Home » Entertainment » Keerthy Suresh Nattu Nattu Dance With Ram Charan
Entertainment

Ram Charan : రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి నాటు నాటు స్టెప్స్ ఇర‌గ‌దీసిన కీర్తి సురేష్‌.. వీడియో..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 27, 2022, 10:30 am
Advertisement

Ram Charan :ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు పాట పెద్ద ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఈ పాట‌లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ త‌మ‌దైన శైలిలో స్టెప్పులు వేసి అల‌రించారు. నాటు నాటు నాటు… వీర నాటు అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్టెప్పేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ అవుతున్నాయి. ఈ సాంగ్‌కి సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం కాలు క‌దుపుతూ అభిమానుల‌ని ఆనందింప‌జేస్తున్నారు.

Advertisement

నిన్న సాయంత్రం “గుడ్ లక్ సఖి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిన అనారోగ్యం కారణంగా చిరంజీవి రాలేకపోయారు. ఆయన స్థానంలో రామ్ చరణ్ ఈ వేదికను అలంకరించారు. రామ్ చరణ్ ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకనిర్మాతలను అభినందించారు. ఇక ఈ సినిమాకు చాలా మంది జాతీయ అవార్డు గ్రహీతలు పని చేశారు. కాబట్టి దీనిని చిన్న సినిమా అని పిలవవద్దని అన్నారు. ఇక ‘మహానటి’ చూసిన తర్వాత కీర్తి సురేష్ కి అభిమానిని అయ్యానని వెల్లడించారు.

keerthy suresh Nattu Nattu dance with ram charan

Advertisement

Ram Charan : నాటు పాట‌కు నీట్ స్టెప్పులు..

ఇక కీర్తి సురేష్ స్టేజ్ పైకి వ‌చ్చి నాటు నాటు స్టెప్ వేయాల‌ని ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్‌ను కోరారు. ‘ఎవ‌రితో అయినా అద్భుతంగా న‌టించ‌గ‌ల‌, నాకెంతో ఇష్టమైన మహానటి కీర్తి సురేష్ అడిగారు కాబట్టి ఏమాత్రం ఆలోచించ‌కుండా ఒప్పుకుంటున్నా’ అని చెప్పిన చరణ్.. ‘కీర్తితో మీకు ఆ స్టెప్ వ‌చ్చా ఓసారి అయితే లైట్‌గా వేసి చూపించండి’ అని చెప్పి, ఆమె వేసిన త‌ర్వాత స‌ర‌దాగా కీర్తితో క‌లిసి నాటు నాటు స్టెప్పు వేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. రామ్ చ‌ర‌ణ్‌, కీర్తి సురేష్ క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ హల్ చ‌ల్ చేస్తుంది. ఇక నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి