
karthika deepam 22 december 2021 full episode
Karthika Deepam 22 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 1229 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా కొడుకును ఎవరు ఎత్తుకెళ్లారు అని తెగ టెన్షన్ పడుతుంటుంది మోనిత. ఇంతలో ఆదిత్య, శ్రావ్య వస్తారు. రండి మరిది గారు అంటూ వరుసలు కలుపుతుంది మోనిత. నీకు వరుసలు కలపడం బాగా తెలుసు అంటాడు ఆదిత్య. రాగానే ఏదో ఒకటి అనకుండా ఉండవా? అంటుంది. చూడు మోనిత.. నువ్వు ఒక డాక్టర్ వి అంటూ ఏదో అనబోతాడు. ఇంతలోనే మోనిత సెటైర్లు వేస్తుంది. ఇవన్నీ నాకు చెప్పకు అంటుంది. దీంతో మోనితపై కోపంగా విరుచుకుపడబోతాడు. శ్రావ్య ఆపుతుంది. నా కొడుకును ఎక్కడ దాచావో చెప్పు అంటుంది మోనిత. నీ కొడుకును దాయాల్సిన అవసరం నాకేంటి అంటాడు ఆదిత్య. నా కొడుకు దొరికే వరకు నేను ఇక్కడే ఉంటా.. అంటూ మోనిత చెబుతుంది.
karthika deepam 22 december 2021 full episode
మరోవైపు శ్రీవల్లి కొడుకు బాగా ఏడుస్తుంటారు. ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోడు. శ్రీవల్లి ఎంతో ట్రై చేస్తుంది. పిల్లలు కూడా ఆ పిల్లాడిని ఊరుకుంచుకునేందుకు ఎంతో ట్రై చేస్తారు కానీ.. పిల్లాడు ఏడుపును ఆపడు. ఇంతలో కార్తీక్ వచ్చి పిల్లాడిని ఎత్తుకుంటాడు. దీంతో పిల్లాడు ఊరుకుంటాడు. అదరూ షాక్ అవుతారు. ఆ తర్వాత పిల్లాడిని తీసుకుంటుంది శ్రీవల్లి. మళ్లీ పిల్లాడిని తీసుకునే సరికి.. ఏడుపు ప్రారంభిస్తాడు. మళ్లీ కార్తీక్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. ఇంతలో కోటేశ్ వచ్చి బాబుకు చుక్కల మందు వేయించాలని పిల్లాడిని తీసుకెళ్తాడు. మరోవైపు దీప.. సేటు దగ్గర తాకట్టు పెట్టిన నగలతో డబ్బులు తీసుకొని ఇంట్లోకి కావాల్సిన సరుకులను తీసుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఒకవేళ ఈ విషయం కార్తీక్ బాబుకు తెలిస్తే ఊరుకుంటారా అని భయపడుతుంది దీప. అంత ఆస్తినే వదిలేశారు.. ఇదో లెక్కా అని అనుకుంటుంది దీప.
మరోవైపు రుద్రాణి.. కారులో ఎక్కడికో వెళ్తుంది. అరేయ్.. మెల్లగా పోనియ్ రా.. రుద్రాణిని ఈ ఊరి వాళ్లు చూడాలి.. అంటుంది. ఇంతలో కోటేశ్, శ్రీవల్లి పిల్లాడిని తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంటారు. రుద్రాణి వాళ్లను చూస్తుంది. దీంతో షాక్ అవుతారు. ఏరా కోటేశ్.. మమ్మల్ని చూసి తలదించుకొని వెళ్తున్నావు.
కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వచ్చినట్టు నీకు టైమ్ బాగున్నట్టుందే. నీ బిడ్డను ఇటు తీసుకురా అంటుంది. దీంతో తన కొడుకును చూస్తుంది రుద్రాణి. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు అంటుంది. బిడ్డకు దిష్టి తీస్తుంది రుద్రాణి. నీ బిడ్డకు నేను తీశాను. మరి నీకు ఎవరు దిష్టి తీస్తారు చెప్పు.. అంటుంది రుద్రాణి.
మనం ఎంత గొప్పవాళ్లం అయినా గుడికి వెళ్లాలి.. దండం పెట్టుకోవాలి అంటుంది. నీ ఇంట్లో దిక్కు దివానా లేని ఇద్దరు వచ్చి ఉండేసరికి.. నీకు రుద్రాణి మీద భయం పోయిందా అంటుంది రుద్రాణి. వాళ్లను ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. పిలిచాను… వార్నింగ్ ఇచ్చాను.. గడువు దాటాక మీ పరిస్థితి ఏంటో అప్పుడు తెలుస్తుంది అంటుంది రుద్రాణి.
మరోవైపు కార్తీక్ అసలు తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటాడు. డబ్బులు ఎలా కట్టాలా అని ఆలోచిస్తుంటాడు. ఏదో ఒక పని చేయాలి. ఎలాగైనా అని అనుకుంటుండగానే ఓ వ్యక్తి డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ పిలుస్తాడు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. అక్కడే పక్కన ఓ ఆర్ఎంపీ వేరే వ్యక్తికి వైద్యం చేస్తుంటాడు.
అతడు.. డబ్బులు తక్కువగా ఇస్తున్నారని వైద్యాన్ని నిర్లక్ష్యంగా చేస్తున్నాడని తెలుసుకుంటాడు కార్తీక్. దీంతో ఏం చేయాలో అతడికి అర్థం కాదు. అసలు ఈ ఊళ్లో మంచి డాక్టరే లేడా అని అనుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు.
మీరే నా బిడ్డను ఎత్తుకెళ్లారేమో అంటూ సౌందర్యతో గొడవకు దిగుతుంది మోనిత. అప్పుడు హిమను ఎత్తుకొచ్చుకొని ఉంచుకున్నారు కదా.. అలాగే ఇప్పుడు కూడా నా బిడ్డను ఎత్తుకెళ్లి ఎక్కడైనా దాచిపెట్టారేమో అని అంటుంది మోనిత. దీంతో నోర్మూయ్ మోనిత అంటూ సీరియస్ అవుతుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.