. ఏ భర్త అయినా భార్య అలా చెబితే తట్టుకోగలడా అంటుంది దీప. అందుకే పాపం డాక్టర్ బాబు మళ్లీ నువ్వు ఎక్కడ అలా చెప్పిస్తావోనని ముందే వచ్చేశారు అంటుంది దీప. దీంతో నోర్మూయ్.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రాణాలు తీస్తా అంటుంది మోనిత. నువ్వు చేస్తే తప్పు లేదు కానీ.. అంటే తప్పొచ్చిందా అంటాడు కార్తీక్. ఒకసారి అంటే అనుకోవచ్చు.. ఎప్పుడూ అలాగే అంటే ఎలా అంటాడు కార్తీక్. సరే పదా.. ఇంటికి వెళ్దాం అంటుంది మోనిత. దీంతో దుర్గ గారు ఇంట్లో లేరా అంటాడు కార్తీక్. వంటలక్క ఇంటికి వచ్చా కదా.. భోజనం చేసి వస్తా అంటాడు కార్తీక్.

Advertisement

karthika deepam 20 october 2022 full episode

ముందు.. వీళ్లను కాదు.. ఆ దుర్గా గాడి పని చెప్పాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇన్నాళ్లు నా భార్య ఎవరో తెలియకుండా ఆటలు ఆడుతావా? దొరక దొరకక నాకు చాన్స్ దొరికింది. ఇప్పుడైనా నా భార్యతో సంతోషంగా కాసేపు గడపనివ్వవా అని అనుకుంటాడు. మరోవైపు దుర్గ ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఇంతలో అక్కడికి వస్తుంది మోనిత. రా బంగారం అంటాడు. నీ సీన్ చిరిగిపోయే టైమ్ వచ్చింది అంటుంది మోనిత. కార్తీక్, దీపను కలిపేద్దామని పెద్ద మొనగాడిలా వచ్చావు కదా. నా కార్తీక్ ను ఎలా దక్కించుకుంటానో..  మీ ఇద్దరినీ ఎలా వదిలించుకుంటానో చూడు. జస్ట్ రేపు ఈ పాటికి ఫీల్డ్ మొత్తం క్లియర్. ఆ ఫ్లీల్డ్ లో నేను, నా కార్తీక్, నా బిడ్డ మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఇది ఇంత కాన్పిడెంట్ గా మాట్లాడుతోంది. ఏదో గట్టి ప్లాన్ లోనే ఉన్నట్టుంది. జాగ్రత్తగా ఉండి తన ప్లాన్ తనకే తిప్పి కొడతా అని అనుకుంటాడు దుర్గ.

Advertisement

కట్ చేస్తే ఎలా ఉంది నా వంట అని అడుగుతాడు కార్తీక్. దీంతో బాగుంది డాక్టర్ బాబు అంటుంది దీప. నా వంటకే ఇలా అంటే నీ వంట ఇంకా అద్భుతం కదా అంటాడు కార్తీక్. సరే.. ఇక నేను వెళ్లొస్తా అంటా అంటాడు. ఇంతలో దుర్గ అక్కడికి వస్తాడు. ఎక్కడికి డాక్టర్ గారు. ఆ మోనిత దగ్గరికేనా. వెళ్లండి చాలా కోపంగా ఉంది అంటాడు. దీపమ్మ.. మోనిత ఏదో ప్లాన్ చేస్తుంది అని కార్తీక్ వెళ్లాక అంటాడు దుర్గ.

దీంతో దాని మొహం.. అదేం ప్లాన్ చేస్తుంది అంటుంది దీప. అది ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది అంటాడు దుర్గ. అది ఏదో గట్టి ప్లానే వేస్తుంది అనిపిస్తోంది అంటాడు దుర్గ. అది ఎంత కొట్టినా చావని పాము దీపమ్మ అంటాడు దుర్గ. నువ్వు అక్కడే ఉండి తనను ఒక కంట కనిపెడుతుండు అంటుంది దీప. మరోవైపు శివ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మేడమ్ ఆ పాపను ఎందుకు వెతకొద్దు అంటోంది అని అనుకుంటాడు. ఆ పాపను చదివిస్తే మేడమ్ కు ఏంటి ప్రాబ్లమ్. అసలు సార్ ఎవరి గురించి ఆలోచించినా వాళ్లు మేడమ్ కు నచ్చడం లేదు. అసలు ఇక్కడ ఏదో చిక్కుముడి ఉంది అని అనుకుంటాడు శివ.

ఇంతలో కార్తీక్ వస్తాడు. సార్ వచ్చారా.. మేడమ్ బయటికి వెళ్లింది. మిమ్మల్ని రెస్ట్ తీసుకో అని చెప్పింది అంటాడు శివ. సర్లే.. నిన్ను పాప గురించి వెతకమన్నాను కదా.. వెతికావా అంటాడు కార్తీక్. దీంతో మేడమ్ వద్దంటే తిడతాడు అనుకొని ఉదయమే 4 కాలనీలు వెతికాను అంటాడు.

Karthika Deepam 20 Oct Today Episode : వంటలక్క ఇంటి ముందు ఈరోజు రాత్రి పడుకో అని శివకు చెప్పిన కార్తీక్

తర్వాత ఏదో ఆలోచిస్తుంటాడు శివ. దీంతో ఏయ్.. శివ ఏమైంది.. అలా ఉన్నావేంటి.. చెప్పు అంటాడు. దీంతో ఎంత పెద్ద పని అయినా చేసేస్తాను సార్ అంటాడు కార్తీక్. దీంతో ఈరోజు రాత్రి నుంచి రోజూ నువ్వు వంటలక్క ఇంటి ముందు పడుకోవాలి అంటాడు కార్తీక్.

దీంతో మేడమ్ ఏమంటారో అంటాడు శివ. ఇప్పుడే కదా.. నేను ఏం చెబితే అది చేస్తా అన్నావు అంటాడు కార్తీక్. దీంతో సరే అంటాడు శివ. మరోవైపు కారులో ఎక్కడికో వెళ్లిన మోనిత.. దుర్గను ఏం చేయాలా అని ప్లాన్ చేస్తుంది. దుర్గ గాడు వచ్చి అంతా చెడగొట్టాడు అని అనుకుంటుంది.

రేపటితో నీ పని కలాస్. వంటలక్క పీడ వదిలించుకొని కార్తీక్ తో ఆస్ట్రేలియా చెక్కేస్తాను అని అనుకుంటుంది మోనిత. మరోవైపు మోనిత ఏం ప్లాన్ చేస్తోంది అని అనుకుంటుంది దీప. తను ఏం చేయాలని అనుకుంటోంది. డాక్టర్ బాబును ఎక్కడికైనా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోందా అని అనుకుంటుంది దీప.

వెంటనే డాక్టర్ బాబు దగ్గరికి వెళ్లాలి. ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది దీప. డాక్టర్ బాబు దగ్గరికి వస్తుంది. మోనిత ఎక్కడ అని అడుగుతుంది. దీంతో బయటికి వెళ్లింది అని అంటాడు కార్తీక్. ఎక్కడికి వెళ్లింది అంటే ఏమో తెలియదు అంటాడు.

ఏమైంది కంగారు పడుతున్నావు అంటాడు కార్తీక్. దీంతో మోనిత దుర్గతో చాలెంజ్ చేసిందట. ఒకసారి ఎక్కడికి వెళ్లిందో కనుక్కోండి అంటుంది దీప. ఇంతలో పోలీసులను తీసుకొని మోనిత అక్కడికి వస్తుంది. పోలీసులను చూసి దీప, కార్తీక్ షాక్ అవుతారు.

ఇంతలో దుర్గను చూపించి వాడే ఇన్ స్పెక్టర్ అరెస్ట్ చేయండి అంటుంది మోనిత. దీంతో పోలీసులు వెళ్లి అతడిని అరెస్ట్ చేస్తారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు. వదిలేయండి అంటాడు దుర్గ. నా మీద పోలీస్ కంప్లయింట్ ఇస్తావా అంటాడు దుర్గ. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతాడు దుర్గ.

దీంతో ఎన్నాళ్లు పోలీసుల కళ్లు కప్పి తిరుగుతావు.. అంటూ ఇంతకుముందు ఫోన్ లో దుర్గ మాట్లాడిన వీడియోను చూపిస్తాడు పోలీస్. ఇది నువ్వే కదా. గ్రాఫిక్స్ అయితే కాదు కదా అంటాడు ఎస్ఐ. సాక్ష్యాలు లేవా.. నిన్ను ఎవడూ ఏం పీకలేడా.. స్టేషన్ కు వెళ్లాక ఉంటుంది నీకు అంటాడు పోలీస్.

మోనితకు థాంక్స్ చెబుతాడు పోలీస్. ఆ వీడియోలో ఉన్నది దుర్గ కాదేమో మోనిత.. అంటాడు కార్తీక్. లేదు కార్తీక్.. ఆ వీడియో నేనే తీశాను అంటుంది మోనిత. దీంతో ఎస్ఐ గారు మీకో విషయం తెలియదు.. దుర్గ.. మోనితకు బెస్ట్ ఫ్రెండ్. ఆ రోజు నువ్వు నాకు అలాగే పరిచయం చేశావు కదా.

అని వీడియో చూపిస్తాడు కార్తీక్. దుర్గ నీ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇద్దరూ కలిసే చేశారా.. అంటాడు కార్తీక్. దీంతో మీరు కూడా క్రిమినలా.. ఇద్దరూ ఏం చేశారు.. మీ ఇద్దరినీ కలిసి ఇంటరాగేట్ చేయాల్సి ఉంటుంది అంటాడు ఎస్ఐ. దీంతో వాళ్లిద్దరూ క్రిమినల్స్ కాదు.

మా మోనిత మాట నమ్మకండి. ఎందుకంటే మోనిత గతం మరిచిపోయింది. ఎప్పుడు ఏం చెబుతుందో తనకే తెలియట్లేదు. ఏంటి అలా చూస్తున్నావు మోనిత. నువ్వు గతం మరిచిపోయింది కూడా తెలియదా.. అది సంగతి ఎస్ఐ. ఒకరోజు దుర్గను మంచివాడు అంటుంది. ఇంకోరోజు మంచివాడు కాదు అంటుంది అంటాడు కార్తీక్.

ఈ పనికి రాని వీడియో తీసి మా టైమ్ అంతా వేస్ట్ చేశావు అని ఎస్ఐ మోనితను తిడుతాడు. సరే.. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండండి అని చెబుతాడు. ఈవిడ వంటలక్క.. ఈవిడ ప్రాణాలకు ముప్పు ఉంది. దయచేసి సెక్యూరిటీ పెంచండి అంటాడు కార్తీక్.

దీంతో ఎవరి మీద అనుమానం ఉందో చెప్పండి. వారి మీద యాక్షన్ తీసుకుంటాను అంటాడు ఎస్ఐ. దీంతో అది అంటూ మోనిత వైపు చూస్తాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Pomegranate Juice : గుండె ఆరోగ్యానికి దానిమ్మ రసంతో ఎన్ని లాభాలో తెలుసా..?

Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…

14 minutes ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 20 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

1 hour ago

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

9 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

10 hours ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

11 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

12 hours ago

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

13 hours ago

Youth Kidnap : సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన.. ప్రేమించాడని యువకుడికి మూత్రం తాగించి చిత్రహింసలు

Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…

14 hours ago