Karthika Deepam 24 Dec Today Episode : కార్తీక్, దీపకు మరోసారి భారీ షాక్ ఇచ్చిన రుద్రాణి.. రత్నసీతను కలిసి మోనిత కొడుకు గురించి ఆరా తీసిన సౌందర్య

Karthika Deepam 24 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 డిసెంబర్ 2021, శుక్రవారం 1231 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా రూమ్ లోనే బెడ్ కింద దీపూగాడిని దాచాను. వెళ్లి తీసుకోపో అంటుంది మోనిత. దీంతో శ్రావ్య వెంటనే మోనిత రూమ్ కు వెళ్తుంది. ఆ తర్వాత చూశారా అత్తయ్య.. దీపూగాడు ఒక్క పది నిమిషాలు కనిపించకపోతే మీరు అల్లాడిపోయారు. దీపూ మీ మనవడు కదా. మరి.. నా కొడుకు కూడా మనవడే కదా. నా కొడుకు తప్పిపోయాడు అంటే మీలో ఎందుకు బాధ లేదు. ఇప్పుడు దీపూగాడు కనిపించకపోయేసరికి.. శ్రావ్య ఎంత బాధపడిందో.. అంతకు పది రెట్లు నేను కూడా బాధపడ్డాను అంటుంది మోనిత. దీంతో సౌందర్య ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement
karthika deepam 24 december 2021 full episode
karthika deepam 24 december 2021 full episode

కట్ చేస్తే.. శౌర్య, హిమ ఇద్దరూ స్కూల్ కు వెళ్లేందుకు రెడీ అవుతారు. ఇంతలో కార్తీక్ వస్తాడు. స్కూల్ లో ఎవ్వరూ డాడీ డాక్టర్ అనే విషయం చెప్పొద్దు అని దీప పిల్లలకు చెబుతుంది. సరే అంటారు పిల్లలు. ఆ తర్వాత తన జేబులో ఉన్న 10 రూపాయలు తీసి ఇస్తాడు కార్తీక్. ఏదైనా కొనుక్కోండి అంటాడు. ముందు వద్దు అంటారు పిల్లలు. కానీ.. తర్వాత దీప తీసుకోమని చెప్పేసరికి తీసుకొని స్కూల్ కు వెళ్తారు. మరోవైపు సౌందర్య, ఆనందరావు, ఆదిత్య.. ముగ్గురూ కూర్చొని అన్నం తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన మోనిత.. ఏంటి ఇవాళ వంటలు అని చూసి తినడం కోసం వాళ్ల ముందు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది. శ్రావ్య నాకు కూడా వడ్డించు అంటుంది మోనిత. దీంతో ఛీ.. ఛీ అంటూ తినకుండా లేస్తాడు ఆదిత్య.

దీంతో నువ్వెందుకు లేస్తున్నావురా. కూర్చో. తిను. సిగ్గు లేనిది దానికి. ఇది సౌందర్య ఇల్లు. అడ్డదారిలో నడిచేదానికి సిగ్గుండాలి.. అంటూ మోనితను ఇష్టం ఉన్నట్టు తిడుతుంది సౌందర్య. నాకు ఉన్నదే ఇద్దరు మనవరాళ్లు, ఒక మనవడు.. అంటూ అని గెట్ అవుట్ అంటుంది సౌందర్య.

మరోవైపు దీప సరుకుల కోసం కిరాణం షాపునకు వెళ్తుంది. ఈ సరుకులు ఇవ్వు అంటే ఈ సరుకులు లేవు అంటాడు షాపు అతడు. ఎందుకు అవన్నీ కనిపిస్తున్నాయి కదా అంటే.. లేదు ఆ సరుకులు లేవు. నాకు రుద్రాణే కనిపిస్తుంది అంటాడు. దీంతో నేను కోటేశ్, శ్రీవల్లి సరుకులు తీసుకెళ్లడానికి వచ్చాను అంటుంది దీప.

ఆ కోటేశే నాకు చాలా బాకీ ఉన్నాడు. ముందు బాకీ తీర్చమనండి అంటాడు కిరాణ కొట్టు అతడు. దీంతో కోటేశ్ నీకు ఇవ్వమని డబ్బులు ఇచ్చాడు.. అవి కూడా వద్దా అంటుంది దీప. ఇవ్వండి.. సరుకులు కూడా మీకు ఇవ్వను. కోటేశ్ కు ఇస్తున్నాను అంటాడు. సరుకులు తీసుకొని వెళ్తుంది దీప.

కట్ చేస్తే.. పిల్లలు స్కూల్ కు వెళ్తారు. అక్కడ లంచ్ టైమ్ అవుతుంది. స్కూల్ లోనే భోజనం పెడుతున్నారని తెలిసి అక్కడికి వెళ్తారు. కానీ.. అక్కడికి వెళ్లి తినాలంటే వాళ్లకు తినబుద్ధి కాదు. కానీ.. తప్పని పరిస్థితుల్లో ఇద్దరూ తింటారు. కార్తీక్, దీపను ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు.

Karthika Deepam 24 Dec Today Episode : రత్నసీతను కలిసి మోనిత గురించి కనుక్కున్న సౌందర్య

మరోవైపు రత్నసీతను సౌందర్య కలుస్తుంది. నువ్వు మోనిత వైపు ఎందుకు ఉన్నావో.. మోనిత మాటలు ఎందుకు విన్నావో తెలియదు కానీ.. మోనిత తన బిడ్డను నీ దగ్గర దాచిపెట్టిందా అని అడుగుతుంది. దీంతో లేదు మేడమ్.. నా దగ్గర తన బిడ్డ లేదు అంటుంది రత్నసీత.

అయితే ఒక పని చేస్తావా? నేను చెప్పిన ఒక్క పని నాకోసం చేస్తావా? అని అడుగుతుంది. దీంతో సరే మేడమ్ చేస్తాను అంటుంది. మోనిత ఎక్కడికి వెళ్తుందో.. ఎవరిని కలుస్తుందో నాకు చేసి పెట్టు.. అదొక్క సాయం నాకు చేయి. నేను నీకోసం ఏదైనా చేసి పెడతాను అంటుంది సౌందర్య.

మరోవైపు దీప.. సరుకులు తీసుకొని ఇంటికి మోసుకెళ్తూ ఉంటుంది. కార్తీక్.. తను సరుకులు మోసుకురావడం చూస్తాడు. దీప ఏంటిది.. నువ్వు ఇలా మోయడం ఏంటి.. అంటాడు. ఇటు ఇవ్వు అంటాడు కార్తీక్. ఇటు ఇవ్వు. ఇక్కడ కూర్చో. నీకెందుకు ఇంత శ్రమ అంటాడు కార్తీక్.

సారీ దీప. నిన్ను ఇలా కష్టపెడుతున్నాను అంటే.. వంటలక్కకు ఇవన్నీ కామనే కార్తీక్ బాబు అంటుంది దీప. మీరు నా పక్కన ఉంటే ఏదీ కష్టం కాదు అంటుంది దీప. నీ కష్టాలన్నింటికీ నేను బాధ్యుడిని అంటూ అక్కడ ఒక పెద్ద ఆకు ఉంటే.. దానితో దీపకు గాలి ఊపుతాడు కార్తీక్.

పిల్లలకు సరైన భోజనం పెట్టలేకపోతున్నాను అని బాధపడతాడు కార్తీక్. నిన్ను కష్టాల పాలు చేస్తున్నాను అంటాడు కార్తీక్. దీంతో ప్రతి స్త్రీకి భర్త తోడు ఉంటే చాలు కార్తీక్ బాబు అంటుంది. రేపు బాబుకు నామకరణం చేద్దాం అంటుంది శ్రీవల్లి. ఇంతకీ పేరు ఏం పెడదామని అనుకుంటున్నావు అని అంటుంది దీప. ఆనంద్ అని పెడదామని అనుకుంటున్నా అంటుంది శ్రీవల్లి.

ఆనంద్ ఎందుకు పెడదామని అనుకుంటున్నావు అంటే.. ఏమో తెలియదు కానీ.. కోటేశ్ బాబును దత్తత తీసుకున్నప్పటి నుంచి ఆనంద్ అనే పేరే పెడుదామని అనుకుంటున్నాడు అంటుంది శ్రీవల్లి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement