Karthika Deepam 21 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 డిసెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 1228 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలు కనిపించడం లేదంటూ కార్తీక్ టెన్షన్ పడుతుంటాడు. దీంతో ఏం చేయాలో కార్తీక్ కు అర్థం కాదు. వెంటనే దీపకు వెళ్లి ఈ విషయం చెబుతాడు. దీంతో దీప, కార్తీక్.. ఇద్దరూ కలిసి వాళ్లను వెతుకుతారు. చివరకు ఓ చెట్టు వద్ద ఇద్దరూ కూర్చొని ఉంటారు. ఏమైంది అన్నా కూడా ఎవ్వరూ మాట్లాడరు. చివరకు మనం నానమ్మ వాళ్ల దగ్గరకి వెళ్లిపోదాం అంటుంది రౌడి. అవునమ్మ.. మనం మనింటికి వెళ్లిపోదాం. ఇక్కడ వద్దు. వెళ్లిపోదాం పదండి.. అంటారు. ఇందాక ఒక అమ్మాయి స్కూల్ కు వెళ్తూ మమ్మల్ని ఏమన్నదో తెలుసా? మనకు ఎవ్వరూ లేరట. ఒక సంచితో ఇక్కడికి వచ్చామంట. మనల్ని ఎన్ని మాటలు అన్నదో తెలుసా? అంటూ పిల్లలు బాధపడతారు.
అసలు.. ఇల్లు, కారు వదిలేసి ఎందుకు ఇక్కడ ఉండాలి.. వెళ్లిపోదాం నాన్న అంటుంది రౌడి. దీంతో మీకు తెలుసు కదా. మనకు అన్నీ ఉన్నాయని. ఎందుకు బాధపడటం అంటుంది దీప. కనీసం మేము స్కూల్ కు అయినా వెళ్తాం పంపించండి అమ్మ అంటుంది శౌర్య. మరోవైపు ఎవరూ లేరని ఎలా పెంచుకుంటానురా అంటూ రుద్రాణి.. తన మనిషిని కొడుతుంది. పిల్లలు లేరని ఎన్నేళ్లు బాధపడతాము అక్క అంటాడు. దీంతో శ్రీవల్లి బిడ్డను తెచ్చుకుంది కదా. ఆ విషయం చెప్పి మంచి పని చేశావు. ఏం మాట్లాడినా ఈ అక్కకు ఒక లెక్క ఉంటుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటుంది రుద్రాణి. ఆ తర్వాత కార్తీక్, దీప కలిసి ఊళ్లోకి వెళ్తారు. పిల్లలు అలా మాట్లాడేసరికి బాధపడతారు. మీరు ఇంటికి వెళ్లండి కార్తీక్ బాబు. నేను ఏదైనా పని వెతుక్కొని వస్తాను అంటుంది దీప.
దీప.. అండి అండి అంటుంటే.. దీప నువ్వు ఊరికే అలా అండి అండి అంటూ పిలవకు అంటాడు. మరి ఏమని పిలవాలి. నువ్వేమో డాక్టర్ బాబు అని పిలవద్దు అంటావు. మరి ఇంకెలా పిలవాలి అనగానే అప్పటికే ఓ వ్యక్తి సెల్ లో సామీ సామీ పాటను వినుకుంటూ వెళ్తాడు. ఆ పాటను విన్న దీప.. సామీ అని పిలుస్తుంది.
మరోవైపు ఎస్పీకి ఫోన్ చేస్తుంది సౌందర్య. ఎలాగైనా కార్తీక్ ను వెతకమని చెబుతుంది. కనీసం వాడు ఎక్కడున్నాడో వాడిని అయినా ప్రశాంతంగా బతకనిద్దాం. కానీ.. వాడిని బలవంతంగా వెతికి తీసుకొచ్చి సాధించేదేం ఉండదు సౌందర్య అంటాడు ఆనంద రావు. వాడికి నచ్చినన్ని రోజులు ఉండనీయ్. ఎన్ని రోజులు ఉంటాడో సంతోషంగా ఉంటే చాలు.. అంటాడు ఆనంద రావు.
మరోవైపు దీప.. తన దగ్గర ఉన్న గాజులు, చెవుల కమ్మలు షావుకారి వద్ద తాకట్టు పెడుతుంది. వాటిని తాకట్టు పెడుతూ ఏడ్చేస్తుంది. చివరకు తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా తీసి ఇస్తుంది. వీటిని తాకట్టు పెట్టుకొని డబ్బు ఇవ్వండి అంటుంది. మీరు ఈ ఊరికి కొత్తా అంటాడు సేటు. అవును అంటుంది.
అయతే.. ఫోన్ లో ఫోటో చూస్తాడు. అది దీపదే. రుద్రాణి.. సేటుకు దీప ఫోటోను పంపించి తను వస్తే డబ్బులు ఇవ్వొద్దని చెబుతుంది. దీంతో నేను డబ్బులు ఇవ్వలేను అంటాడు. నీ కష్టం చూసి పాపం అనుకుంటే.. నేను కష్టాల్లో పడతాను అమ్మ అంటాడు సేటు.
దీంతో రుద్రాణి గారు వద్దన్నారా అంటుంది. అవును అమ్మ అంటాడు. సరే.. అయితే రుద్రాణి గారికి ఫోన్ చేయండి.. అంటుంది. కానీ.. వద్దంటాడు సేటు. ఏం కాదు మీరు ఫోన్ కలిపి నాకు ఇవ్వండి. నేను మాట్లాడుతాను అంటుంది. ఇంతలో రుద్రాణికి ఫోన్ వస్తుంది దీప.
నమస్తే రుద్రాణి గారు నేను దీపను మాట్లాడుతున్నాను.. అంటే ఏంటి కొత్తగా ఫోన్ చేశావు అంటుంది. ఫోన్ చేసేలా చేశావు కదా అంటుంది. మీరు మా బాధలను చూసి సంతోషిస్తున్నారని తెలుసు. సేటు దగ్గరికి వచ్చాను.. మెడలో తాళి కూడా తీశాను. డబ్బులు ఇవ్వమని చెబుతారో లేదో మీ ఇష్టం అంటుంది. దీంతో డబ్బులు ఇవ్వు అని సేటుకు చెబుతుంది రుద్రాణి.
దీప డబ్బులు తీసుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటుంది. కానీ.. రుద్రాణి వాళ్లకు పెడుతున్న కష్టాలను చూసి భయపడుతుంది జానకి. మరోవైపు ఇంటి దగ్గర కార్తీక్, పిల్లలు.. మొక్కలు నాటుతుంటారు. ఓహో.. మొక్కలు నాటుతున్నారా? మంచిపని చేస్తున్నారు అంటుంది. అయితే.. తన మెడలో, చెవికి బంగారు నగలు లేకపోవడం చూసి అక్కడ ఏవి అని అడుగుతుంది శ్రీవల్లి.
దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. దీప కూడా షాక్ అవుతుంది. పిల్లలు కూడా షాక్ అవుతారు. బంగారం అమ్మేశావా.. అని కోపంతో కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.