Karthika Deepam 27 Nov Today Episode : కార్తీక్, దీప సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన మోనిత.. బస్తీలో ఇద్దరికీ భారీ షాక్
Karthika Deepam 27 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 నవంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 1208 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్య, ఆనందరావు చాలా సంతోషంగా ఉంటారు. మనలో ఉన్న బాధలను దీప చిటికెలో తీసేసింది అంటుంది సౌందర్య. మరోవైపు పిల్లలు కూడా వచ్చి.. మేము కూడా వస్తాం అంటారు. దీంతో ఆనంద రావు, సౌందర్య ఇద్దరూ కలసి పిల్లలను వాకింగ్ కు తీసుకెళ్తారు. పిల్లలతో కలిసి సరదాగా వాకింగ్ కు వెళ్తారు.

karthika deepam 27 november 2021 full episode
కట్ చేస్తే.. మోనిత ప్రియమణిని తీసుకొని క్యాబ్ లో కార్తీక్ ఇంటికి వస్తుంది. క్యాబ్ లో వచ్చి కార్తీక్ ఇంటి బయటే కారులో వెయిట్ చేస్తుంటుంది. ఏమైందమ్మ.. ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నాం. వాళ్ల ఇంటికి వెళ్లకుండా అంటుంది ప్రియమణి. కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నాడో చూసి కార్తీక్ ను ఫాలో చెయ్యాలి. అందుకే.. క్యాబ్ బుక్ చేశా అంటుంది మోనిత. కార్తీక్ ను ఫాలో అయి ఏం చేస్తారు అమ్మా అంటుంది ప్రియమణి. నువ్వు ఎంత వరకు మాట్లాడాలో అంత వరకే మాట్లాడు.. అని ప్రియమణి నోరు మూయిస్తుంది మోనిత.
మరోవైపు ఆనంద రావు, సౌందర్య, పిల్లలు కలిసి జాగింగ్ కు వెళ్లడం మోనిత చూస్తుంది. వీళ్ల మొహాల్లో చిరునవ్వు నాకు కనిపించకూడదు అని అనుకుంటుంది మోనిత. సౌందర్యను చూస్తే నాకు భయం వేస్తుంది అంటుంది. తనలో ఏదో పవర్ ఉంటుంది అంటుంది మోనిత. వాళ్లను చూసి కారులోనే దాక్కుంటారు ఇద్దరూ.
దీప ఉప్మా చేయమంటే.. అన్ని రకాల టిఫిన్లు చేస్తుంది. కార్తీక్, ఆదిత్యకు వడ్డిస్తుంది. ఇంతలో మురళికృష్ణ కార్తీక్ ఇంటికి వస్తాడు. మోనిత కారులో ఉండటం చూస్తాడు. రాగానే.. వెంటనే దీపకు ఈ విషయం చెబుతాడు మురళికృష్ణ. వెంటనే దీప ఈ విషయం కార్తీక్ కు చెబుతుంది.
మళ్లీ ఏదైనా గొడవ చేయడానికి వచ్చిందేమో అని నాన్న టెన్షన్ పడుతున్నారు.. అంటుంది. ఆదిత్య కోపంతో రగిలిపోతాడు. దీంతో ఆదిత్య కూల్. మేము బయటికి వెళ్తున్నాం.. మేము చూసుకుంటాంలే అంటాడు కార్తీక్. మేము తన సంగతి చెబుతాంలే అంటాడు కార్తీక్.
Karthika Deepam 27 Nov Today Episode : బస్తీలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన కార్తీక్
మరోవైపు బస్తీలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయిస్తాడు వారణాసి. డాక్టర్ బాబు, దీపక్క.. ఇద్దరూ క్యాంప్ కు బయలుదేరుతారు. ఇంటి బయటికి వచ్చాక.. మోనిత ఎక్కడుందని చూస్తారు కానీ.. వాళ్లకు మోనిత కనిపించదు. దీంతో ఇద్దరూ బస్తీకి బయలుదేరుతారు.
కార్తీక్ బస్తీకి వచ్చి అందరికీ ట్రీట్ మెంట్ ఇస్తాడు. ఉచితంగా అందరికీ మెడికల్ చెకప్ చేస్తాడు. దీప.. అందరితో సరదాగా కాసేపు గడుపుతుంది. బస్తీకి వచ్చిన ప్రతిసారి నాకు పుట్టింటికి వచ్చినట్టే అనిపిస్తుంది అంటుంది దీప. దీంతో అందరు ఖుషీ అవుతారు బస్తీవాళ్లు.
ఒక పిల్లాడు వాళ్ల నాన్నకోసం ఎక్కువగా ఏడుస్తుంటాడు అని చెబుతుంది ఓ మహిళ. నాన్న కోసం ఏడ్వడం ఏంటి అంటాడు కార్తీక్. వాళ్ల నాన్న మళ్లీ కొడుకే పుట్టాడని అలిగి వెళ్లిపోయాడు అంటుంది. ఆడపిల్ల పుట్టకపోతే మీరేం చేస్తారు. చిన్నపిల్లలను వదిలేసి వెళ్లిపోయాడా? మనిషేనా.. అంటూ అంటాడు కార్తీక్.
వెంటనే అక్కడికి చేరుకున్న మోనిత.. ఇదే మాట నిన్ను అడిగితే అంటుంది మోనిత. నువ్వా అంటాడు కార్తీక్. ఏంటి కార్తీక్ షాక్ అయ్యావా? నేను వస్తానని ఊహించలేదా అంటుంది మోనిత. వాడసలు తండ్రేనా అన్నావు.. మరి నువ్వు నాకు చేసిందేంటి.. అని ప్రశ్నిస్తుంది మోనిత.
నా బిడ్డను వదిలేసి ఇక్కడ నీతులు చెబుతూ కూర్చున్నావా? నన్ను, నా బిడ్డను నువ్వు వదిలేసినప్పుడు అది ఎలా నీతి అవుతుంది.. అంటూ మోనిత కార్తీక్ ను బస్తీలోనే అందరి ముందు నిలదీస్తుంది. దీంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.