Karthika Deepam Serial Today July 14 Episode : పారిజాతం మాస్టర్ ప్లాన్.. దీపను టార్గెట్ చేసిన జ్యోత్స్న.. వంటలక్కకు మళ్లీ కొత్త కష్టాలు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: July 14, 2026, 10:40 am
  •  Karthika Deepam Serial Today July 14 Episode : పారిజాతం మాస్టర్ ప్లాన్.. దీపను టార్గెట్ చేసిన జ్యోత్స్న.. వంటలక్కకు మళ్లీ కొత్త కష్టాలు.!

Karthika Deepam Serial Today: శివన్నారాయణ గెలుపు బాధ్యత మొత్తం దీప భుజాలపై స్టార్ మా Star Maaలో ప్రసారమవుతున్న కార్తీక దీపం Karthika Deepam Serial మరోసారి భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూలై 14 ఎపిసోడ్‌లో దీప Deepa జీవితంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. కంపెనీ CEOగా బాధ్యతలు చేపట్టిన దీపకు ఇప్పుడు మరింత పెద్ద సవాల్ ఎదురైంది. శివన్నారాయణ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే కీలక పోటీలో పాల్గొనాలని నిర్ణయించడంతో ఇంట్లో అందరూ ఉత్సాహంగా కనిపిస్తారు. అయితే ఈ పోటీ సాధారణం కాదని, ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని శివన్నారాయణ స్పష్టం చేస్తాడు.

Karthika Deepam Serial Today July 14 Episode : పారిజాతం మాస్టర్ ప్లాన్.. దీపను టార్గెట్ చేసిన జ్యోత్స్న.. వంటలక్కకు మళ్లీ కొత్త కష్టాలు..!

Karthika Deepam Serial Today July 14 Episode : పారిజాతం మాస్టర్ ప్లాన్.. దీపను టార్గెట్ చేసిన జ్యోత్స్న.. వంటలక్కకు మళ్లీ కొత్త కష్టాలు..!

“ఈ పోటీలో మనం గెలవాలి” అని కార్తీక్, దీప, సుమిత్రకు బాధ్యతలు అప్పగిస్తాడు. దీప కూడా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని నిర్ణయించుకుంటుంది. సుమిత్ర సైతం దీపకు ధైర్యం చెబుతూ, “ఇది కేవలం పోటీ కాదు.. మన కుటుంబ గౌరవం” అని గుర్తు చేస్తుంది. ఇక మరోవైపు దక్షిణామూర్తి Dakshinamurthy ఇంట్లోనూ ఇదే అంశంపై చర్చ సాగుతుంది. శివన్నారాయణ పోటీలోకి రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందని దక్షిణామూర్తి చెబుతాడు. మాలిని మాత్రం ఈ పోటీలో తమదే విజయం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఆమె మనసులో మాత్రం మరో రహస్య ప్లాన్ నడుస్తున్నట్లు ప్రేక్షకులకు స్పష్టమవుతుంది.

Karthika Deepam Serial Today July 14 Episode : Parijatham Master Plan: దీపను ఓడించి శివన్నారాయణ పరువు తీయాలన్న కుట్ర

ఈ ఎపిసోడ్‌లో అసలు హైలైట్ పారిజాతం Parijatham, జ్యోత్స్న Jyothsna మధ్య జరిగిన సంభాషణే. శివన్నారాయణ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను గమనించిన పారిజాతం, దీపనే లక్ష్యంగా చేసుకుని కొత్త కుట్రకు తెరలేపుతుంది.జ్యోత్స్నతో మాట్లాడిన పారిజాతం, “దక్షిణామూర్తి బలం మాలిని అయితే… శివన్నారాయణ బలం దీప” అని చెప్పి కీలక వ్యాఖ్య చేస్తుంది. అదే సమయంలో జ్యోత్స్న కూడా దీపపై ఉన్న శివన్నారాయణ నమ్మకాన్ని దెబ్బతీయడమే తమ అసలు లక్ష్యమని చెబుతుంది.”శివన్నారాయణను ఓడించడం కంటే, ఆయన దీపపై పెట్టుకున్న నమ్మకాన్ని కూల్చేస్తే చాలు” అని జ్యోత్స్న చెప్పడం కథలో కొత్త ఉత్కంఠకు కారణమవుతుంది.

దీంతో పారిజాతం కూడా రాత్రంతా ఆలోచించి సూరజ్ పోటీలో పాల్గొనకుండా చేసే ప్లాన్ సిద్ధం చేస్తానని హామీ ఇస్తుంది.ఇక ఇదే సమయంలో అనసూయ ఇంటిని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం కూడా భావోద్వేగంగా సాగుతుంది. కానీ శౌర్య తన అమాయకమైన మాటలతో అనసూయను ఆపేస్తుంది. “నువ్వు లేకపోతే నన్నెవరు ఆట పట్టిస్తారు?” అని అడగడంతో అనసూయ మనసు కరిగిపోతుంది. మొత్తానికి ఈరోజు Karthika Deepam Serial Today Episode లో కుటుంబ బంధాలు ఒకవైపు కనిపిస్తే… మరోవైపు పారిజాతం, జ్యోత్స్న వేసిన కుట్రలు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. రాబోయే ఎపిసోడ్‌లో దీప ఈ కుట్రలను ఎలా ఎదుర్కొంటుంది? శివన్నారాయణ గౌరవాన్ని కాపాడగలదా? పారిజాతం ప్లాన్ సక్సెస్ అవుతుందా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  2. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  3. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  4. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  5. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  6. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  7. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp