Home » Exclusive » Virat Kohli Daughter Face Revealed
Exclusive

Virat Kohli : విరాట్ కోహ్లీ కూతురు ఫేస్ క‌నిపిందోచ్..అభిమానుల్లో ఆనందం అంతా ఇంతా కాదు…!

Authored By
Sam C
The Telugu News | Updated on: January 24, 2022 9:59 am
Advertisement

Virat Kohli : విరాట్ కోహ్లీ- అనుష్క ముద్దుల కూతురు వామిక ఫేస్ చూడాల‌ని అభిమానులు ఎన్నాళ్ల నుండో ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. 2021, జనవరి 11న జన్మించిన వామికాని ఇప్పటి వరకూ ప్రపంచానికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చూపించలేదు. పాప ప్రైవసీని గౌరవించాలని కోరిన విరుష్క జోడీ.. దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లే ముందు కూడా విమానాశ్రయంలో తమ కూతురి ఫొటోల్ని తీయొద్దంటూ కోరారు. తీసిన వారిని కూడా ఫోటోలు డిలీట్ చేయ‌బ‌ని చెప్పాడు. ఇక ఈ ఏడాది జనవరి 11న వామిక పుట్టినరోజు వేడుకలు జరిగినా.. ఎక్కడా ఆ ఫొటోలు బ‌య‌ట‌కు రానివ్వ‌లేదు.

Advertisement

తొలిసారిగా కోహ్లి కూతురు కెమెరా కంటికి కనిపించింది. వామిక ఫస్ట్ ఫొటో వెలుగులోకి వచ్చింది. వామికకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కేప్‌టౌన్ వేదికగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అదే సమయంలో స్టేడియంలోని గ్యాలరీ‌లో అనుష్క శర్మ, వామిక ఉన్నారు. కోహ్లీ అర్ధశతకం అందుకోగానే భార్య, కూతురికి బ్యాట్ చూపాడు. గ్యాలరీ వెలుపలికి వచ్చిన అనుష్క శర్మ క్లాప్స్ కొడుతూ భర్తను కంగ్రాట్స్ చెప్పింది.

virat kohli daughter face revealed

Advertisement

Virat Kohli : కోహ్లీ కూతురు క‌నిపించిందోచ్..!

అనుష్క చేతిలో వామిక ఉండ‌గా, ఆమెకు మీ డాడీ అంటూ అనుష్క చూపిస్తుంది. అదే సమయంలో కెమెరా అటువైపు వెళ్లడంతో.. తొలిసారి వామిక కనిపించింది. అలా వామిక ఫస్ట్ ఫొటో వెలుగులోకి వచ్చింది. కోహ్లీ కూతురు వామిక ఎలా ఉంటుందో అభిమానులకు తెలిసిపోయింది. ఇక మరోసారి కోహ్లీ 71వ సెంచరీని చూడాలని అభిమానుల నిరీక్షణకు తెరపడలేదు. భారత మాజీ కెప్టెన్ కోహ్లి చక్కటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడని, రెండేళ్లకు పైగా నిరీక్షణకు తెరపడుతుందని అనిపించినా అది కుదరలేదు. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో కోహ్లీ 65 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ 51, 0, 65 పరుగులు చేశాడు. ఈ విధంగా 116 పరుగులతో శిఖర్ ధావన్ (169 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి