
siri comments on her Ariyana bigg boss 5 Telugu journey
Siri : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఆదివారం ముగిసింది. విజేతగా వీజే సన్నీ గెలిచాడు. రన్నర్‌గా యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ నిలిచాడు. ఈ సంగతులు అలా ఉంచితే.. సీజన్ ఫైవ్‌లో షణ్ముక్ జస్వంత్- సిరి హన్మంత్‌లు హైలైట్ గా నిలిచారని చెప్పొచ్చు. ఓ వైపు ఫ్రెండ్స్ అంటూనే మరో వైపున హగ్స్, ముద్దులు, బెడ్ పైన పకపక్కన పడుకోవడాలు, కూర్చోవడాలు ఇలా చెప్పుకుంటూ పోతే అదో పెద్ద స్టోరి అవుతుంది. ఈ విషయాలపై తాజా ఇంటర్వ్యూలో సిరి ఆసక్తికర సమాధానాలు చెప్పింది. అవి వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన నేపథ్యంలో ఆమె జర్నీని, బిగ్ బాస్ ఎక్స్‌పీరియెన్స్ గురించి తెలుసుకునేందుకుగాను సిరిని.. అరియానా తాజాగా ఇంటర్వ్యూ చేసింది.ఈ క్రమంలోనే అరియానా ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పింది సరి. స్టార్టింగ్ స్టార్టింగే అరియానా షణ్ముక్ జస్వంత్ ఫొటో డిస్ ప్లే చేసి.. అతనికి ఏం చెప్పాలో చెప్పు అని అడిగింది. అలా అరియానా ఇచ్చిన ఝలక్ చూసి.. సిరి ఏం తెలియనట్లే బిహేవ్ చేసింది. సీజన్ మొత్తం హగ్గుల యుద్ధం జరిగిందని అరియానా చెప్పకనే చెప్పింది. అలా అరియానా చెప్తుండగా సిరి నవ్వుతుండటం గమనార్హం.ఇకపోతే షణ్ణుకు ఐలవ్ యూ చెప్పావా ఏంటి అని అరియానా సిరిని అడిగింది. దానికి సమాధానంగా సిరి ఫ్రెండ్స్‌కు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారా అని అడిగింది.
siri comments on her Ariyana bigg boss 5 Telugu journey
అయితే, స్నేహం ముసుగులో షణ్ముక్ జస్వంత్, సిరి హన్మంత్ హద్దులు దాటిపోయారనే అభిప్రాయం సీజన్ మొత్తం చూసిన వారందరికీ అర్థమయి ఉంటుంది. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా సిరి తన స్నేహం గురించే మాట్లాడుతోంది.హౌజ్‌లో ఉన్నంత సేపు ఎప్పుడూ షణ్ణుతోనే ఉండింది సిరి. ఈ క్రమంలోనే తనతో ఎప్పుడూ ఉండాలనిపిస్తోందని సిరి షణ్ముక్ జస్వంత్‌కు చెప్పింది కూడా. ఇక షణ్ముక్ సైతం సిరి ఎలిమినేట్ అయిన తర్వాత అలా డోర్ వద్ద కూర్చొని ఏడ్చేశాడు. మొత్తానికి సిరి-షణ్ముక్ మధ్య ఏముందో అనే అన్ని ప్రశ్నలకు సిరి దాదాపుగా దాటవేసిందని చెప్పొచ్చు. ఓన్లీ ఫ్రెండ్ షిప్ అని చెప్తూ ముందుకు సాగింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.