Karthika Deepam 21 May Today Episode : శోభకు షాకిచ్చిన జ్వాల.. ఇంతకీ శోభ ఎవరు? తనకు మోనితకు ఏమైనా సంబంధం ఉందా? స్వప్న.. శోభను ఎందుకు పిలిచింది?

Karthika Deepam 21 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 మే 2022 శనివారం ఎపిసోడ్ 1358 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిరుపమ్ కు స్వప్న.. తన స్టోరీ గురించి చెబుతుంది. తనకు, సత్యానికి మధ్య జరిగిన గొడవల గురించి చెబుతుంది. సత్యం తనను ఎలా మోసం చేశాడో చెబుతుంది. నేను తనను తలుచుకొని కుమిలిపోవడం లేదు. నువ్వు కూడా గొప్పవాడివి. అసలు ఎందుకు బాధపడతావు. ప్రేమలో మోసపోవడం అనేది మనకు వారసత్వంగా వస్తుందేమో. మీనాన్నను నమ్మి నేను మోసపోయాను. మీనాన్నది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే అని మీ నాన్న పెళ్లయిన మొదటి రోజు చెబితే నమ్మేశాను. తర్వాత చేయాల్సిన మోసం చేసేశాడు. ఆ హిమ.. పెద్ద నష్టజాతకురాలు. ఆ దరిద్రం పోయిందని సంతోషించాలి. నువ్వు ఇలా దాన్నే తలుచుకుంటూ ఏమవుతావో అని భయమేస్తోంది. లేరా.. ఎప్పటి లాగా ఉండరా అని అంటుంది స్వప్న.

karthika deepam 21 may 2022 full episode

హాస్పిటల్ కు వెళ్లు అంటుంది. వద్దులే.. హాస్పిటల్ కు వెళ్తే మళ్లీ ఆ దరిద్రాన్ని చూడాల్సి వస్తుంది అంటుంది స్వప్న. దీంతో నేను హాస్పిటల్ కు వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు నిరుపమ్. మరోవైపు కొత్త క్యారెక్టర్ ను పరిచయం చేస్తారు సీరియల్ లో. తన పేరు శోభ. హాస్పిటల్ నుంచి తనకు ఫోన్ వస్తుంది. ఎవరో ఒక అమ్మాయికి సీరియస్ ఉందంటే.. వీడియో కాల్ లో ఏం చేయాలో చెబుతుంది. అడ్వాన్స్ కట్టించుకొని ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయండి. 5 లక్షలు దాకా ఖర్చవుతుందని చెప్పండి. నేను వస్తున్నాను అని చెబుతుంది శోభ. మరోవైపు కారులో జ్వాల, హిమ వెళ్తూ ఉంటారు.

నానమ్మ, శౌర్యలు కలుసుకున్నారేమో అని టెన్షన్ పడుతుంది హిమ. నానమ్మకు ఫోన్ ఎవరు చేశారు అని అనుకుంటుంది హిమ. ఇంతలో కారు ఆగిపోతుంది. మధ్యలో ఆగిపోవడంతో శోభ కారు వచ్చి హారన్ మోగిస్తూ ఉంటుంది. కానీ.. హిమ మాత్రం కారు స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బయటికి రావే అంటూ హిమను పిలుస్తుంది శోభ.

శోభ కారులో నుంచి దిగిన హిమపై చేయి చేసుకుంటుంది. దీంతో కోపంతో జ్వాల.. శోభపై చెంప చెళ్లుమనిపిస్తుంది. నేను ఎవరో నా సంగతేంటో నీకు తెలుసా? కారును మధ్యలో ఆపి ఏం చేస్తున్నారు.. అని అడుగుతుంది శోభ. దీంతో కారు మధ్యలో ఆగిపోయింది అని అడుగుతుంది.

నా ముందే నా తింగరిని కొట్టావు. నిన్ను రెండు దెబ్బలు కొట్టినా నా కోపం చల్లార లేదు అంటుంది జ్వాల. ఆ తర్వాత శోభ.. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదంతా అవసరమా అంటుంది జ్వాల. దీంతో అవసరమే తింగరి. ఒకటికి రెండు కొట్టాలి. బతకాలంటే ఇలాగే ఉండాలి అంటుంది.

ఇంతలో శోభకు.. స్వప్న ఫోన్ చేస్తుంది. ఒకసారి ఇంటికి రా.. నిరుపమ్ గురించి మాట్లాడాలి అంటుంది స్వప్న. దీంతో సరే ఆంటి వస్తా అంటుంది శోభ. కారు చెడిపోతే పోయింది కానీ.. ఇలా నడుచుకుంటూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని తింగరితో అంటుంది జ్వాల.

అవును.. అంటుంది హిమ. ఎందుకు తింగరి.. టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. దీంతో ఏం లేదు అంటుంది. శౌర్యను, నిరుపమ్ ను ఎలా కలపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది హిమ. బావ మనసులో నా మీద కోపం పెరగాలి. శౌర్య మీద ప్రేమ పెరగాలి. ఏం చేసి అయినా.. నిరుపమ్ బావను, శౌర్యను ఒకటి చేయాలి. ఇదే నా లక్ష్యం. కానీ.. అది అంత ఈజీ కాదు. కానీ.. దాన్ని నిజం చేయాలి అని అనుకుంటుంది.

ఏమైంది తింగరి అని అడుగుతుంది జ్వాల. దీంతో చెప్పు జ్వాల అంటుంది. నాకు ఒక డౌట్ అని అడుగుతుంది. ఏం లేదబ్బా.. ఇప్పుడు నువ్వేమో డాక్టర్ సాబ్ ను బావ బావ అంటావు కదా అంటుంది. కలిసి తిరుగుతారు.. బావా మరదళ్లు.. ఇద్దరూ డాక్టర్లే. డాక్టర్ సాబ్.. అందంగా ఉంటారు. మంచివారు. ఎప్పుడూ డాక్టర్ సాబ్ ను నీకు పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా తింగరి అంటుంది జ్వాల.

Karthika Deepam 21 May Today Episode : నిరుపమ్ తనకు ఐలవ్యూ చెప్పాడని హిమకు చెప్పిన జ్వాల

దీంతో హిమకు ఏం చెప్పాలో అర్థం కాదు. డాక్టర్ సాబ్ కన్నా మంచోడు నీకు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అంటుంది జ్వాల. దీంతో నాకు మీ డాక్టర్ సాబ్ నచ్చలేదు అంటుంది హిమ. నా మనసులో ఉన్న మాట నీకు చెప్పలేను శౌర్య. అందుకు నీకు బావ నచ్చడమే ఆ ఒక్క కారణం.

అంతే తప్ప బావలో ఎలాంటి లోపాలు లేవు. నా మనసులో మీ డాక్టర్ సాబ్ కు చోటు లేదు అంటుంది హిమ. కానీ.. నా మనసులో డాక్టర్ సాబ్ కు చోటుంది అని అంటుంది జ్వాల. చోటు ఉండటం ఏంటి.. మనసు నిండ డాక్టర్ సాబే అంటుంది జ్వాల.

అవునా అంటుంది హిమ. డాక్టర్ సాబ్ అంటే నాకు ఇష్టం అంటుంది హిమ. మేరీ జాన్. నా ప్రాణం అంటుంది హిమ. నా జీవితం అంటుంది. అసలు.. నీకు ఒక విషయం తెలుసా.. నాకు డాక్టర్ సాబ్ ఐలవ్యూ చెప్పారు అంటుంది జ్వాల. దీంతో హిమ షాక్ అవుతుంది.

అవునా అంటుంది హిమ. అవును.. ఒకరోజు ఎందుకో కానీ.. బాగా మందేశారు. ఒక్క ఐలవ్యూ అని మాత్రం చెప్పారు అంటుంది శౌర్య. అయ్యో శౌర్య.. నిరుపమ్ బావ నీకు కాదు.. నాకు చెప్పాడు ఐలవ్యూ అని. అది నీకు అనుకొని పొరపాటు పడ్డావు. నేను కాదన్నానని బావ ఆరోజు తాగాడు అని అనుకుంటుంది హిమ.

ఈరోజో రేపో డాక్టర్ సాబ్ కు అసలు విషయం చెప్పేస్తాను అంటుంది జ్వాల. నువ్వు నాకు ఈ విషయంలో సపోర్ట్ చేయాలి అంటుంది జ్వాల. దీంతో తప్పకుండా.. అది నా బాధ్యత అంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

16 minutes ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

1 hour ago

Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?

Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…

2 hours ago

Telangana Jobs : నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే 5 జాబ్ నోటిఫికేష‌న్స్‌

Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభ‌వార్త‌. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

3 hours ago

Gut Health : మీ పేగు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 7 ప్రీబయోటిక్ ఆహారాలు తీసుకోండి… మీరు షాకే..?

Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…

4 hours ago

Zodiac Signs : 2025 జూన్ 9వ తేదీ నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పొమ్మన్నా పోదు… డబ్బే డబ్బు…?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…

5 hours ago

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

14 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

15 hours ago