Karthika Deepam 26 Oct Today Episode : ఇంద్రుడిని కలిసిన కార్తీక్, దీప.. పెద్దమనిషి అయిన శౌర్య.. ఇంద్రుడు వాళ్లను శౌర్య దగ్గరికి తీసుకెళ్తాడా?

Karthika Deepam 26 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 అక్టోబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 1493 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ టిఫిన్ తినకుండా ఎలా ఆపాలి అని అనుకుంటుంది వాల్తేరు వాణి. ఇంతలో కాసేపు ఆపగలుగుతుంది. ముందు మంచినీళ్లు తాగు అంటుంది. ఇక కార్తీక్ టిఫిన్ తినకుండా ఎలా అడ్డుకోవాలో అర్థం కాదు వాణికి. ఇంతలో అక్కడికి వచ్చి కార్తీక్ ఇడ్లీ తినబోతుండగా ప్లేట్ ను విసిరికొడుతుంది. మన ఇంట్లో నీ కోసం టిఫిన్ తయారు చేసి పెడుతుంటే ఇక్కడికి వచ్చి తినడం ఏంటి అంటుంది. వాణి, మోనిత ఇద్దరూ కలిసి అక్కడ కాసేపు సీన్ క్రియేట్ చేస్తారు. ఇద్దరూ కొట్టుకున్నంత పని చేస్తారు. కార్తీక్ నువ్వు ఇంకోసారి ఇక్కడికి వస్తే నేను అస్సలు ఊరుకోను అంటుంది మోనిత. నువ్వు ముదురు అయితే నేను మహా ముదురు. అది మాస్ అయితే నేను ఊర మాస్ అంటుంది.

karthika deepam 26 october 2022 full episode

పెద్ద ప్రమాదమే తప్పింది అని మనసులో అనుకుంటుంది. లేకపోతే కార్తీక్ చనిపోయి ఉండేవారు అని ఊపిరి పీల్చుకుంటుంది వాణి. కట్ చేస్తే ఇంద్రుడు ఆటో తూడుస్తూ ఉంటాడు. జ్వాలను పిలుస్తాడు. చంద్రమ్మ బయటికి వస్తుంది. గండా నువ్వు రా గండా. ముందు లోపలికి రా. మన జ్వాలమ్మ పెద్దమనిషి అయింది అంటుంది చంద్రమ్మ. పేరంటాలను పిలిచి స్నానం చేయించి కూర్చోబెట్టాలి. ముందు ఈ సామాన్లు తీసుకురా అంటుంది. దీంతో సరే అని అక్కడి నుంచి ఆటోలో బయలుదేరుతాడు ఇంద్రుడు. మరోవైపు శౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటారు కార్తీక్, దీప.

ఆరోజు వినాయకుడి బొమ్మలు అమ్ముతూ శౌర్య కనిపించింది కదా.. ఏదైనా పండగలకు మాత్రమే అక్కడికి వచ్చి బొమ్మలు అమ్ముతారని చెప్పారు. ఇప్పుడు దీపావళి కూడా వచ్చింది. అంటే ఇప్పుడు క్రాకర్స్ కూడా అమ్మాలి కదా అనుకుంటాడు.

ఆరోజు బొమ్మలు అమ్మేటప్పుడు వారణాసి తోడుగా ఉన్నాడు. ఇప్పుడేమో వాడు ఆసుపత్రిలో ఉన్నాడు. అసలు ఎవరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తోంది అని కార్తీక్ అనుకుంటుండగా.. దీనంతటికీ కారణం మోనిత అని అనుకుంటుంది దీప. కార్తీక్ కూడా మోనితే దీనికి కారణం అని అనుకుంటాడు కార్తీక్.

Karthika Deepam 26 Oct Today Episode : ప్రియమణి గురించి మోనితను అడిగిన కార్తీక్

మోనిత తనంతట తాను నిజం చెప్పేలా చేసి దాని పీడ వదిలించుకోవాలి అని అనుకుంటాడు కార్తీక్. నేను మౌనంగా ఉండకూడదు. ఈరోజు నుంచి మోనితను బయటికి పంపించే ప్రయత్నం చేస్తా అని అనుకుంటాడు కార్తీక్.

మరోవైపు నా భర్తను మోనిత నుంచి కాపాడుకుంటాను అనుకుంటుంది దీప. ఏదో నా చేతికి మట్టి అంటకూడదని అనుకొని వాణిని పిలిచాను కానీ.. ఈ టిఫిన్స్, భోజనాల్లో విషం కలపడం ఏంటి అని అనుకుంటుంది మోనిత.

ఇంతలో కార్తీక్ వచ్చి మోనితను పిలిచి ప్రియమణి ఎవరు అని అడుగుతాడు. దీంతో షాక్ అవుతుంది. ప్రియమణి ఎవరు.. నాకు తెలియదు కార్తీక్ అంటుంది. దీంతో నీ దగ్గర పని చేశానని చెప్పింది అంటాడు.

చెప్పు మోనిత.. నీ దగ్గర పని చేసిన వాళ్ల గురించి నీకు తెలియదా అంటాడు కార్తీక్. దీంతో చాలామంది నా దగ్గర పని చేశారు కదా.. అందుకే అన్నీ గుర్తుండవు కదా అంటుంది. మన పెళ్లి కాలేదు అంటోంది మరి.

అసలు మన పెళ్లి ఎప్పుడు అయింది అని అడుగుతాడు. మామూలుగా మనకు పెళ్లి అవ్వాల్సిన టైమ్ లో పెళ్లి అయితే ఈ పాటికి పది, పన్నెండేళ్ల వయసు ఉన్న పిల్లలు ఉండాలి. మనకు ఎందుకు ఇంత లేట్ అయింది అని అడుగుతాడు కార్తీక్.

అందరికీ 21 ఏళ్లకే పెళ్లి కావాలని లేదు కదా కార్తీక్. మనకు కొంచెం లేట్ అయింది అంటుంది. ఎందుకు కార్తీక్ ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు. నా మీద నీకు ఎందుకు ఇంత అనుమానం అంటుంది మోనిత.

అసలు నీకు అది ఎప్పుడు కలిసింది అని అడుగుతుంది మోనిత. దీంతో రాత్రి వాకింగ్ సమయంలో కలిసింది అంటాడు కార్తీక్. నువ్వు ఏదైనా దాస్తున్నావా.. అబద్ధం చెబుతున్నావని, నిజం దాస్తున్నావని నాకు తెలిసిందే నాలో రాక్షసుడిని చూస్తావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు కార్తీక్.

మరోవైపు దుర్గ, వాణి ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుంటారు. దీప వదిన నీకు ఎంత కాలంగా తెలుసు అని అడుగుతుంది వాణి. దీంతో చాలా ఏళ్లుగా తెలుసు అంటాడు దుర్గ. మోనిత పీడను విరగడ చేస్తే చాలు అంటాడు దుర్గ.

ఇంతలో వాళ్లకు పోలీసులు కనిపిస్తారు. దీంతో ఇద్దరూ చెరో దారి వెతుక్కుంటారు. వాణి కూడా బయటపడటం చూసి దుర్గకు డౌట్ వస్తుంది. నేను క్రిమినల్ ను కాబట్టి పోలీసులను చూసి దాక్కున్నాను. నువ్వెందుకు దాక్కున్నావు అని అడుగుతాడు దుర్గ.

వాళ్లను చూసి నువ్వు దాక్కోగానే నాకు భయం వేసింది. అందుకే నేను దాక్కున్నా అంటుంది వాణి. ఇది ఏదో మేనేజ్ చేస్తోంది. నమ్మేలా అనిపించడం లేదు అనుకుంటాడు. మరోవైపు సామాన్లు అన్నీ తీసుకొని తెచ్చి ఇస్తాడు ఇంద్రుడు.

మరోవైపు కార్తీక్.. శౌర్య గురించి అడుగుతాడు. ఈరోజు ఎందుకో శౌర్య కనిపిస్తుంది అని అనుకుంటాడు. మరోవైపు జ్వాలకు చీర కొనాలి. డబ్బులు లేవు. ఏం చేయాలి అని అనుకుంటాడు ఇంద్రుడు.

ఇంతలో అక్కడికి దీప కూడా వస్తుంది. కార్తీక్, దీప ఇద్దరూ ఇంద్రుడిని చూసి పాప గురించి అడుగుతారు. దీంతో పాప పెద్దమనిషి అయిందని చెబుతాడు. ఆ తర్వాత తనను చూడటం కోసం ఇంద్రుడి ఇంటికి వెళ్తారు కార్తీక్, దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Devotional | వృశ్చికరాశిలో బుధుడు–కుజుడు యోగం .. నాలుగు రాశుల జీవితంలో స్వర్ణయుగం ప్రారంభం!

Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…

14 minutes ago

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

14 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

16 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

18 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

18 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

21 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

1 day ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago