Karthika Deepam 21 July Today Episode : బోనాలు సమర్పించిన సౌందర్య, హిమ, శౌర్య.. ఇంతలో హిమకు షాకిచ్చిన శౌర్య.. అమ్మ వారి దగ్గర ఏం కోరిక కోరుకుందో తెలుసా?

Authored By Varun G | The Telugu News | Updated on: July 21, 2022, 10:38 am

Karthika Deepam 21 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జులై 2022, గురువారం ఎపిసోడ్ 1410 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరూ నన్నే మోసం చేశారు. నేనెందుకు బాధపడాలి.. అని అనుకొని వెంటనే సుమతికి ఫోన్ చేస్తుంది శౌర్య. ఏం చేస్తున్నావు సుమతి. మన టైమ్ బాగోలేదు ఇప్పుడు. ఈరోజు ఆటో నడుపుతున్నాం. రేపు మనకు కలిసి రావచ్చు. రేపు మనం కారు ఓనర్ కావచ్చు. మనుషులను కాదు.. కాలాన్ని నమ్మాలని మా బాబాయి చెబుతుంటాడు. కారు ఓనర్స్ అనుకున్న వాళ్లు రేపు మనకు డ్రైవర్స్ కావచ్చు. అంతే కానీ.. ఆటో నడుపుతున్నావని ఎప్పుడూ ఫీల్ అవకు సుమతి. నీకు అర్థం అవుతోందా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శౌర్య.

karthika deepam 21 july 2022 full episode

karthika deepam 21 july 2022 full episode

ఏంటి శౌర్య నువ్వు ఇన్ డైరెక్ట్ గా నన్ను అంటున్నావా అని అంటాడు నిరుపమ్. దీంతో మిమ్మల్ని ఎందుకు అంటాను డాక్టర్ సాబ్ అంటుంది శౌర్య. మన మధ్య ఒక సంఘటన జరిగింది. దాని గురించి నువ్వు నేను క్లారిటీగా మాట్లాడుకున్నాం. దాన్ని నీ మనసులో నుంచి తీసేయవా. దాని గురించి ఎందుకు నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు అంటాడు. ఇంతలో కారు ఆపుతాడు నిరుపమ్. ఏమైంది డాక్టర్ సాబ్. కారు ఆపారు. దిగి ఇంటికి వెళ్లిపోమంటున్నారా? సరే.. వెళ్లిపోతానులే. మధ్యలో వచ్చిన దాన్ని కదా.. మధ్యలోనే వెళ్లిపోతానులే అంటూ కారు దిగుతుంది శౌర్య. ఇంతలో ఇల్లు వచ్చేస్తుంది.

అప్పుడే ఇల్లు వచ్చేసిందా. నేను చూసుకోలేదే అంటుంది. ఇంతలో సౌందర్య వాళ్ల కారు కూడా వస్తుంది. ఒరేయ్ ప్రేమ్ రా వెళ్దాం అంటాడు. దీంతో అప్పుడేనా కాసేపు ఆగి వెళ్దాం అంటాడు. దీంతో ఒరేయ్ నిరుపమ్ కాసేపు ఉండొచ్చు కదరా అంటుంది సౌందర్య. దీంతో కాస్త పని ఉంది అమ్మమ్మ అంటాడు.

Karthika Deepam 21 July Today Episode : నిరుపమ్ మొబైల్ ను తిరిగి ఇచ్చేసిన శౌర్య

నిరుపమ్ వెళ్లబోతుండగా ఒక్క నిమిషం డాక్టర్ సాబ్ అంటూ అతడి దగ్గరికి వెళ్తుంది శౌర్య. తన చేయి పట్టుకుంటుంది శౌర్య. తన చేతుల్లోని ఫోన్ ను అతడికి ఇచ్చేస్తుంది శౌర్య. ఎప్పటి నుంచో తిరిగి ఇచ్చేద్దామనుకున్నా కానీ.. కుదరలేదు. మీ ఫోన్ మీరు తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శౌర్య.

వీళ్లిద్దరినీ కలపడం ఏమో అనుకున్నా కానీ.. కష్టమే అని అనుకుంటాడు ప్రేమ్. మరోవైపు శౌర్య ఇంత కోపంగా ఉంది. వీళ్లను ఎలా ఒకటి చేయాలి అని అనుకుంటుంది హిమ. మరోవైపు సౌందర్య, ఆనంద రావు.. శౌర్య, హిమ గురించే ఆలోచిస్తూ ఉంటారు.

రేపటి బోనాల గురించి చెబుతుంది సౌందర్య. అందరూ బోనాల పండుగ కోసం అమ్మ వారి గుడికి వెళ్తారు. హిమ, శౌర్య ఇద్దరూ రెడీ అయి వస్తారు. హిమ ఎంత బాగుందో అని అనుకుంటాడు ప్రేమ్. శౌర్య, నిరుపమ్ ను కలిపితే నాకు లైన్ క్లియర్ అయిపోతుంది అని అనుకుంటాడు ప్రేమ్.

వెంటనే నిరుపమ్ ను పిలిచి శౌర్య దగ్గర నిలబడు అంటాడు. ఇక్కడే ఎందుకురా అంటే.. ఫోటోగ్రాఫర్ కు ఒక విజన్ ఉంటుంది చెప్పినట్టు వినాలి అంటాడు. తాతయ్య మీరు కూడా రండి అని చెప్పి శౌర్య, నిరుపమ్ ఇద్దరి ఫోటో తీస్తాడు ప్రేమ్. హిమను గంధం సిద్ధం చేయి అంటుంది సౌందర్య.

బోనాలు రెడీ చేసి.. సౌందర్య, హిమ, శౌర్య ముగ్గురు బోనాలు ఎత్తుతారు. బోనాలను తీసుకెళ్తూ ఉంటారు. హిమతో నా లైఫ్ హ్యాపీగా ఉండాలి అని మనసులో అనుకుంటాడు నిరుపమ్. తర్వాత బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు అందరూ. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందని పంతులు చెబుతాడు.

అది జరగాలంటే అక్కడున్న బిందెలో మీ కోరిక రాసి అందులో వేయండి. తప్పకుండా నెరవేరుతుంది అని అంటాడు. దీంతో శౌర్య, బావకు పెళ్లి కావాలి అని రాసి మొక్కుకొని అందులో వేస్తుంది హిమ. శౌర్య ఏం రాసిందో తెలుసుకోవాలని శౌర్య వేసిన చిట్టీని తీసి చదివి షాక్ అవుతుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp