
Karthika Deepam 23 september 2022 full episode
Karthika Deepam 23 Sep Today Episode : కార్తీక దీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1465 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప ఇంట్లో వస్తువులన్నిటిని చల్లా చెదురు చేసి ఏడుస్తూ డాక్టర్ అన్నయ్యకి జరిగిందంతా చెబుతూ ఉంటుంది. అప్పుడు దీప ను చూస్తూ బాధపడుతూ మోనిత జుట్టు పట్టి ఈడ్చుకొని బయటికి నెట్టేసి నీ డాక్టర్ బాబుని తీసుకుని రాపో ఎవరు అడ్డం వస్తారో చూస్తా అని అంటూ ఉంటారు. అప్పుడు దీప ఏడుస్తూ ఎవరైనా అడ్డం వస్తే నేను ఊరుకుంటానా అన్నయ్య కానీ నా డాక్టర్ బాబే వస్తాడు. అది ఏది చెప్తే అది నమ్మే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాడు డాక్టర్ బాబు అని అంటుంది. అప్పుడు డాక్టర్ ఇప్పుడు మన చేతిలో ఉంది ఒకటే అస్త్రం నువ్వు డాక్టర్ బాబుని ఆసుపత్రికి తీసుకొని రావడమే.. తీసుకొస్తే నేను చూసుకుంటాను. అప్పుడు ఆ మౌనిత ఆటలు కట్టెయ్యొచ్చు అని అంటాడు. అప్పుడు దీప సరే అన్నయ్య నేను తీసుకొస్తాను. కానీ ఈలోపులో అది నా మీద ఇంకా ఏమైనా చాడీలు చెప్తుందేమో నేను వెళ్తాను అన్నయ్య అని అక్కడినుంచి వెళ్తుంది. కట్ చేస్తే మౌనిత, సౌందర్య వాళ్ళ గురించి కంగారు పడుతూ ఉండగా..
అంతలో సౌందర్య ఆనందరావు అక్కడికి వస్తారు వాళ్ళని చూసి కంగారుపడుతూ శివని పిలిచి కార్తీక్ ని నేను చెప్పేంతవరకు బయటికి తీసుకురాకు అని చెప్తుంది. అప్పుడు శివ కార్తీక్ ని తీసుకొని వెళ్తాడు. అంతలో సౌందర్య వాళ్లు వచ్చి అంతా చూస్తూ ఉండగా.. మౌనిత కంగారుపడుతూ ఆంటీ ఎలా ఉన్నారు.. బాగున్నారా.. అని అంతా చెబుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మళ్ళీ ఫోన్ కోసం హాల్లోకి వచ్చి వెతుకుతూ వాళ్ళని చూసి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తూ.. మాట్లాడాలని వెళుతూ ఉండగా.. శివ వద్దు సార్ అక్కడికి వెళ్లొద్దు అని తనని తీసుకొని బయటికి వెళ్తాడు. దీప కూడా అక్కడికి వచ్చి నిలబడి చూస్తూ కస్టమర్లతో మాట్లాడుతుంది. అనుకుంటూ కార్తీక్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఆనందరావు దీపని కిటికీలో నుంచి చూసి దీప ని చూశాను అని చెప్తూ ఉండగా.. మౌనిత కంగారుపడుతూ అంకుల్ ఆగండి. నాకు కూడా అదే విధంగా అనిపిస్తూ ఉంటుంది. కార్తీక్ వచ్చినట్లుగా తను షాపులోకి వచ్చినట్టుగా నన్ను పిలిచినట్లు అనిపిస్తూ ఉంటుంది. అంతమాత్రాన వాళ్ళు బ్రతికి వస్తారా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య తనకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇదంతా బ్రమేనా లేదా నువ్వు ఏమైనా మాయ చేస్తున్నావా అని అంటుండగా…
Karthika Deepam 23 september 2022 full episode
ఎందుకు ఆంటీ నామీద అంత అనుమానం నేనేదో కార్తీక్ జ్ఞాపకాల కోసం ఇక్కడ బ్రతుకుతున్నాను అని అంటుండగా.. సౌందర్య మరి కార్తీక్ అని ఫోన్ లో ఎందుకు అన్నావు అని అనగానే.. మౌనిత రండి ఆంటీ కార్తీక్ ని చూపిస్తాను. అని ఆనంద్ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తుంది. ఇక ఆనందిని చూసి వాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ ఉండగా.. మౌనిత ఆంటీ నాపై అనుమానం పోయిందా అని అనగానే.. సౌందర్యం నీ మీద అనుమానం ఏనాటికి పోదు అని వెళ్ళిపోతారు. అప్పుడు కార్తీక్ వాళ్ళని కలవాలని వస్తూ ఉండగా.. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కార్తీక్ వాళ్ళ దగ్గర మౌనిత దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరు మౌనిత నాకు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. అని అంటుండగా… వాళ్ళు కస్టమర్లు కార్తీక్ అని అనగానే కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక దీప మౌనిత కొద్దిసేపు ఘర్షణ పడతారు. దీప మౌనిత గొంతు పట్టుకొని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మౌనిత నువ్వు నన్ను నా కార్తీక్ నేమీ చేయలేవు అని అంటుంది. అప్పుడు దీప ఆగు నీ ఆటలు కట్టే సమయం ఆరంభమైంది. నీ పని పడతా అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక మౌనిత అమ్మయ్య పెద్ద గండం నుంచి తప్పించుకున్న అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే…
Anil Ravipudi Next Film : టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం…
Sri Malika : పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో , ఉపాసనాంశాలతో , మహిమాన్విత…
Panchayat elections : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మొనారి రాధమ్మ (61) ఇటీవల తన…
Tea habit చలికాలం వచ్చిందంటే చాలు..ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకూ టీ కప్పు చేతిలో ఉండాల్సిందే అనిపిస్తుంది చాలామందికి.…
Gautham Ghattamaneni: టాలీవుడ్ ఎప్పటికప్పుడు మార్పులను స్వీకరిస్తూ కొత్త తరాన్ని ఆహ్వానిస్తోంది. కొత్త హీరోలు, హీరోయిన్లు నిరంతరం వెండితెరపైకి వస్తున్నప్పటికీ…
Aadhaar Card New Rule: భారతదేశంలో ప్రతి పౌరుడి గుర్తింపుకు ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. బ్యాంక్…
TG Govt Jobs 2026 : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్…
This website uses cookies.