Karthika Deepam 24 september 2022 full episode
Karthika Deepam 24 Sep Today Episode : కార్తీక దీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1466 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ఆనంద్ రావు, సౌందర్యకు, మౌనిత గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. సౌందర్య ,ఆనంద్ రావుని మీకు ఒంట్లో మంచిగానే ఉందా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని ఎటకారం చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే శివ మోనిత దగ్గరికి వచ్చి మేడం పొద్దున వచ్చినవాళ్లు సార్ వాళ్ళ అమ్మానాన్నల అని అడుగుతాడు. అప్పుడు మౌనిత నీకెందుకురా ఎవరి అమ్మానాన్నలైతే మూసుకుని ఉండు అని అంటుంది. అంతలో కార్తీక్ వచ్చి అవును పొద్దున్న వచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతూ ఉండగా.. మౌనిత వాళ్లు శివ అమ్మా నాన్నలు అని అంటుంది. అప్పుడు ఒక్కసారిగా షాక్ కి గురవుతాడు. అప్పుడు కార్తీక్ మరి వాడిని కలవకుండా ఎందుకు పోయారు అని అడుగుతాడు. అప్పుడు మౌనిత వాడు చిన్నపిల్లల్లాగా ఇంటికి వస్తాను అని ఏడుస్తాడంట అందుకే వాళ్ళు ఇక్కడే ఉంచండి అని చెప్పి వెళ్లారు అని అంటుంది. అప్పుడు కార్తీక్ శివని తిట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక మౌనిత మాటలన్నీ వింటూ శివ తనపై అనుమాన పడుతూ ఉంటాడు. కట్ చేస్తే దీప డాక్టర్ తో కార్తీక్ గురించి చెప్తూ ఉండగా..
ఆ కాలనీ అసోసియేషన్ వాళ్లు వచ్చి దీపని మీరు వంటలు బాగా చేస్తారంట కదా.. మాకు ఒక ప్రోగ్రాం ఉంది. దానికి మీరు వంటలు చేయాలి రేపు రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే కార్తీక్ ఒక దగ్గర కూర్చుని దీప గురించి ఆలోచిస్తూ ఉండగా.. అంతలో మౌనిత అక్కడికి కాఫీ తీసుకొచ్చి కార్తీక్ ఇచ్చి ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్ అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ ఆ వంటలక్క చాలా డిస్టర్బ్ చేస్తుంది అని అంటాడు. అప్పుడు మౌనిత మనం దాని నుంచి తప్పించుకోవాలంటే ఇ ఊరు నుండి వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు కార్తీక్ మనమే తప్పు చేసాం.. మనం ఎందుకు వెళ్లిపోవాలి. మనం వెళ్ళిపోతే ఆమె అనుకున్నది నిజమని అందరూ అంటారు. కాబట్టి తననే ఇకనుంచి పంపించేయాలి అని అంటాడు. అప్పుడు మౌనిత అలా జరిగితే మన అదృష్టం అనుకోవాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌర్య హిమకిపులిహార తీసుకొచ్చి పెట్టి తినమని అడుగుతూ. నువ్వు ఇక్కడ ఉండలేవు నాలాగా నువ్వు ఉండలేవు.. నువ్వు చాలా సాఫ్ట్ నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. అప్పుడు హిమ నా మీద ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకు కోపం పడతావ్ అని అంటుంది. కట్ చేస్తే కార్తీక్ దీప దగ్గరికి వస్తూ ఉంటాడు. దీప ప్రోగ్రాం లో వంట చేయడానికి వెళుతూ ఉండగా..
Karthika Deepam 24 september 2022 full episode
కార్తీక్ అక్కడికి వెళ్లి ఆగండి మీరు తలుపు తీయండి నేను మీతో మాట్లాడాలి.. అని చెప్పి లోపలికి వెళ్లి మీరు ఈరోజు నుంచి నన్ను ఇబ్బంది పెట్టవద్దు నా భార్య మౌనిత నా కొడుకు ఆనంద్ నేను ఎదురింట్లో ఉంటున్నాం అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోను మీరు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇకనుంచి వెళ్లిపోండి మీకు ఏం కావాలి చెప్పండి అని అంటూ డబ్బులు ఇస్తాడు. అప్పుడు మౌనిత ఫోన్ చేసి ఎక్కడన్నావ్ కార్తీక్ అని అడగగా.. నేను ఇక్కడ వంటలక్క దగ్గర ఉన్నాను.. ఐదు నిమిషాల్లో వస్తానని చెప్తాడు. అప్పుడు మౌనిత కూడా అక్కడికి వచ్చి కార్తీక్ అనే మాటలను వింటూ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇకపై నువ్వు నాకు కనిపించదు అని అంటూ కార్తిక్ వెళుతూ ఉండగా… దీప ఆగండి అని అంటుంది. అప్పుడు ఆ డబ్బులు నీకే నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఇంకా కావాలంటే ఇస్తాను అని అంటుండగా దీప ఒక్కసారిగా ఇవి నా మొగుడు ఇచ్చిన డబ్బులు నాకు ఖర్చు పెట్టుకునే అధికారం ఉంటుంది. వీటితో నేను నీకు ఇష్టమైన చీరలు కొంటాను.. నీకు ఇష్టమైన నగలు కొనుక్కుంటాను. డాక్టర్ బాబు అని అంటుండగా.. కార్తీక్ ఒక్కసారిగా వంటలక్కని కొట్టబోతాడు. అప్పుడు మౌనిత వచ్చి అడ్డుపడి అక్కడ నుంచి తీసుకెళ్తుంది. కట్ చేస్తే సౌందర్య, హిమ, సౌర్యని నాలుగు పీకి తీసుకొస్తానని ఆనందరావుకి చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే దీప దేవుడికి పూజ చేస్తూ నేను ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నం ఫలించేలా చెయ్యి దేవుడా అని మొక్కుకుంటూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్ కి గతం గుర్తుకు రావడానికి దీప తన జీవిత చరిత్రను నాటకంగా వెయ్యాలి అనుకుంటుంది. ఆ విషయాన్ని కార్తీక్ చెప్పి ఆ నాటకాన్ని చూడమని అడుగుతుంది అప్పుడు సరే వస్తానులే అని కార్తీక్ చెప్తాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్లో చూడాలి..
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.