Home » Entertainment » Karthika Deepam 25 April 2022 Full Episode
Entertainment

Karthika Deepam 25 April Today Episode : హిమనే లవ్ చేస్తున్న నిరుపమ్.. ప్రేమ్, నిరుపమ్ లో హిమ ఎవరికి ఓకే చెబుతుంది.. స్వప్న వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: April 25, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 25 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 1335 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనసులో మాట చెప్పడం కొంచెం కష్టమైన పనే. లవ్ సింబల్ ఉన్న కాఫీని చేతుల్లో పట్టుకొని హిమ ఇది నా హర్ట్ అని చెబుతాను.. అని అనుకుంటాడు ప్రేమ్. మరోవైపు జ్వాల ఆటోలో అదే కాఫీ షాప్ నకు వస్తుంది. చేంజ్ కోసం కాఫీ షాప్ లోపలికి వస్తుంది. చేంజ్ తీసుకున్నాక.. ప్రేమ్, హిమను చూస్తుంది. అప్పుడే ప్రేమ్ హిమకు కాఫీ ఇవ్వబోగా.. వచ్చి జ్వాల లాక్కుంటుంది. తాగేస్తుంది. దీంతో ప్రేమ్ కు తెగ కోపం వస్తుంది. కాఫీ నిన్ను ఎవరు తీసుకోమన్నారు అంటూ ప్రేమ్ కోప్పడతాడు. ఏంటి తింగరి.. మరి నేను వెళ్తున్నాను.. కాఫీ చాలా బాగుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోతుంది జ్వాల. దీంతో జ్వాల నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయవా అంటుంది హిమ.

Advertisement

karthika deepam 25 april 2022 full episode

అప్పుడే వెళ్తావా అని అంటాడు ప్రేమ్. నాకు పని ఉంది. ప్రేమ్ నే తీసుకెళ్లమను అంటాడు. మరోవైపు నిరుపమ్ కూడా హిమనే లవ్ చేస్తుంటాడు. తన ఫోటోలను ఫోన్ లో చూస్తాడు. మన విషయం.. మమ్మీకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు హిమ అని అనుకుంటాడు నిరుపమ్. ఇంతలో హిమ వస్తుంది. ఏంటి బావ. ఏంటి ఆ కంగారు అంటుంది. ఏం లేదు హిమ అంటాడు నిరుపమ్. ఇంతలో ఓ పేషెంట్ వస్తుంది. నాకు ఇంజెక్షన్ అంటే భయం అని సిస్టర్ తో చెబుతుంది. దీంతో ఇలా ఇవ్వు నేను ఇస్తాను అని చెప్పి ఆ పేషెంట్ కు ఇంజెక్షన్ వేస్తుంది హిమ.

Advertisement

హిమలో వచ్చిన మార్పును చూసి నిరుపమ్ షాక్ అవుతాడు. జ్వాల ట్రెయినింగ్ వల్లనే నాలో ఇంత మార్పు వచ్చింది అంటుంది హిమ. బావ.. మనమంతా ఒకసారి మామిడితోట దగ్గరికి వెళ్లొద్దామా అని అడుగుతుంది. దీంతో ఊరికే సరదాగా అంటుంది హిమ.

సరే.. తప్పకుండా వెళ్దాం అంటాడు నిరుపమ్. మరోవైపు జగన్నాధరావు ఇంటికి వస్తుంది జ్వాల. కానీ.. ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఈ ఇంట్లో ఉండేవాళ్లను తాతయ్య పేరు చెప్పి అడ్రస్ అడుగుతా అనుకుంటుంది. కానీ తాళం వేసి టులెట్ అని బోర్డ్ పెట్టి ఉండటంతో షాక్ అవుతుంది.

Advertisement

బతికిపోయావే.. దొరికావు అని అనుకుంటే తప్పించుకుంటున్నావు. ఇక్కడే ఉంటావని తెలిసింది కదా. ఎక్కడికి తప్పించుకొని పోతావు. వదిలేదే లేదు నిన్ను అని అనుకొని అక్కడి నుంచి తన ఆటోలో వెళ్లిపోతుంది జ్వాల. మరోవైపు నిరుపమ్ కారులో వెళ్తుంటాడు.

Karthika Deepam 25 April Today Episode : జ్వాల, హిమ, నిరుపమ్.. ముగ్గురూ కలిసి ఉండటం చూసి స్వప్న షాక్

హిమ కూడా ఉంటుంది. శౌర్య పడే కష్టాలన్నింటికీ నేనే కారణం అని అనుకుంటుంది హిమ. తనే శౌర్య అని తెలిసిన రోజే తన కష్టాలన్నీ తీరిపోతాయి అని అనుకుంటుంది. ఇంతలో ఆ కారు వెనుకనే జ్వాల ఆటో కూడా వెళ్తుంటుంది. మన డాక్టర్ సాబ్ కారులా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు అబ్బా అని అనుకుంటుంది.

మరోవైపు తన ఆటో వెనకాలే.. స్వప్న కారులో వస్తుంటుంది. ఎంత హారన్ కొట్టినా జ్వాల సైడ్ ఇవ్వదు. ఇంతలో కారును ఓవర్ టేక్ చేస్తుంది జ్వాల. వెంటనే కారు ఆపుతాడు నిరుపమ్. రౌడీ బేబీ నువ్వా అని అడుగుతాడు. శౌర్యను చూసి సంతోషిస్తుంది తింగరి.

ఇంతలో స్వప్న కారు ఆపి.. వాళ్లు ముగ్గురిని చూస్తుంది. ఈ ఆటోది ఇక్కడుందేంటి అని అనుకుంటుంది. ఆటో తగలేసినా కూడా దీనికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. ఇంత తొందరగా ఆటో ఎలా కొనుక్కుందో ఏంటో అని అనుకుంటుంది స్వప్న.

Advertisement

ఆ హిమను దూరం పెట్టాలనుకుంటే.. ఆ ఆటో తయారైంది. వీళ్లిద్దరూ నా కొడుకుతో క్లోజ్ గా ఉంటున్నారు. ముందు హిమను కట్ చేయాలి. ఆ తర్వాత ఆటో దాని సంగతి చూడాలి. అన్ని దరిద్రాలు నాకే తగులుతాయి. నేనేంటో వాళ్లకు చూపిస్తాను అని అనుకుంటుంది స్వప్న.

ఆ తర్వాత జ్వాల, హిమ, నిరుపమ్ కలిసి మామిడితోటకు వెళ్తారు. అక్కడ పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటుంది తింగరి. పిల్లలు మామిడి కాయ కావాలంటారు. కానీ.. మామిడి కాయ తనకు అందదు. దీంతో నిరుపమ్ వచ్చి తనను ఎత్తుకుంటాడు. దీంతో ఆ మామిడి కాయ కోస్తుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి