Karthika Deepam 23 March Today Episode : ప్రేమ్ తో గొడవ పెట్టుకున్న శౌర్య.. శౌర్యను కలిసిన హిమ.. కానీ తనే శౌర్య అని తెలుసుకోలేకపోయింది.. ఇంతలో మరో ట్విస్ట్

Authored By Varun G | The Telugu News | Published on: March 23, 2022, 10:30 am

Karthika Deepam 23 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎక్కడో పని కావాలని చెప్పి జైలర్.. వాళ్ల నెంబర్ ను జ్వాలకు ఇస్తాడు. ఆ తర్వాత తన ఆటో మీద ఉన్న వొదిలేదేలే.. అని ఉంది ఏంటి.. కొత్త సినిమా పేరా అని అడుగుతాడు. దీంతో అదేం లేదు సార్.. ఎవరైనా తప్పు చేస్తే వదిలేది లేదు అని చెప్పేందుకు అలా రాశాను సార్ అంటుంది జ్వాల. మరోవైపు ఆసుపత్రిలో అందరికీ స్వీట్లు ఇస్తుంది హిమ. అందరూ తనకు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతారు. ఇంతలో ఎవరో శౌర్య పేరు పలుకుతారు. దీంతో సంతోషంతో ఎవరు అని వెళ్లి చూస్తుంది. శౌర్య హాస్పిటల్ కు వచ్చిందా అని అనుకుంటుంది. నా బర్త్ డే రోజు శౌర్య కనిపిస్తుందా అని అనుకుంటుంది.

karthika deepam 23 march 2022 full episode

karthika deepam 23 march 2022 full episode

శౌర్య ఆటోలో వెళ్లడం చూసి శౌర్య మీకు తెలుసా అని సుజాతను అడుగుతుంది. మన మెడికల్ షాపు అతడి ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ అమ్మాయి వాళ్ల బంధువు అంట అని చెబుతుంది. దీంతో వెంటనే అడ్రస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. మరోవైపు ఆటోలో వెళ్తుంటుంది శౌర్య. ఆటోలో వెళ్తూ తన తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ హిమను వదిలిపెట్టను అని అనుకుంటుంది. అమ్మా.. నేను బస్తీలో ఎన్నో కష్టాలు పడ్డాం. నాన్న కోసం ఎదురు చూశాం. నాన్న కలిసినా ఆ ఆనందం ఎక్కువ రోజులు లేకుండా చేసింది ఆ హిమ. మొదటి నుంచి తను నాన్న దగ్గరే ఉంది. తాత దగ్గరే పెరిగింది. నేను అందరికీ దూరం అయ్యాను అనుకుంటుంది శౌర్య.

వాళ్లు కూడా కనీసం నాకోసం వెతికే ప్రయత్నాలు కూడా చేయలేదు. నన్ను అందరి ప్రేమకు దూరం చేశారు. ఆ హిమ మాత్రం అందరితో కలిసి ఉంటోంది. ఎన్ని సంవత్సరాలు అయినా హిమ మీద కోపం తగ్గదు. రోజురోజుకూ పెరుగుతుంది.. ఒసేయ్ హిమ ఎక్కడున్నావే అని అనుకుంటుంది శౌర్య.

మరోవైపు శైర్య కనిపించబోతుందని ఎంతో సంతోషంగా కారులో వెళ్తుంటుంది హిమ. శౌర్య అనవసరంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని బాధపడుతుంది హిమ. ఎన్ని సంవత్సరాలకు నువ్వు కనిపించినా నీ మీద నాకు కోపం అస్సలు తగ్గదు అని అనుకుంటుంది శౌర్య.

ఇంతలో హిమ కారు ఆగిపోతుంది. కారు స్టార్ట్ కాదు. దీంతో ఏం చేయాలో హిమకు అర్థం కాదు. దీంతో కారు దిగుతుంది. ఇంతలో శౌర్య ఆటో వస్తుంది. ఆటో ఆపి.. హిమ దగ్గరికి వస్తుంది. రోడ్డు మీద కారు ఆపావేంటి.. రోడ్డు ఏమన్నా నీ తాతది అనుకుంటున్నావా అంటుంది శౌర్య.

Karthika Deepam 23 March Today Episode : శౌర్య కోసం టెన్షన్ గా కారులో వెళ్లిన హిమకు షాక్

కారు రిపేర్ అంటుంది. దీంతో కారు కొనగానే సరిపోదు.. కొంచెం దాని గురించి తెలుసుకోవాలి అంటుంది శౌర్య. పక్కకు జరుగు నేను చూస్తాను అంటుంది. కారు రిపేర్ చేస్తుంది. కారు బ్యానెట్ ను సెట్ చేసే సమయంలో.. లోపల ఉన్న కార్తీక్, దీప ఫోటో కింద పడుతుంది.

కారులోపలికి వెళ్లి కారు స్టార్ట్ చేస్తుంది శౌర్య. కారు స్టార్ట్ అయిందని చెబుతుంది. దీంతో హిమ వెళ్లిపోతుంది. వెంటనే సుజాత చెప్పిన అడ్రస్ దగ్గరికి వస్తుంది హిమ. డోర్ కొట్టి లోపలికి వెళ్తుంది. శౌర్య ఉందా అని అడుగుతుంది. అక్కడ శౌర్యను చూసి షాక్ అవుతుంది. తను చిన్న పిల్ల. తను నా శౌర్య కాదు అని అనుకొని చాలా డిసప్పాయింట్ అవుతుంది హిమ.

మరోవైపు శౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మ.. ముగ్గురు షాపింగ్ కు వెళ్తారు. మరోవైపు శౌర్య ఆటో రోడ్డుకు అడ్డంగా పెట్టిందని.. ప్రేమ్ తనతో గొడవపెట్టుకుంటాడు. ఆటో అడ్డంగా పెట్టి అడ్డంగా వాదిస్తుంది ఈవిడ అని అంటాడు ప్రేమ్. మరోవైపు స్వప్న ఇంటికి వెళ్తుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp