Karthika Deepam 21 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ 21 సెప్టెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1150 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మోనిత శకం ముగిసిపోలేదు.. గుర్తుపెట్టుకోండి… మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి.. బిడ్డతో వస్తాను.. ఐలవ్యూ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. కార్తీక్.. నా కార్తీక్.. మన ప్రేమకు వారసుడు పుట్టబోతున్నాడు. వాడి ప్రేమను పొందడానికి సిద్ధంగా ఉండు.. లవ్యూ కార్తీక్.. అంటూ కార్తీక్ కు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి అక్కడి నుంచి జైలుకు వెళ్లిపోతుంది దీప.
కట్ చేస్తే.. కార్తీక్ తెగ ఆలోచిస్తుంటాడు. దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని కాను.. అని ఒకప్పుడు తన భార్య దీపను ఇంట్లో నుంచి పంపించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. మోనిత.. ఎలా గర్భం తెచ్చుకుందో గుర్తు తెచ్చుకుంటాడు. ఒక్కసారిగా గిర్రున గతమంతా గుర్తు తెచ్చుకొని తెగ బాధపడుతుంటాడు కార్తీక్.
ఇంతలో దీప.. కార్తీక్ ఎక్కడ ఉన్నాడో అని వెతుకుతుంది. అత్తయ్య మీరు ఆయన్ను చూశారా.. అని అడుగుతుంది. లేదు.. అంటుంది. అందరూ కలిసి పైకి వెళ్లగా.. అక్కడే కార్తీక్ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది.. అని అడగగానే.. కోర్టు నన్ను నిర్దోషిని అని వదిలేసినా.. చేసిన తప్పుకు శిక్ష మాత్రం అనుభవిస్తున్నాను.. అని అంటాడు కార్తీక్.
నీకేం తక్కువరా.. అన్నీ ఉన్నాయి.. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు.. అని ఆనంద రావు అనగానే.. అన్నీ ఉన్నాయి ఒక్కటి తప్ప. సంఘంలో గౌరవం, మర్యాద. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని బయటికి వెళ్తాను. తన గురించి తెలిసి కూడా తనకు దగ్గరయ్యాను. దీంతో నన్ను బొమ్మలాట ఆడుకుంది. చివరకు అమ్మానాన్న ఆట కూడా ఆడుకుంది..అంటాడు కార్తీక్.
ఇప్పుడు దాని పీడ విరగడ అయింది కదా. తనను మనసులో నుంచి తీసేయండి.. అంటుంది దీప. అది జైలుకు ఒక్కతే వెళ్తే.. నేను కూడా పెద్దగా టెన్షన్ పడేవాడిని కాదు. కానీ.. కడుపులో ఒక అణుబాంబును మోసుకెళ్లింది. ఆ బాంబు దాటికి ఎంతమంది బలైపోతారో అని ఊహించుకోవడానికే భయంగా ఉంది.. అని అంటాడు కార్తీక్.
కార్తీక్.. నా సుపుత్రుడేనా.. ఇంత బేలగా మాట్లాడుతోంది. ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్లే మాట్లాడాలి. నిజాయితీపరులు, నిక్కచ్చిగా ఉండేవాళ్లు గుండెబరువుతో లేకుండా మాట్లాడాలి. ఎప్పుడో ఏదో జరుగుతుందని.. ఇప్పటి నుంచే నువ్వు బాధపడకు. ముందు నువ్వు నీ భార్యాబిడ్డలతో ప్రశాంతంగా గడుపు.. అని చెప్పి సౌందర్య, ఆనందరావు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
కట్ చేస్తే.. శిక్ష ఎంత వేశారు మోనితకు ఆదిత్య.. అని శ్రావ్య అడుగుతుంది. 5 లక్షలు జరిమానా వేశారు. 18 నెలల జైలు శిక్ష వేశారు.. అని చెబుతాడు ఆదిత్య. అంత తక్కువ వేశారు ఏంటి.. అని అడుగుతుంది శ్రావ్య. అది చేసిన నేరాలు ఒకటా.. రెండా.. వందలు ఉన్నాయి. ఒక్కో నేరానికి కనీసం ఏడాది వేసినా.. శిక్ష అనుభవించడానికి తన వయసు సరిపోదు.. అంటుంది శ్రావ్య.
అవును.. అన్నయ్య, వదిన.. ఇద్దరూ 10 ఏళ్లుగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు దూరంగా బతకాల్సి వచ్చింది.. అని అంటాడు ఆదిత్య. అది విడుదల అయి వచ్చాక.. అక్కకు, బావకు ఇంకా ఎన్ని సమస్యలు తీసుకొస్తుందో ఏమో.. అని భయపడుతుంది శ్రావ్య.
ఇంతలో శ్రావ్య.. కార్తీక్ ను చూసి.. బావ గారు.. ఏమైనా తీసుకురమ్మంటారా.. అంటుంది. వద్దులే.. దీపుగాడు ఎలా ఉన్నాడు. ఆదిత్యను ఒకసారి రమ్మను అంటాడు. సరే.. అంటుంది. చాలా రోజులకు మిమ్మల్ని సంతోషంగా చూస్తున్నాను బావగారు అంటుంది శ్రావ్య.
ఇంతలో పిల్లలు అక్కడికి వస్తారు. దీప.. ఫ్రూట్స్ తీసుకొస్తుంది. అందరూ కలిసి ఫ్రూట్స్ తింటుంటారు. నాన్నా అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అన్నావు కదా. ఎక్కడికి వెళ్దాం అని అడుగుతారు పిల్లలు. ఊటీకి వెళ్దామా.. అని హిమ అంటే లేదు లేదు.. వైజాగ్ వెళ్దాం అని శౌర్య అంటుంది. నువ్వు వెళ్లి వంటలు ప్లాన్ చేసుకో.. మేము టూర్ ప్లాన్ చేస్తాం.. అని దీపకు చెబుతుంది శౌర్య. డాక్టర్ బాబు.. మీరు పిల్లలను అతి గారాబం చేయకండి.. వాళ్లు మీ సంకనెక్కుతారు.. అంటుంది దీప.
డాడీ.. మనం వైజాగ్ ఎప్పుడు వెళ్తున్నాం అని అంటుండగానే.. సౌందర్య అక్కడికి వస్తుంది. ఏంటి రౌడీ వైజాగ్ అంటున్నావు.. ఏంటి విషయం.. అనగానే.. మీరే చెప్పండి అత్తయ్య.. టూర్ అంటుంది.. అనగానే ఇప్పుడే కదా.. అందరం కలిసింది. అందరూ నా కళ్ల ముందు ఉండాల్సిందే.. అని అంటుంది సౌందర్య. అవునా.. మరి మేము యూఎస్ వెళ్తే ఏం చేస్తావు.. అని అడుగుతుంది శౌర్య. అప్పుడు నా కొడుకు, కోడలును మాత్రమే పంపిస్తా.. మిమ్మల్ని మాత్రం అస్సలు పంపించను. మా దగ్గరే ఉంచుకుంటాం.. అని అంటుంది సౌందర్య.
నానమ్మ ఏదో ఊరికే అంది… అని అందరూ అన్నా.. అమ్మ చెప్పిందే కరెక్ట్ అని అంటాడు ఆదిత్య. ఏంట్రా నువ్వు చెప్పేది.. వాళ్లు అమెరికా వెళ్లడం ఏంటి.. అని అడుగుతారు అందరూ. నేను ఏదో ఊరికే అన్నానురా అంటుంది సౌందర్య. నేను చెప్పేది కరెక్టే.. నేను చెప్పేది ఆలోచించడానికి మీకు సమయం పడుతుంది.. అంటాడు ఆదిత్య. ఆదిత్య.. ఎందుకు అలా అన్నాడు.. అని కార్తీక్ టెన్షన్ పడతాడు.
నాన్నమ్మా మీరు చెప్పినవి అబద్ధాలు అని తెలిసి కూడా నమ్మాం. మనమందరం ఎప్పటికీ ఇలాగే ఒకే ఇంట్లో కలిసి ఉంటామా.. అని శౌర్య అడుగుతుంది. మన బంధాలు పదిలంగా కాపాడుకోవాలంటే.. మనం ఈ విషయాన్ని పిల్లలకు చెప్పాలి.. అని అంటుంది దీప. ఆపు దీప.. ఈ మురికి విషయాన్ని నువ్వు చంటి పిల్లలకు చెబుతావా? అంటాడు కార్తీక్. ఏమని చెబుతావు.
నువ్వేం చెబుతావు.. వాళ్లు ఏం అర్థం చేసుకుంటారు. ఆ మోనిత బిడ్డను కని ఇక్కడికి వచ్చేలోగా మనం అందరం అమెరికా వెళ్లిపోదాం.. అని కార్తీక్ దీపతో చెబుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.