
karthika deepam 21 october 2021 full episode
Karthika Deepam 21 Oct Thursady Episode : స్టార్ మా ప్రేక్షకులను ఎంతో అట్ట్రాక్ట్ చేసిన కార్తీక దీపం సీరియల్ ఈ రోజు (అక్టోబర్ 21, 2021) 1177 ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. ఈ ఎపిసోడ్‌లోని కొన్ని హైలెట్స్ సీరియల్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి. వారణాసికి మంచిచెడ్డలు చెప్పిన దీప.. వెళ్లొస్తానని అంటుంది. అదే టైంలో ఆటో వెనుక ఉన్న ‘అమ్మ త్వరగా రా’ అని రాసి ఉండటాన్ని చూసిన దీప.. ‘ఇంకెందుకురా దాన్ని తీసెయ్యు అని చెబుతుంది. దానికి వారణాసి రెస్‌పాండ్ అవుతూ ‘ఉండనివ్వు అక్కా.. దీనిని నీ జ్ఞాపకంగా ఉంచుకుంటా’ అని చెబుతాడు. అందరూ చేతికి పచ్చబొట్టు వేసుకుంటే నేను నా ఆటోకి వేసుకున్నాను అనుకుంటానంటూ వారణాసి చెప్పిన మాటలకు దీప కాస్త ఎమోషనల్ అవుతుంది. తర్వాత ‘జాగ్రత్తరా’ అంటూ వారణాసికి చెప్పి ఇంట్లోకి వెళ్తుంది దీప..
karthika deepam 21 october 2021 full episode
హాస్పిటల్ తాళాలు ఇచ్చేందుకు కారులో బయలు దేరిన కార్తీక్.. తన గతాన్ని గుర్తుచేసుకుంటాడు. ‘నా జీవితం ఎక్కడ మైదలైంది.. ఎటు వెళుతున్నది.. దేవడు సాడిస్టు అయి ఉంటాడు. హాయిగా సాగిపోతున్న నా జీవితంలో అనుమానం అనే తుఫాన్‌ను రేపాడు అంటూ దీప పట్ల కాస్త జాలి చూపిస్తూ ఫీల్ అవుతాడు. అంతా బాగుంది అనుకునేలోపే మోనిత రూపంలో ఓ ప్రళయం ముంచుకొచ్చిందని ఫీల్ అవుతాడు. తప్పు చేయకున్నా తప్పని పరిస్థితుల్లో అమెరికా వెళ్లక తప్పడం లేదని అనుకుంటూ అక్కడికి వెళ్లాక దీప, నేను, శౌర్య, హిమ హ్యాపీగా ఉండాలని అనుకుంటాడు.
తర్వాత సీన్‌లో ఆనందరావు, దీప, శ్రావ్య, ఆదిత్య టేబుల్‌పై ఉన్న పేపర్‌లో మోనిక విడుదలైందన్న వార్తను చూసి షాక్‌కు గురవుతారు. అంతలోనే సౌందర్య కిందికి వచ్చి పేపర్ తీసుకుని చూస్తుంది. ‘ వింత ప్రేమికులరాలు మోనిత జైలు నుంచి విడుదలైందని, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్‌తో ప్రెగ్నెంట్ అయిన ఆమె.. కార్తీక్ ను పెండ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి నేరాలు చేసి శిక్ష అనుభవించిన మోనితకు కొన్ని రిస్ట్రిక్షన్స్‌తో కోర్టు బెయిల్ ఇచ్చింది. మోనిత బయటకు వచ్చాక ఎం చేస్తుందో చూడాలి’ అంటూ పేపర్ లో రాసి ఉండటంతో దానికి చూసి సౌందర్య సైతం షాక్‌కు గురువుతుంది.
karthika deepam 21 october 2021 full episode
దీంతో ఏంటి అత్తయ్య ఇది బయటకు ఎలా వచ్చింది. మేము అమెరికా వెళ్లిన తర్వాత వచ్చినా బాగుండేది.. ఇప్పుడే రావాలా అని అంటుంది దీప.. దీంతో టెన్షన్ పడకు, బాధపడకు అంటూ సౌందర్యతో అందరూ ధైర్యాన్నిస్తారు. ఈ పేపర్ ను పిల్లలు చూడకుండా చించేద్దాం అంటూ శ్రావ్య పేపర్ దాచిపెడుతుంది. శ్రావ్య చేతిలోని పేపర్ ను దీప తీసుకుని.. మౌనిత ఆంటి విడుదలవుతున్నదని డైరెక్ట్ గా పిల్లలకు చూపిస్తుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్క సారిగా షాకవుతారు. తర్వాత పేపర్ ను తీసుకుని హిమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
డాక్టర్ రవి ఇంటికి వెళ్లిన కార్తీక్‌కు అక్కడ కనిపిస్తుంది. కార్తీక్ ను ఇంట్లోకి వెళ్లకుండా పోలీస్ అడ్డుకోవడంతో.. రవి ఇంట్లో పని చేసేవాడు బయటకొచ్చి ఆయన తన సార్ ఫ్రెండేనని చెప్పి కార్తీక్ ను లోపలికి తీసుకెళ్తాడు. ఇంతలో రవి, భారతి గొడవ పడుతుంటారు. ఈ సమయంలో వారి ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అక్కడే మోనిత తన కడుపును చూస్తూ సంతోష పడుతుంది. భారతి ఫేస్ లో టెన్షన్ ను గమనించిన మౌనిత.. నేనంటే నీకు ప్రేమలేదా? అంటూ ఎమోషనల్ ఫీలింగ్స్‌ను తెప్పిస్తుంది. కార్తీక్ కూర్చున్న టెబుల్ వద్ద మోనిత వార్త ఉన్న పేపర్ ఉంటుంది. తర్వాత రవి రావడంతో టేబుల్‌పై ఉన్న ఫ్లవర్ వాజ్‌కి కాలు తగిలి, కిందకు పడుతున్న సమయంలో కార్తీక్ దాన్ని పట్టుకోబోతూ పేపర్‌లో మోనిత న్యూస్ చూసి షాక్ అవుతాడు. అక్కడి నుంచి సీరియల్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కనిపిస్తాయి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.