
Karthika deepam 22 november 2021 full episode
Karthika Deepam 22 Nov Today Episode: కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 నవంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 1203 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన కొడుకు బారసాలకు అందరూ తప్పకుండా రావాలంటూ మోనిత అందరికీ చెప్పడంతో.. నువ్వేం టెన్షన్ పడకు మోనిత. నేను అందరినీ తీసుకొస్తా కదా అని మోనితకు భరోసా ఇస్తుంది. దీంతో మోనితతో పాటు ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నువ్వేం కంగారు పడకు. నాకు బొకే తెచ్చినందుకు థాంక్స్. నువ్వెళ్లి బారసాలకు ఏర్పాట్లు చేసుకో. వీళ్లందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది అంటుంది దీప.
Karthika deepam 22 november 2021 full episode
దీంతో దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కారులో వెళ్తు.. తెగ టెన్షన్ పడుతుంది మోనిత. అసలు.. దీప ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది. అసలు దీప ఏం చేయబోతోంది. నన్ను ఎందుకు ఇంత టెన్షన్ పెడుతోంది. దీప ప్లాన్ ఏంటి. ఎటునుంచి నరుక్కుంటూ వస్తోంది. దీపక్కకు ఏమైంది మరి.. ఈ సినిమాకు క్లయిమాక్స్ అదిరిపోయేలా చూపిస్తాను. అది రేపే ఉంటుంది అందంటే.. రేపు ఏం చేయబోతోంది. నన్ను భయపెడుతుందా? అంటూ తనకు తానే ఏదేదో ఊహించుకుంటుంది మోనిత.
కట్ చేస్తే కార్తీక్ కూడా చాలా టెన్షన్ పడతాడు. మనల్ని బారసాలకు తీసుకెళ్తా అని దీప అంటుంది ఏంటి. అసలు.. దీప ఏం మాట్లాడుతోందో నాకేం అర్థం కావడం లేదని కార్తీక్ సౌందర్యతో అంటాడు. అసలు దీపకు ఏమైంది అంటాడు. దీప మనసులో ఏముందో.. ఏం ఆలోచిస్తోందో అస్సలు అంతు చిక్కడం లేదు అంటుంది సౌందర్య.
కొద్ది సేపు అరిస్తే పోయే బాధ కాదు తనది. మీరిద్దరు కలిసి దీప కళ్లకు గంతలు కట్టారు. కానీ.. దీప ఆ కళ్ల గంతల్లోంచి అంతా కనిపిస్తున్నా.. ఏమీ తెలియనట్టే ఉంది. అది దీప అమాయకత్వమో చేతగానితనమో కాదు సౌందర్య. అలా ఉండాలంటే గొప్ప మనసు ఉండాలి అంటాడు ఆనంద రావు.
మరోవైపు పిల్లలను తీసుకొని గుడికి బయలుదేరుతుంది దీప. మనం కలిసి బయటికి రావడం చాలా రోజులు అయింది కదా అంటే.. అవును అత్తమ్మ.. నేను బయటికి వెళ్లిపోయే టైమ్ కూడా వచ్చింది అని మనసులో అనుకుంటుంది దీప. మాకు ఆకలిగా ఉంది అంటే.. ఏదైనా మంచి హోటల్ కు తీసుకెళ్లు అని వారణాసితో అంటుంది దీప.
కార్తీక్ కు టెన్షన్ ఎక్కువవుతుంది. నాకు టెన్షన్ గా ఉంది. దీప ఏదో పెద్ద నిర్ణయమే తీసుకుంది. దీప ఆలోచనలను మనం అందుకోలేకపోతున్నాం. ఇది మాత్రం కన్ఫమ్. దీప మనకు షాక్ ఇవ్వబోతోంది. లేదు మమ్మీ.. ఏదో జరగబోతోందని నా మనసు చెబుతోంది. ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. మమ్మీ ప్లీజ్.. ఏదో ఒకటి చేయ్.. అంటాడు కార్తీక్.
ఇంతలో పిల్లలు షాపింగ్ నుంచి తిరిగి వస్తారు. మీ అమ్మేది అని అడుగుతుంది సౌందర్య. అమ్మ రాలేదు కదా అంటుంది శౌర్య. అందరూ కలిసే వెళ్లారు కదా అంటే.. అమ్మ వెళ్లిపోయింది నానమ్మ అంటుంది రౌడీ. వెళ్లిపోవడం ఏంటి.. అంటే అమ్మ.. అమ్మమ్మ, తాతయ్య వాళ్ల దగ్గరికి వెళ్తాను అంది అంటుంది.
అదేంటి.. అక్కడికి వెళ్లడం ఏంటి అంటుంది సౌందర్య. ఏమో నాతో అమ్మ ఎక్కువగా మాట్లాడలేదు. మమ్మల్ని వెళ్లమంది. తను.. అక్కడికి వెళ్తానంది. రేపు పొద్దున మిమ్మల్ని ఎక్కడికో రమ్మన్నదట కదా. అక్కడే మిమ్మల్ని కలుస్తా అన్నది అని చెబుతుంది శౌర్య.
ఇంటికి రాకుండా అక్కడికి వెళ్లడం ఏంటి.. అసలు దీపకు ఏమైంది అని అంటుంది సౌందర్య. దీపకు ఫోన్ చేయ్ కార్తీక్ అంటుంది సౌందర్య. దీప ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో కార్తీక్ కు టెన్షన్ ఎక్కువవుతుంది. దీప తన పుట్టింటికి వెళ్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెడుతుంది అంటాడు ఆనంద రావు. అంటే.. దీప అక్కడికి వెళ్లలేదా అంటాడు ఆనంద రావు.
కట్ చేస్తే.. మోనిత ఇంట్లో బారసాల ఫంక్షన్ కు ఆనంద రావు, సౌందర్య, కార్తీక్ వెళ్తారు. దీప కూడా అక్కడే ఉంటుంది. దీపక్క వంటలు అవుతున్నాయా అంటుంది మోనిత. వంటల గురించి నువ్వు అస్సలు టెన్షన్ పడకు అంటుంది దీప. ఇంతలో కార్తీక్ చూసి.. దీప నీకు ఇక్కడేం పని అంటాడు కార్తీక్.
నీకు ఇక్కడేం పని. ఎందుకు వచ్చావు. నువ్వు వంటలు చేయడం ఏంటి దీప అంటాడు కార్తీక్. ముందు బారసాల అయితే కానివ్వండి అంటుంది దీప. దీపక్క ఈరోజు ఏదో క్లయిమాక్స్ ప్లాన్ చేసింది. ఏం చేస్తుంది అని అనుకుంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.