Karthika Deepam 27 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 1233 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్యకు.. భారతి ఫోన్ చేస్తుంది. మోనిత ఊరు వదిలి వెళ్లిపోయిందట. క్లీనిక్ అమ్మేసిందట అంటుంది. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. మోనిత మా ఇంట్లోనే ఉంది కదా.. అంటే ఏమో ఆంటి క్లీనిక్ అమ్మినట్టు తెలిసింది అంటుంది భారతి. శ్రావ్య కూడా తన మాటలు విని షాక్ అవుతుంది. మరోవైపు దీప వంటింట్లో కూరగాయలు కోస్తూ ఉంటుంది. కార్తీక్ వచ్చి దీప అంటాడు. కాఫీ ఏమైనా కావాలా అని అడుగుతుంది దీప. వద్దు అంటాడు. రుద్రాణి వచ్చిందని కంగారు పడుతున్నారా అంటుంది. అదేం లేదు కానీ.. తను ఏంటో అర్థం కావడం లేదు. ఆమె ఆలోచనలు ఏంటో అంతుపట్టడం లేదు నాకు అంటాడు కార్తీక్. డాక్టర్ బాబు మనం కూరగాయలు కోస్తుంటే కొన్ని పుచ్చులు వస్తుంటాయి.. వాటిని ఏం చేస్తాం. వాటిని పక్కన పడేస్తాం కదా.. ఇది కూడా అంతే.. అంటుంది.
నేను కూడా ఏదో ఒక పని చేస్తా దీప అంటాడు కార్తీక్. ఎందుకండి.. నేను ఎలాగూ పిండి వంటలు చేస్తున్నాను కదా అంటుంది దీప. వాటిని నేను మార్కెటింగ్ చేస్తాను. అమ్ముతాను అంటాడు. దీంతో అవేమీ వద్దు అండి అంటుంది. మరి ఏం చేయాలి అంటాడు కార్తీక్. ఇక్కడ ఒక ప్రజా వైద్యశాల పెట్టాలి అంటుంది దీప. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ప్రజా వైద్యశాలా.. అంటాడు కార్తీక్. మరోవైపు బస్తీకి వెళ్లిన మోనిత.. ఇదివరకు కార్తీక్ పెట్టిన ఉచిత వైద్య శాలలోనే వంటలక్క ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేస్తుంది మోనిత. నా కార్తీక్ ఆశీస్సులతో వంటలక్క ప్రజా వైద్యశాల.. డా.. మోనితా కార్తీక్ అని పేరు రాయిస్తుంది. దాని బోర్డును పెట్టిస్తుంది. ఇంతలో బస్తీ వాసులు అక్కడికి వస్తారు. ఇందుమూలంగా ప్రియమైన బస్తీ ప్రజలారా.. మీకొక శుభవార్త. నా కార్తీక్ ఆశీస్సులతో ఈ ఆసుపత్రి పెట్టాను అంటుంది మోనిత. దీంతో వారణాసికి కోపం వచ్చి… ఆ బోర్డు పీకేయబోతాడు. వద్దురా.. తను ఈ ఇల్లును కొనుక్కుంది అంటారు బస్తీ వాసులు. ఏంటమ్మా… ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని.. అని అడుగుతారు.
కార్తీక్ లేడు.. దీపక్క లేదు.. వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలియదు. వాళ్ల కోసం నేను వచ్చాను. నాలోనే మీ దీపక్కను చూసుకోండి. నేను ఇప్పుడు వచ్చాను కదా. అందరం కలిసి వాళ్లను వెతుకుదాం అని అంటుంది మోనిత. దీంతో బస్తీ వాసులకు తీవ్రంగా కోపం వస్తుంది.
మరోవైపు కార్తీక్ గురించి ఏదైనా సమాచారం తెలిసిందా అని ఆదిత్యను సౌందర్య అడుగుతుంది. లేదు మమ్మీ.. నేను చాలామందితో మాట్లాడాను అంటాడు ఆదిత్య. మోనిత ఉదయం నుంచి కనిపించడం లేదు అంటుంది సౌందర్య. తను ఏం చేస్తుందో తెలియదు.. ఎక్కడికి వెళ్లిందో తెలియదు.. కార్తీక్ ఉండే చోటు తెలిసిందేమో అని భయపడుతుంది సౌందర్య.
ఇంతలో రత్నసీత వచ్చి.. మేడమ్ మీకో విషయం చెప్పాలి అంటుంది. ఏమైంది అంటుంది. మోనిత.. బస్తీకి షిఫ్ట్ అయిందట. అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడే కార్తీక్ పేరుతో ప్రజా వైద్యశాల పెట్టిందట అని చెప్పడంతో సౌందర్య షాక్ అవుతుంది.
తర్వాత బస్తీవాసులు అందరూ నీ హాస్పిటల్ కు రాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో మోనిత ఆసుపత్రిలో నర్సుగా పనిచేయడానికి నర్సమ్మ అనే కొత్త నర్సు వస్తుంది. తనకు ఇప్పటికే ప్రియమణి అనే ఓ పనిమనిషి ఉందని.. తను తాడికొండ గ్రామం వెళ్లిందని.. అది తన సొంతూరు అని చెబుతుంది.
నిజానికి.. ఆ ఊళ్లోనే ఇప్పుడు కార్తీక్, దీప వాళ్లు ఉండేది. మరోవైపు కోటేశ్, శ్రీవల్లి ఏదో పని మీద బయటికి వెళ్తారు. బాబును చూసుకోమని కార్తీక్ కు చెబుతారు. కట్ చేస్తే మోనిత.. మళ్లీ సౌందర్య ఇంటికి వస్తుంది. అత్తయ్య, మామయ్య అంటూ వాళ్లకు బస్తీలో తాను ప్రజావైద్యశాల పెట్టినట్టు చెబుతుంది.
వాళ్ల కోసం నర్సమ్మతో స్వీట్లు తయారు చేయిస్తుంది. ఇంతలో ఆదిత్య వస్తాడు. వాళ్లకు కూడా ఈ విషయం చెబుతుంది. ఎవ్వరూ స్వీట్లు తీసుకోరు. వాళ్లు స్వీట్లు తినే మూడ్ లో లేరు కానీ.. నేను తింటానులే అంటూ తింటుండగా.. సౌందర్యకు కోపం వస్తుంది.
మోనిత నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అంటుంది సౌందర్య. నా కార్తీక్ కోసం వంటలక్క ప్రజావైద్యశాల పెట్టాను. ఇది గొప్ప ఆలోచన. నా మీద కోపంతో కాదు.. మానవతా దృక్పథంతో ఆలోచించండి.. మీకే అర్థం అవుతుంది. కార్తీక్, దీపక్క.. ఇద్దరి ఆశీస్సుల కోసమే కదా అంటూ ఏదేదో మాట్లాడుతుంది.
కట్ చేస్తే.. కోటేశ్, శ్రీవల్లి ఇద్దరూ వచ్చి కార్తీక్, దీపతో మాట్లాడుతుంటారు. రేపు బాబుకు బారసాల చేస్తున్నాం అని చెబుతారు. వంటలు నేను చూసుకుంటా అని చెబుతుంది దీప. డెకరేషన్ నేను చూసుకుంటాలే అంటాడు కార్తీక్. మీరు చాలా మంచివాళ్లు అంటాడు కోటేశ్.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.