Karthika Deepam 24 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 1257 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనంద్ ను రుద్రాణి ఎత్తుకెళ్లడంతో దీప చాలా బాధపడుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎలాగైనా వడ్డీ కట్టి బాబును తీసుకురావాలని అనుకొని.. తన దగ్గర ఉన్న డబ్బును మొత్తం లెక్కిస్తుంది. కానీ.. ఆ డబ్బు సరిపోదు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు దీపకు. పసివాడు అని కూడా తీసుకెళ్లింది. ఎలాగైనా వడ్డీ డబ్బులు ఇచ్చి ఆనంద్ ను తెచ్చుకోవాలి అనుకుంటుంది. మూడు వేల చిల్లరే ఉన్నాయి. ఇంకో మూడు వేలు కావాలి. ఇంటి ఖర్చులు కలిపి నాలుగు వేలు కావాలని ఇంటి ఓనర్ ను అడుగుతాను. ఇస్తాడో ఇవ్వడో అనుకొని హోటల్ కు వెళ్తుంది దీప.
మరోవైపు రుద్రాణి.. తెగ నవ్వుకుంటూ ఉంటుంది. నేను ఎందుకు నవ్వుతున్నానో మీకు అర్థం కావడం లేదా అని అంటుంది తన మనుషులతో. నేను ఎందుకు నవ్వానంటే.. వాళ్లు అసలు కాదు కదా.. వడ్డీ డబ్బులే కట్టలేకపోతున్నారు. వీళ్లు వడ్డీ డబ్బులు తెచ్చి ఇస్తారా?.. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అంటుంది. ఇప్పుడు మన దగ్గర రంగరాజు ఉన్నాడు. కిందా మీదా పడి ఈనెల పడితే.. తరువాతి నెల సంగతి ఏంటి. ఇలా ప్రతి నెలా డబ్బుల కోసం తిరిగి తిరిగి వాళ్లకు విసుగు వచ్చి రంగరాజును మీరే తీసుకోండి అంటుంది దీప. రంగరాజును మీరే తీసుకొని నాకు అప్పజెప్పుతారు. నాకు వడ్డీ డబ్బులు వస్తాయి. రంగరాజు వస్తాడు. దీంతో నేను ఏం చేస్తాను. నాకు సంతోషం వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను నవ్వుతాను.. అందుకే నవ్వుతున్నా అంటుంది రుద్రాణి.
మరోవైపు దీప.. హోటల్ కు వస్తుంది. నాకు ఒక నాలుగువేలు అవసరం ఉన్నాయి. జీతంలో కట్ చేసుకోండి అంటుంది దీప. పనోళ్లు దొరకడం లేదు. ఈసమయంలో ఈమెను వదులకుంటే కష్టం అనుకొని.. వెంటనే నాలుగు వేలు తనకు ఇస్తాడు భద్రం.
సరే అమ్మా.. నువ్వు కాఫీ చేయడం అందరికీ నేర్పించావు కదా. చాలామంది నీ కాఫీ నచ్చిందని చెప్పారు అని చెబుతాడు భద్రం. ఇద్దరు పెద్దవాళ్లు వచ్చి కాఫీ తాగి చాలా బాగుంది అన్నారు. ఎవరు చేశారు అని అడిగారు కానీ.. నేను చెప్పలేదు అంటాడు భద్రం. అత్తయ్య మామయ్య వచ్చారేమో అని అనుకుంటుంది దీప.
మరోవైపు కార్తీక్ ఇంటికి వస్తాడు. అప్పుడే మహాలక్ష్మి వచ్చి రుద్రాణి మనుషులు వచ్చి ఆనంద్ ను ఎత్తుకెళ్లారు అని చెబుతుంది. దీంతో కార్తీక్ వెంటనే రుద్రాణి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. డబ్బులు తీసుకొని రుద్రాణి ఇంటికి బయలు దేరుతుంది దీప.
రుద్రాణి ఇంట్లో ఉన్న ఆనంద్.. గుక్కపెట్టి ఏడుస్తుంటాడు. అస్సలు ఊరుకోడు. ఇంతలో కార్తీక్ రుద్రాణి ఇంటికి వస్తాడు. అతడిని చూసి కుర్చీ తీసుకురా అంటుంది రుద్రాణి. కుర్చీలో కూర్చుంటుంది. రుద్రాణి అసలు నువ్వు మనిషివేనా అంటాడు కార్తీక్. ఏంటి సారు రాగానే తిట్లు మొదలు పెట్టారా అంటుంది రుద్రాణి.
ఇందుమూలంగా తెలియజేయునది ఏంటంటే.. ఒప్పుకున్న అప్పుకు గాను అసలు డబ్బులు చెల్లించడం లేదు. కనీసం వడ్డీ డబ్బులు అయినా చెల్లిస్తారని చూశాను. అదీ లేదు. ఆస్తి జప్తు చేయడానికి లేదు కాబట్టి రంగరాజును తీసుకొచ్చాను. వడ్డీ రూ.6400 చెల్లించి రంగరాజును విడిపించుకోగలరు. ఇది సారు.. నాకు ఓపిక చాలా తక్కువ.
దీపమ్మ వచ్చింది తిట్టింది.. వెళ్లింది. నువ్వు తిట్టడానికి వచ్చావు.. తిడతావు.. వెళ్తావు. నాకు డబ్బులు కావాలి సారు.. తిట్లు కాదు.. అంటుంది. ఇంతలో ఆనంద్ ఏడుస్తుంటాడు. ఆనంద్ అంటాడు కార్తీక్. దీంతో ఆనంద్ కాదు సారు.. రంగరాజు.. రాజా లాంటి పేరు అంటుంది రుద్రాణి.
బాబు ఏడుస్తుంటే పాలు తాగించవా.. అలాగే చూస్తూ ఉన్నావు ఏంటి అంటాడు కార్తీక్. దీంతో అరేయ్.. రంగరాజు ఏడుస్తున్నాడురా.. పాలు పట్టు అంటుంది రుద్రాణి. ఇంతలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. ఆనంద్ ఉండకపోయే సరికి.. ఆనంద్ ను తీసుకొని అమ్మ ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటారు పిల్లలు.
మరోవైపు వడ్డీ డబ్బులు తెచ్చి దీప రుద్రాణికి ఇస్తుంది. వెంటనే ఆనంద్ ను తీసుకొని వెళ్లబోతుంటే.. ఆగు దీప అంటుంది రుద్రాణి. ఇల్లు అలకగానే పండుగ కాదు. వడ్డీ డబ్బులు ఇవ్వగానే బాకీ తీర్చినట్టు కాదు. ఏదో కిందా మీదా పడి వడ్డీ డబ్బులు తెచ్చిచ్చావు సరే. వచ్చే నెలతో నీకు ఇచ్చిన డబ్బుల గడువు తీరిపోతుంది.. అంటుంది రుద్రాణి.
వచ్చే నెల మీరు అసలు మొత్తం కట్టకపోతే.. మీరు ఉంటున్న ఇల్లు ఉండదు.. రంగరాజును తీసుకోవడంతో పాటు.. ఇద్దరు పిల్లల్లో ఒకరిని తీసేసుకుంటాను అంటుంది రుద్రాణి. గడువు గుర్తుపెట్టుకో అని చెబుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి ఓనర్ భద్రంతో మాట్లాడుతాడు. సార్.. నాకు ఒక రూ.6000 అడ్వాన్స్ కావాలి సార్. చాలా అర్జెంట్ గా కావాలి సార్ అంటాడు.
ఉదయమే వంట మనిషి వచ్చి రూ.4000 కావాలని అడ్వాన్స్ తీసుకొని వెళ్లింది. ఇప్పుడు నువ్వొచ్చి అడుగుతున్నావు. నాకు అర్థం కాదు. మీరిద్దరూ కూడబలుక్కొని అడుగుతున్నారా అంటాడు. వంట మనిషి అడ్వాన్స్ అడిగిందా అని అనుకుంటాడు కార్తీక్.
నీ మొహం చూస్తే కాదనలేను. నిన్ను చూస్తే చాలా బాధ అనిపిస్తోంది అంటాడు భద్రం. దీంతో కార్తీక్ కు రూ.6000 ఇస్తాడు భద్రం. వాటిని తీసుకొని వెళ్తాడు కార్తీక్. ఇంతలో దీప బాబును తీసుకొని ఇంటికి వస్తుంది. ఎందుకో కార్తీక్ కు తను పనిచేసే హోటల్ లో వంట మనిషి దీపేనేమో అనిపిస్తుంది.
దీంతో డబ్బులు తీసుకొని రుద్రాణి ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. అక్కడ బాబు ఉండటంతో ఆ వంటమనిషి దీపే అని కార్తీక్ కు తెలిసిపోతుంది. దీంతో ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.