Karthika Deepam 27 Jan Today Episode : శౌర్యకు అనారోగ్యం.. రేపటిలోగా ఆపరేషన్ చేయకపోతే బతకదని తెలుసుకున్న కార్తీక్ ఏం చేస్తాడు? ఆశ్రమంలో సౌందర్యను కలిసి డబ్బులు అడుగుతాడా?

Karthika Deepam 27 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ 1260 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హోటల్ లో కార్తీక్.. సర్వర్ గా పనిచేస్తుండటం చూసి షాక్ అవుతుంది దీప. ఏమండి అని పిలవగానే చూసి షాక్ అవుతాడు కార్తీక్. ఏం చేస్తున్నారు అనగానే.. దీప నేను అంటూ ఏదో చెప్పబోతాడు. మాట్లాడకండి అంటుంది దీప. ఏం చేస్తున్నారు.. ఇక్కడ పనిచేస్తున్నారా అంటుంది దీప. అయ్యో దేవుడా ఏంటిది. ఇది చూడటానికా నేను బతికి ఉంది. ఏంటి సామీ ఇది. ఏంటండి ఇది. ఈ చేతులతో ఒకప్పుడు మీరు చేసిన పని ఏంటి. ఇప్పుడు చేస్తున్న పని ఏంటి. ఈ పని చేసేముందు ఈ చేతులతో నా గొంతు పిసికి చంపేసినా బాగుండేది. నేను మిమ్మల్ని ఇలా చూడలేను అంటుంది.

karthika deepam 27 January 2022 full episode

నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను ఇలా చేయలేను అంటుంది. మీరు ఒక డాక్టర్. మీరు నా భర్త. మీరు గర్వంగా బతకాలి అంటుండగా ఓనర్ అవన్నీ వింటాడు. వెళ్లండి డాక్టర్ బాబు.. ఆనంద్ ను తీసుకొని ఇంటికి వెళ్లండి అంటుంది. మిమ్మల్ని ఇలా చూస్తూ వీడు కూడా ఏడుస్తున్నాడు. తీసుకెళ్లండి అంటుంది దీప. ఓనర్ వచ్చి అమ్మా.. ఆయన ఎవరు అని అడుగుతుంది. మా ఆయన అంటుంది. చీటీ ఇచ్చే వాళ్లు సాయంత్రం వస్తా అన్నారు అంటాడు ఓనర్. దీంతో అప్పటి దాకా ఇక్కడే ఉంటా లేండి. ఎవరూ లేరు కదా. ఈ పని నేను చూసుకుంటాను అంటూ టేబుల్స్ తూడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది దీప.

షాపింగ్ అయిపోయాక.. తన ఫోన్ కనిపించడం లేదని చెక్ చేసుకుంటాడు ఆదిత్య. తన ఫోన్ కనిపించదు. కారులో పెట్టావేమో చూడు అని అడుగుతుంది శ్రావ్య. చెప్పాను కదా శ్రావ్య.. ఆ మోనిత కలిసి నన్ను చాలా డిస్టర్బ్ చేసింది అంటాడు. అప్పుడు తనకు గుర్తొస్తుంది. తను ఫోన్ ను కారు బానెట్ మీద పెట్టి మరిచిపోయినట్టు. ఎవరు తీసుకెళ్లారో ఏమో అని అంటాడు ఆదిత్య.

సరే.. పదా వెళ్దాం అంటాడు ఆదిత్య. కట్ చేస్తే ప్రకృతి ఆశ్రమాన్ని వదిలి మీరు వేరే ఆశ్రమానికి వెళ్లండి అని ఆనంద రావుతో ఆశ్రమం నిర్వాహకులు చెబుతారు. మేడం గారు ఇక్కడ డిస్టర్బ్ గా ఉన్నట్టు గురువు గారితో చెప్పారట. అందుకే పక్క ఊర్లో ఉన్న మరో ఆశ్రమంలోకి వెళ్లండి అని చెబుతాడు.

సాయంత్రం కార్తీక్ ఇంటికి వస్తాడు. దీప కార్తీక్ తో మాట్లాడదు. కార్తీక్.. ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా అస్సలు మాట్లాడదు. ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది దీప. ప్లీజ్ దీప నాతో మాట్లాడు అంటాడు కార్తీక్. కానీ.. అస్సలు మాట్లాడదు.

నీ కోపాన్ని భరించగలను కానీ.. నీ మౌనాన్ని భరించలేను అంటాడు కార్తీక్. మీరు మాటిస్తేనే నేను మాట్లాడుతాను అంటుంది దీప. ఏంటి డాక్టర్ బాబు.. ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. ఈ చేతులు కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడాయి. ఈ చేతులు వందల ఆపరేషన్స్ చేశాయి. ఈ చేతుల్లో గొప్ప శక్తి ఉంది డాక్టర్ బాబు. ఇవి భగవంతుడి ప్రతిరూపాలు లాంటివి అంటుంది దీప.

ఈ చేతులు ఎంగిలి మెతుకులు ఎత్తకూడదు అంటుంది దీప. నేను ఇంత కష్టపడుతోంది మిమ్మల్ని హోటల్ లో పని చేసేందుకా అంటుంది దీప. మీరు ఏ పని చేయకూడదనే కదా నేను పని చేస్తోంది. గుండె జబ్బులను నయం చేసిన కార్తీక్ బాబు ఇలా చేయొచ్చా.. అంటుంది.

రాజ్యం ఉన్నా పోయినా.. రాజు రాజే. నాకు మాటివ్వండి. ఇంకోసారి ఇలాంటి పనులు చేయనని నాకు మాటివ్వండి డాక్టర్ బాబు అంటుంది దీప. 11 ఏళ్లు దూరంగా ఉన్నాం. అంతకన్నా కష్టం ఇంకేం ఉంటుంది చెప్పండి అంటుంది. చేస్తే వైద్యం చేయండి.. లేకపోతే మహారాజులా కూర్చోండి.. నేను మిమ్మల్ని పోషించుకుంటాను అంటుంది.

ఏంటి దీప.. నీ ధైర్యం అని అడుగుతుంది. మీరు నా పక్కనే ఉన్నారన్న ధైర్యం. నీడపట్టున ఉండండి. నాకు తోడుగా ఉండండి. బోర్ కొడితే పిల్లలకు ట్యూషన్ చెప్పండి. కావాలంటే ట్యూషన ఫీజు నేను ఇస్తాను అంటుంది. దీంతో కార్తీక్ నవ్వుతాడు. ఈ నవ్వు చాలు నాకు అంటుంది దీప.

ఇక నుంచి నా మనసు బాధపెట్టకండి స్వామీ అంటుంది. దీంతో అలాగే వంటలక్క అంటాడు. రాత్రి పూట ఒంటరిగా కార్తీక్ బయట కూర్చుంటాడు. అక్కడికి వచ్చి కూర్చుంటుంది. నా మీద ఉన్న కోపం మొత్తం పోయిందా దీప అని అడుగుతాడు కార్తీక్.

మీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుందండి. మీరు నాకు పసిబిడ్డ లాంటి వాళ్లు. మీమీద అలక మాత్రమే ఉంటుంది. కోపం ఉండదు అంటుంది దీప. నేను రాతి హృదయం ఉన్నవాడిని. నేను రాక్షసుడిని దీప అంటాడు కార్తీక్. నీ దగ్గర ఒక విషయం దాచాను.. నాకు మమ్మీ డాడీ కనిపించారు అని చెబుతాడు కార్తీక్.

Karthika Deepam 27 Jan Today Episode : మమ్మీ డాడీని ప్రకృతి ఆశ్రమంలో చూశానని దీపకు చెప్పిన కార్తీక్

దీంతో దీప షాక్ అవుతుంది. ప్రకృతి వైద్యశాలలో డెలివరీ ఇవ్వడానికి వెళ్తే అక్కడ పేషెంట్లలా దిక్కులేని వాళ్లలా మమ్మీ డాడీ కనిపించారు అని చెబుతాడు కార్తీక్. వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఏంటి దీపా ఇది.. ఒకే ఊళ్లో ఉన్నాం. వాళ్లు ఇక్కడే ఉన్నారు అని తెలిసి కూడా చాటుగా చూశాను తప్పితే మమ్మీ డాడీ అని పలకరించలేదు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేం ఉంటుంది దీప.. అంటాడు కార్తీక్.

జన్మనిచ్చిన తల్లిదండ్రులను దూరం చేసుకోవడం కంటే దుర్మార్గం ఇంకేం ఉంటుంది చెప్పు. ఎన్ని తప్పులు చేసినా.. ఎన్ని పొరపాట్లు చేసినా అన్నింటినీ వాళ్లు భరించారు. గొప్ప తల్లిదండ్రులు దీప వాళ్లు. హోటల్ నుంచి పార్శిల్ తెప్పించుకొని తింటున్నారు. ఏమైందో.. ఎందుకు వచ్చారో తెలియదు. డాడీ మాట్లాడుతుంటే తలుపు చాటు నుంచి వినాల్సి వచ్చింది అని చెబుతాడు కార్తీక్.

డాడీ ఏమన్నారో తెలుసా? తన ప్రాణాలు పోతే కనీసం చివరి కర్మలకు అయినా పెద్దోడు వస్తాడో రాడో అని మమ్మీతో అంటే డాడీ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పలేకపోయాను దీప. నేను అసలు ఏం చేస్తున్నానో.. మిమ్మల్ని ఏం చేస్తానో నాకే అర్థం కావడం లేదు.

చివరికి వాళ్లను చూసిన విషయం నీకు కూడా చెప్పలేదు చూశావా. చెబితే బాధపడతావు.. ఏడుస్తావు అని తెలియక చెప్పకుండా దాచాను. నిన్ను మోసం చేశాను దీప. నేను దుర్మార్గుడిని అంటాడు. దీంతో నేను కూడా అత్తయ్య, మామయ్యను చూశాను అని చెబుతుంది దీప.

రుద్రాణిని ఎవరో చెంపమీద కొట్టారు అని చెప్పాను కదా. ఆరోజే అత్తయ్య మామయ్యను చూశాను. వాళ్లను చూశాక నోట మాట రాలేదు. గుండె ఆగిపోయినంత పని అయింది. వెళ్లలేను.. ఉండలేను.. మీకు చెప్పలేను.. అని చెబుతుంది దీప. ఆ తర్వాత స్కిప్పింగ్ చేస్తూ శౌర్య కింద పడిపోతుంది.

వెంటనే కార్తీక్ తనను చెక్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు దీపను. తన దగ్గర ఉన్న 50 రూపాయలను తీసుకొచ్చి ఇస్తుంది దీప. నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తా అని చెప్పి సైకిల్ మీద వెళ్తుంటాడు కార్తీక్.

రేపటి లోగా శౌర్యకు ఆపరేషన్ చేయాలి. లేకపోతే తను బతకదు. ఎలాగైనా ఆశ్రమానికి వెళ్లి మమ్మిని డబ్బులు అడుగుతా అని అనుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం … డిప్రెషన్ నుంచి బయటపడేదెలా…?

It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…

2 hours ago

White Onion : మీ కొలెస్ట్రాలను సర్ఫ్ వేసి కడిగినట్లుగా శుభ్రం చేసే అద్భుతమైన ఆహారం… ఏంటది..?

White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…

3 hours ago

Super Seeds : ఈ గింజలు చూడడానికి చిన్నగా ఉన్నా… ఇది పేగులను శుభ్రంచేసే బ్రహ్మాస్త్రం…?

Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…

4 hours ago

German Firm Offer : అద్భుతం గురూ… 2 కోట్లు ఇస్తే చనిపోయిన తర్వాత మళ్లీ బ్ర‌తికిస్తాం.. బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ…?

German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…

5 hours ago

Raksha Bandhan : మీ సోదరి కట్టిన రాఖిని ఎన్ని రోజులకు తీస్తున్నారు… దానిని ఏం చేస్తున్నారు.. ఇది మీకోసమే…?

Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…

6 hours ago

Pooja Things : మీరు చేసే పూజలో… ఈ 4 వస్తువులు ఎంత పాతబడిన సరే… మ‌ళ్లీ వినియోగించవచ్చట…?

Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…

7 hours ago

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీల‌ను అడ్డుకున్న స్థానిక ప్ర‌జ‌లు..!

Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…

14 hours ago

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

16 hours ago