Karthika Deepam 23 Feb Today Episode : ఆనంద్ మోనిత కొడుకు అని తెలుసుకొని సౌందర్య షాకింగ్ నిర్ణయం.. ఇంతలో కార్తీక్, దీపకు మరో షాక్

Karthika Deepam 23 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 1283 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పారావు.. సౌందర్య ఇంటికి వెళ్తాడు. దీంతో సౌందర్య.. అతడికి ఉపాధి చూస్తానని చెబుతుంది. ఎవ్వరూ కనిపించడం లేదు ఏంటి మేడమ్ అంటాడు. దీంతో కార్తీక్, దీప ఇద్దరూ బయటికి వెళ్లారు అంటుంది మేడమ్. ఇంతలో పిల్లల టీసీలు, ఫోటోలు తీసి టేబుల్ పైన పెడతాడు. ఫోటోలలో ఉన్న కోటేశ్ ఫోటోను చూసి షాక్ అవుతుంది సౌందర్య. ఈ ఫోటో ఎవరిది అని అడుగుతుంది సౌందర్య. దీంతో అక్క బావ ఉన్నది వీళ్ల ఇంట్లోనే మేడమ్. వాళ్ల బాబునే కదా తీసుకొచ్చింది అంటాడు అప్పారావు. దీంతో వెంటనే తన ఫోన్ లో కోటేశ్ మోనిత కొడుకును ఎత్తుకెళ్లిన వీడియోను చూసి షాక్ అవుతుంది. అంటే.. ఆనంద్ మోనిత కొడుకా. ఈశ్వరా ఏంటి ఈ లీల. ఏం చేయాలని అనుకుంటున్నావయ్యా మమ్మల్ని అని అనుకుంటుంది సౌందర్య.

karthika deepam 23 february 2022 full episode

మరోవైపు తన బాబు గురించే ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. తాళిని తెంపేసినా కూడా నవ్వుకుంటుంది మోనిత. ఆనంద రావు గారు మీ నాన్న గారు నన్ను కొట్టారు. పర్లేదు. నన్ను కొట్టే హక్కు కార్తీక్ కు ఉంది. ఆనంద రావు గారు మీరు అమ్మను వదిలేసి ఎక్కడికో వెళ్లారు అని నేను బాధపడ్డాను. కానీ.. మీరు నాన్న దగ్గర ఉన్నారా.. సూపర్ ఆనంద్ గారు అంటుంది మోనిత. మీరు నాన్న దగ్గర హాయిగా ఉన్నారన్నమాట. సూపర్ ఆనందరావు గారు. కొన్నాళ్లు అక్కడే ఉండు. నిన్ను వెతకమని మీ నాన్నకు చెప్పాను. కానీ నువ్వు దొరకవంట. కొన్నాళ్లను నిన్ను వదులుకోలేరు. అప్పుడు నేను వస్తాను. నువ్వు నా ఆనంద రావు అని తెలిసి అంతా షాక్ అవుతారు. ఆపరేషన్.. బ్లడ్ రిలేషన్ డ్రామా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.. అని అనుకుంటుంది మోనిత.

మరోవైపు ఆనంద్ తో ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. సౌందర్య దగ్గరికి వెళ్లి ఆనంద్ ను తీసుకెళ్లి నానమ్మ అని పిలువు అంటారు పిల్లలు. దీంతో సౌందర్యకు మోనితే గుర్తొస్తుంది. ఈశ్వరా ఏంటి ఈ పరీక్ష అని అనుకుంటుంది. ఇంతలో నానమ్మ తమ్ముడిని ఎత్తుకోవా.. వీడికి పాలు తీసుకొస్తాం అంటారు పిల్లలు. దీంతో ఆనంద్ ను ఎత్తుకుంటుంది సౌందర్య.

ఇంతలో రత్నసీతకు ఫోన్ చేస్తుంది సౌందర్య. అసలు విషయం మొత్తం చెబుతుంది. మోనిత బిడ్డను ఎవరు ఎత్తుకెళ్లారో చెబుతుంది. ఇంకా ఏదో చెబుతుంది. దీంతో సరే అని ఫోన్ కట్ చేస్తుంది రత్నసీత. మరోవైపు ఏంటి డాక్టర్ బాబు.. ఇంకా మోనితను నమ్ముతున్నారా అని అడుగుతుంది దీప.

Karthika Deepam 23 Feb Today Episode : మోనితను అస్సలు నమ్మొద్దు డాక్టర్ బాబు అని చెప్పిన దీప

దీప.. నాకు వేరే దారి లేదు. మనం నడి సముద్రంలో చిక్కుకుపోయాం. వేరే ఆప్షన్స్ లేవు. మనం ఎంచుకోవడానికి చాలా దారులు లేవు. మోనిత తనంతట తానే ఒక అవకాశం ఇచ్చింది. దీన్ని మనం ఉపయోగించుకుందాం అంటున్నాను అంటాడు కార్తీక్.

డాక్టర్ బాబు.. మోనిత నిలువెల్లా విషం నింపుకున్న మనిషి. ఇన్నాళ్లూ మనల్ని చిత్రహింసలు పెట్టింది. ఇంకా ఆ రాక్షసి చెప్పే మాటలు ఎలా నమ్ముతున్నారండి అంటుంది దీప. నువ్వు భయపడటంలో అర్థం ఉంది కానీ.. నాకు నీకన్నా ఎక్కువ కోపం ఉంది.. అంటాడు కార్తీక్.

మోనితను చంపి జైలుకు వెళ్లాలన్నంత కోపం, కసి ఉన్నాయి అంటాడు కార్తీక్. కానీ.. నేను ఒక కొడుకును, భర్తను, తండ్రిని కాబట్టి ఆ పని చేయలేకపోతున్నాను అంటాడు కార్తీక్. ఎలాగైనా తన కొడుకును వెతికి పట్టుకొని తనకు అప్పగిస్తాను.. అంటాడు కార్తీక్.

ఇంటికి వస్తారు కార్తీక్, దీప. రాగానే ఆనంద్ ను ఎత్తుకుంటాడు. ఏరా.. నీ దగ్గర ఏం మహిమ ఉందిరా. నిన్ను ఎత్తుకోగానే టెన్షన్స్ అన్నీ పోతున్నాయి. మా అందరికీ సంతోషాన్ని ఇవ్వడానికే మా ఇంటికి వచ్చావా అని ఆనంద్ తో అంటాడు కార్తీక్.

ఏమైంది దీప. వాడు ఎందుకు అలా ఉన్నాడు అని అడుగుతుంది సౌందర్య. దీంతో హాస్పిటల్ లో మోనితతో జరిగిన గొడవ గురించి చెబుతుంది దీప. ఈ విషయం తెలిసి షాక్ అవుతుంది సౌందర్య. ఇంట్లో ఉన్న బిడ్డ కోసం బయట ఎక్కడ వెతుకుతావురా పెద్దోడా అని మనసులో అనుకుంటుంది సౌందర్య.

ఆనంద్ తో ఎక్కడ లేని అనుబంధం పెంచుకున్నారు అని సౌందర్య.. ఆనంద రావుతో అంటుంది. దాంట్లో తప్పేముంది సౌందర్య అంటాడు ఆనంద రావు. అయితే.. ఏంటి అలా ఉన్నావు అని అడుగుతాడు ఆనంద రావు. దీంతో అదేం లేదండి అంటుంది సౌందర్య.

ఆ ఆనంద్ ఎవరో కాదు.. మోనిత బిడ్డ అని చెప్పి ఆనంద్ రావు కు షాక్ ఇస్తుంది సౌందర్య. ఏంటి సౌందర్య ఇది.. మోనిత బిడ్డను మన ఇంట్లో పెట్టుకున్నామా.. టెన్షన్ పడకపోవడం ఏంటి సౌందర్య. మోనిత ఎప్పుడైతే బిడ్డను కన్నదో అప్పటి నుంచి మనకు కష్టాలు మొదలయ్యాయి.. అంటాడు ఆనంద రావు.

మరోవైపు సౌందర్య దగ్గరికి వెళ్లిన కార్తీక్.. మోనిత బిడ్డ తప్పిపోయినప్పటి సీసీటీవీ ఫుటేజ్ నీ దగ్గర ఉందట కదా. తన బాబును వెతికి ఇస్తా అని మోనితకు మాటిచ్చాను.. అంటాడు కార్తీక్. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. ఆ తర్వాత తన బిడ్డను చూసేందుకు మోనిత.. సౌందర్య ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

2 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

5 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

7 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

10 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

12 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago