Karthika Deepam 22 July Today Episode : అమ్మ వారి దగ్గర చీటీలో శౌర్య ఏం రాసిందో చూసి హిమ షాక్.. నిరుపమ్ మీద ప్రేమను చంపేసుకున్న శౌర్య.. ఎందుకు? ఎవరి కోసం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 22 July Today Episode : అమ్మ వారి దగ్గర చీటీలో శౌర్య ఏం రాసిందో చూసి హిమ షాక్.. నిరుపమ్ మీద ప్రేమను చంపేసుకున్న శౌర్య.. ఎందుకు? ఎవరి కోసం?

 Authored By gatla | The Telugu News | Updated on :22 July 2022,11:00 am

Karthika Deepam 22 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 1411 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బోనాలు సమర్పించాక.. అమ్మ వారి దగ్గర ఉన్న బిందెలో ఏదైనా కోరిక కోరుకొని చీటీ రాసి అందులో వేయాలి అని పంతులు చెబుతాడు. దీంతో ముందుగా ఆనంద రావు చీటీ వేసి తన మనవళ్లు, మనవరాళ్లు అందరూ బాగుండాలని కోరుకుంటాడు. మరోవైపు సౌందర్య.. తన ఇద్దరు మనవరాళ్లు కలవాలని కోరుకుంటుంది. నిరుపమ్ మాత్రం హిమతో పెళ్లి ఎలాంటి అడ్డంకులు లేకుండా జరగాలని కోరుకుంటాడు. హిమ.. నిరుపమ్, శౌర్యకు పెళ్లి జరగాలని కోరుకుంటుంది. ఆ తర్వాత శౌర్య వంతు వస్తుంది. శౌర్య ఏం రాస్తుందో, ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలని అనుకుంటుంది హిమ. దీంతో తను చీటీ రాసి.. వెళ్లిపోయాక అందులో ఉన్న చీటీని తీసి చూస్తుంది.

karthika deepam 22 july 2022 full episode

karthika deepam 22 july 2022 full episode

అందులో శౌర్య రాసిన దాన్ని చూసి షాక్ అవుతుంది. అమ్మా నాన్న రావాలి అని శౌర్య రాస్తుంది. దీంతో శౌర్య ఏంటి ఇలా రాసింది అని అనుకుంటుంది హిమ. శౌర్య వెళ్లిపోబోతుండగా ఆపి ఏంటి శౌర్య ఏం ఆలోచిస్తున్నావు అంటుంది హిమ. దీంతో నేను ఏం ఆలోచిస్తే నీకెందుకు అంటుంది శౌర్య. నువ్వు ఆ చీటీలో ఏం రాశావు అని అడుగుతుంది హిమ. దీంతో నేను ఏం రాస్తే నీకెందుకు. నువ్వు ఏం రాశావో మాత్రం నాకు బాగా తెలుసు అంటుంది. నీ నిరుపమ్ బావ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నా కూడా నేను వద్దు అంటాను అని చెప్పి వెళ్లిపోతుంది శౌర్య. దీంతో హిమ షాక్ అవుతుంది.

మరోవైపు ప్రేమ్, నిరుపమ్ ఇద్దరూ ఇంటికి కారులో వెళ్తుంటారు. బోనాల పండుగ బాగా జరిగింది అంటాడు ప్రేమ్. బోనాల పండుగ దగ్గర ఎందుకు అలా ఉన్నావు అంటాడు ప్రేమ్. దీంతో నువ్వే బలవంతంగా తీసుకొచ్చావు కదా అంటాడు నిరుపమ్. పండుగలు అంటే ఇష్టమే నాకు కానీ.. అంటాడు నిరుపమ్.

Karthika Deepam 22 July Today Episode : ప్రేమ్ పై చిరాకుపడ్డ నిరుపమ్

ఎవరితోనైనా ఒక్కమాట అయినా మాట్లాడావా అంటాడు ప్రేమ్. ఆ శౌర్య చాలా మంచి అమ్మాయి అంటాడు ప్రేమ్. దీంతో అసలు శౌర్య గురించి నా ముందు మాట్లాడకు. బోనాలు అంటావు. తన పక్కన నిలుచోమంటావు. అసలు నాకు శౌర్యతో పనేంటి. నేను హిమను పెళ్లి చేసుకుంటున్నాను. మొదటి నుంచి ఒకే మాట మీద నిలుచనున్నాను అంటాడు నిరుపమ్.

దీంతో ప్రేమ్ కు ఏం మాట్లాడాలో అర్థం కాదు. వీళ్లిద్దరిని ఎలా కలపాలో అర్థం కావట్లేదు అని అనుకుంటాడు ప్రేమ్. కట్ చేస్తే.. సౌందర్య, ఆనంద రావు ఇద్దరూ మరో ప్లాన్ వేస్తారు. ఆపరేషన్ వృద్ధాశ్రమం తర్వాత ఇద్దరినీ ఇంట్లోనే ఉంచేందుకు శౌర్య ఆటోలోని గాలిని తీసేయాలని సౌందర్య చెబుతుంది.

దీంతో శౌర్య ఆటో టైర్ గాలిని తీస్తాడు ఆనంద రావు. ఇంతలో శౌర్య వచ్చి ఆటో స్టార్ట్ చేసి వెళ్లబోతుండగా టైర్ లో గాలి లేదని చూస్తుంది. దీంతో వెంటనే సుమతికి ఫోన్ చేసి స్టెపిన్ మార్చే వాడిని పంపించు అంటుంది. దీంతో సౌందర్య, ఆనంద రావు ఇద్దరి ప్లాన్ బెడిసికొడుతుంది.

మరోవైపు శోభ.. నిరుపమ్ తో మాట్లాడటానికి వస్తుంది. లైఫ్ లో మనం చేసే పనికి, మన లైఫ్ కు సంబంధం ఉండదు అంటుంది. దీంతో నేనే మూడ్ ఆఫ్ లో ఉన్నా అంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటాడు నిరుపమ్. నాకూ మూడ్ బాగోలేదు. మనం అలా బయటికి వెళ్దామా అంటుంది శోభ.

దీంతో ఎక్కడికి అంటాడు నిరుపమ్. కాఫీ షాపునకు వెళ్దాం అంటుంది. ఇప్పుడు వద్దులే బాగోదు అంటాడు నిరుపమ్. అసలు నేనే నీకు ఫోన్ చేసి అర్జెంట్ గా మాట్లాడాలి కాఫీ షాపునకు రా అని పిలుద్దాం అనుకున్నాను అని నిరుపమ్ తో అంటుంది శోభ.

ఇంటికి వస్తే.. ఆంటిని కలిసినట్టు ఉంటుంది. నిన్ను తీసుకెళ్లినట్టు ఉంటుంది అని అనుకున్నాను. ఏంటి నిరుపమ్.. కాఫీ షాపునకే కదా రమ్మన్నది అంటుంది. నిరుపమ్ కు హిమ మీద నాలుగు చెడు మాటలు చెప్పి హిమ మీద కోపం వచ్చేలా చేయాలని అనుకుంటుంది శోభ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది