Karthika Deepam 27 Dec Today Episode : మోనితకు షాక్.. బాబును ఎవరు ఎత్తుకెళ్లారో తెలిసిపోయింది.. తాడికొండకు బయలుదేరుతుందా? ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే?

Authored By Varun G | The Telugu News | Published on: December 27, 2021, 9:40 am

Karthika Deepam 27 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 1233 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్యకు.. భారతి ఫోన్ చేస్తుంది. మోనిత ఊరు వదిలి వెళ్లిపోయిందట. క్లీనిక్ అమ్మేసిందట అంటుంది. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. మోనిత మా ఇంట్లోనే ఉంది కదా.. అంటే ఏమో ఆంటి క్లీనిక్ అమ్మినట్టు తెలిసింది అంటుంది భారతి. శ్రావ్య కూడా తన మాటలు విని షాక్ అవుతుంది. మరోవైపు దీప వంటింట్లో కూరగాయలు కోస్తూ ఉంటుంది. కార్తీక్ వచ్చి దీప అంటాడు. కాఫీ ఏమైనా కావాలా అని అడుగుతుంది దీప. వద్దు అంటాడు. రుద్రాణి వచ్చిందని కంగారు పడుతున్నారా అంటుంది. అదేం లేదు కానీ.. తను ఏంటో అర్థం కావడం లేదు. ఆమె ఆలోచనలు ఏంటో అంతుపట్టడం లేదు నాకు అంటాడు కార్తీక్. డాక్టర్ బాబు మనం కూరగాయలు కోస్తుంటే కొన్ని పుచ్చులు వస్తుంటాయి.. వాటిని ఏం చేస్తాం. వాటిని పక్కన పడేస్తాం కదా.. ఇది కూడా అంతే.. అంటుంది.

karthika deepam 27 december 2021 full episode

karthika deepam 27 december 2021 full episode

నేను కూడా ఏదో ఒక పని చేస్తా దీప అంటాడు కార్తీక్. ఎందుకండి.. నేను ఎలాగూ పిండి వంటలు చేస్తున్నాను కదా అంటుంది దీప. వాటిని నేను మార్కెటింగ్ చేస్తాను. అమ్ముతాను అంటాడు. దీంతో అవేమీ వద్దు అండి అంటుంది. మరి ఏం చేయాలి అంటాడు కార్తీక్. ఇక్కడ ఒక ప్రజా వైద్యశాల పెట్టాలి అంటుంది దీప. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ప్రజా వైద్యశాలా.. అంటాడు కార్తీక్. మరోవైపు బస్తీకి వెళ్లిన మోనిత.. ఇదివరకు కార్తీక్ పెట్టిన ఉచిత వైద్య శాలలోనే వంటలక్క ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేస్తుంది మోనిత. నా కార్తీక్ ఆశీస్సులతో వంటలక్క ప్రజా వైద్యశాల.. డా.. మోనితా కార్తీక్ అని పేరు రాయిస్తుంది. దాని బోర్డును పెట్టిస్తుంది. ఇంతలో బస్తీ వాసులు అక్కడికి వస్తారు. ఇందుమూలంగా ప్రియమైన బస్తీ ప్రజలారా.. మీకొక శుభవార్త. నా కార్తీక్ ఆశీస్సులతో ఈ ఆసుపత్రి పెట్టాను అంటుంది మోనిత. దీంతో వారణాసికి కోపం వచ్చి… ఆ బోర్డు పీకేయబోతాడు. వద్దురా.. తను ఈ ఇల్లును కొనుక్కుంది అంటారు బస్తీ వాసులు. ఏంటమ్మా… ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని.. అని అడుగుతారు.

కార్తీక్ లేడు.. దీపక్క లేదు.. వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలియదు. వాళ్ల కోసం నేను వచ్చాను. నాలోనే మీ దీపక్కను చూసుకోండి. నేను ఇప్పుడు వచ్చాను కదా. అందరం కలిసి వాళ్లను వెతుకుదాం అని అంటుంది మోనిత. దీంతో బస్తీ వాసులకు తీవ్రంగా కోపం వస్తుంది.

మరోవైపు కార్తీక్ గురించి ఏదైనా సమాచారం తెలిసిందా అని ఆదిత్యను సౌందర్య అడుగుతుంది. లేదు మమ్మీ.. నేను చాలామందితో మాట్లాడాను అంటాడు ఆదిత్య. మోనిత ఉదయం నుంచి కనిపించడం లేదు అంటుంది సౌందర్య. తను ఏం చేస్తుందో తెలియదు.. ఎక్కడికి వెళ్లిందో తెలియదు.. కార్తీక్ ఉండే చోటు తెలిసిందేమో అని భయపడుతుంది సౌందర్య.

Karthika Deepam 27 Dec Today Episode : మోనిత బస్తీలో ప్రజావైద్యశాల పెట్టిందని సౌందర్యకు చెప్పిన రత్నసీత

ఇంతలో రత్నసీత వచ్చి.. మేడమ్ మీకో విషయం చెప్పాలి అంటుంది. ఏమైంది అంటుంది. మోనిత.. బస్తీకి షిఫ్ట్ అయిందట. అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడే కార్తీక్ పేరుతో ప్రజా వైద్యశాల పెట్టిందట అని చెప్పడంతో సౌందర్య షాక్ అవుతుంది.

తర్వాత బస్తీవాసులు అందరూ నీ హాస్పిటల్ కు రాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో మోనిత ఆసుపత్రిలో నర్సుగా పనిచేయడానికి నర్సమ్మ అనే కొత్త నర్సు వస్తుంది. తనకు ఇప్పటికే ప్రియమణి అనే ఓ పనిమనిషి ఉందని.. తను తాడికొండ గ్రామం వెళ్లిందని.. అది తన సొంతూరు అని చెబుతుంది.

నిజానికి.. ఆ ఊళ్లోనే ఇప్పుడు కార్తీక్, దీప వాళ్లు ఉండేది. మరోవైపు కోటేశ్, శ్రీవల్లి ఏదో పని మీద బయటికి వెళ్తారు. బాబును చూసుకోమని కార్తీక్ కు చెబుతారు. కట్ చేస్తే మోనిత.. మళ్లీ సౌందర్య ఇంటికి వస్తుంది. అత్తయ్య, మామయ్య అంటూ వాళ్లకు బస్తీలో తాను ప్రజావైద్యశాల పెట్టినట్టు చెబుతుంది.

వాళ్ల కోసం నర్సమ్మతో స్వీట్లు తయారు చేయిస్తుంది. ఇంతలో ఆదిత్య వస్తాడు. వాళ్లకు కూడా ఈ విషయం చెబుతుంది. ఎవ్వరూ స్వీట్లు తీసుకోరు. వాళ్లు స్వీట్లు తినే మూడ్ లో లేరు కానీ.. నేను తింటానులే అంటూ తింటుండగా.. సౌందర్యకు కోపం వస్తుంది.

మోనిత నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అంటుంది సౌందర్య. నా కార్తీక్ కోసం వంటలక్క ప్రజావైద్యశాల పెట్టాను. ఇది గొప్ప ఆలోచన. నా మీద కోపంతో కాదు.. మానవతా దృక్పథంతో ఆలోచించండి.. మీకే అర్థం అవుతుంది. కార్తీక్, దీపక్క.. ఇద్దరి ఆశీస్సుల కోసమే కదా అంటూ ఏదేదో మాట్లాడుతుంది.

కట్ చేస్తే.. కోటేశ్, శ్రీవల్లి ఇద్దరూ వచ్చి కార్తీక్, దీపతో మాట్లాడుతుంటారు. రేపు బాబుకు బారసాల చేస్తున్నాం అని చెబుతారు. వంటలు నేను చూసుకుంటా అని చెబుతుంది దీప. డెకరేషన్ నేను చూసుకుంటాలే అంటాడు కార్తీక్. మీరు చాలా మంచివాళ్లు అంటాడు కోటేశ్.

Varun G

No bio available for this author.

  1. "Donald Trump : నోబెల్ మిస్.. ఇప్పుడు పులిట్జర్ కావాలా? ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త చర్చ!"

  2. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. 12 మంది నామినేషన్లు, ఇద్దరు అవుట్?"

  3. "Meta : మెటాకు భారీ షాక్.. రూ.2.2 లక్షల కోట్ల జరిమానా వెనుక అసలు కేసు ఇదే!"

  4. "YS Jagan YS Sharmila : షర్మిల కూతురి పెళ్లికి జగన్ ఇల్లు ఇవ్వలేదా? అసలు కారణంపై ఆసక్తికర చర్చ"

  5. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  6. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  7. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp