Karthika Deepam 28 April Today Episode : గీత దగ్గరికి తింగరిని తీసుకెళ్లిన జ్వాల.. తింగరే హిమ అని గీత గీసిన బొమ్మతో జ్వాలకు తెలిసిపోతుందా?

Karthika Deepam 28 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 1338 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా మమ్మీ అంటాడు నిరుపమ్. కానీ.. ఈ మాట నేను ప్రేమ్ కు ఎన్నోసార్లు చెప్పాను కానీ.. వాడు వినడం లేదు అంటుంది. మీరిద్దరూ కలిసి ఉండొచ్చు కదా అంటాడు నిరుపమ్. దీంతో అది ఈ జన్మలో జరగదు అంటుంది స్వప్న. డాడీ గురించి ప్రేమ్ గురించి ఆలోచించడం కూడా తప్పు అంటే ఎలా మమ్మీ అంటాడు నిరుపమ్. రేపు నువ్వు హాస్పిటల్ కు వెళ్లకు. ఇంటి దగ్గరే ఉండు. రేపు నా ఫ్రెండ్ కీర్తి బిడ్డలు వస్తున్నారు అంటుంది స్వప్న.

karthika deepam 28 april 2022 full episode

దీంతో వాళ్లు వస్తే నాకేంటి. మేము రేపు నాగార్జున సాగర్ కు వెళ్తున్నాం అంటాడు. దీంతో ఎవరెవరు అంటుంది స్వప్న. దీంతో నేను, జ్వాల, హిమ వెళ్తున్నాం అంటాడు నిరుపమ్. నువ్వు వెళ్లడం లేదు. వెళ్లకూడదు.. అని హుకుం జారీ చేస్తుంది స్వప్న. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్. మరోవైపు సత్యం.. జ్వాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే జ్వాల టిఫిన్ తీసుకొచ్చి ఇస్తుంది. కొంచెం లేట్ అయింది అంటుంది. రేపు రావడం లేదు అంటుంది. నాగార్జున సాగర్ వెళ్తున్నాం అంటుంది. దీంతో సరే అంటాడు సత్యం సార్.

మరోవైపు నాగార్జున సాగర్ కు వెళ్లడం కోసం రెడీ అవుతుంటుంది హిమ. జ్వాల కూడా రెడీ అవుతుంది. హిమకు ఆనంద రావు ఖర్చులకు డబ్బులు ఇస్తాడు. దేనికి అంటే.. ఖర్చులకు ఉండనీయు అంటాడు ఆనంద రావు. అది ఇప్పుడు స్కూల్ కు వెళ్లే హిమ కాదు. తను ఒక డాక్టర్. తను సంపాదిస్తోంది అంటుంది సౌందర్య.

కరెక్టే కానీ.. ఇవ్వడంలో ఓ ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని నేనెందుకు వదులుకోవాలి అంటాడు ఆనంద రావు. ఆ తర్వాత మరికొన్ని డబ్బులు ఇచ్చి శౌర్య వంతు కూడా ఇస్తాడు. తను కూడా ఉండి ఉంటే.. తనకు కూడా ఇచ్చేవాడిని కదా. ఆ రౌడీ లేదు.. దాని వంతు కూడా నీకే ఇస్తున్నాను ఉంచు అమ్మ అంటాడు ఆనంద రావు.

మరోవైపు నిరుపమ్ వచ్చి.. నేను నాగార్జున సాగర్ రాలేను అంటాడు. అర్జెంట్ గా హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం వచ్చింది అని చెబుతాడు. దీంతో సరే బావ అంటుంది హిమ. అక్కడే ఉన్న సౌందర్య.. ఇప్పుడు నిజం చెప్పురా అంటుంది.

దీంతో నిరుపమ్ కు ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు నిరుపమ్ కు తన మమ్మీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నాగార్జున సాగర్ కు వెళ్లావంటే.. నేను చచ్చినంత ఒట్టే. నువ్వు నాగార్జున సాగర్ వెళ్తే నేను చచ్చిపోతాను అని చెప్పి బెదిరిస్తుంది స్వప్న.

Karthika Deepam 28 April Today Episode : నాగార్జున సాగర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని బాధపడ్డ హిమ

మనల్ని సాధించేవాళ్లు మన కడుపున పుడితే మనం ఏం చేయలేం. నా దురదృష్టానికి నా కడుపున మీ అమ్మ పుట్టింది. నీ దురదృష్టానికి దాని కడుపున నువ్వు పుట్టావు. దాని మొండితనం రోజురోజుకూ పెరిగిపోతోంది అని అంటుంది సౌందర్య.

కట్ చేస్తే.. రవ్వ ఇడ్లీ.. చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆటోలో జ్వాల వస్తుంది. ఏంటి జ్వాల ఇవాళ ఏదో స్పెషల్ గా రెడీ అయినట్టుంది అనుకుంటాడు. కొత్తగా కనిపిస్తున్నావు ఏంటి అంటాడు రవ్వ ఇడ్లీ. కావాలనే రెడీ అయ్యాను.. మేము నాగార్జున సాగర్ వెళ్తున్నాం అంటుంది.

ఇంతలో తింగరి అక్కడికి వస్తుంది. ఎలా ఉన్నాను బాగున్నానా అంటుంది. ఏయ్ రవ్వ ఇడ్లీ ఎలా ఉన్నావు అంటుంది. దీంతో బాగున్నావు అంటుంది జ్వాల. జ్వాల ఒకసారి పక్కకు రావా అంటుంది హిమ. ఏంటి తింగరి.. డాక్టర్ సాబ్ ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది.

సారీ జ్వాల.. నువ్వు డిసప్పాయింట్ అవ్వొద్దు. మీ డాక్టర్ సాబ్ కు ఏదో ఆపరేషన్ ఉందట. మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంటుంది. అవునా.. ఆపరేషన్ చేయాలంటే అంత టైమ్ పడుతుందా అంటుంది. దీంతో మేజర్ ఆపరేషన్ అయి ఉంటుంది అంటుంది.

నువ్వేం ఫీల్ అవ్వకు. ఇంకోసారి వెళ్దాంలే అంటుంది. మా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అని రవ్వ ఇడ్లీతో చెబుతుంది. పదా మనం వెళ్దాం అంటుంది. ఎక్కడికి జ్వాల అంటుంది. నువ్వు ఎక్కడికి తీసుకెళ్లినా వస్తాను అంటుంది. బొమ్మలు గీసే ఒక ఆవిడ పరిచయం అయిందని చెప్పాను కదా.. అక్కడికి మనం వెళ్తున్నాం అంటుంది.

దీంతో హిమ షాక్ అవుతుంది. నా శత్రువు పోలికలు చెబుతాను. దాన్ని బట్టి ఆమె బొమ్మ గీస్తుంది. ఈ మంచి పని నువ్వు ఉన్నప్పుడే జరగాలి అని అంటుంది జ్వాల. ఆ ఆర్టిస్ట్ నా బొమ్మ గీస్తే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకేం ఆలోచించకు. వెళ్దాం పదా అంటుంది.

ఆర్టిస్ట్ గీత దగ్గరికి హిమను తీసుకొస్తుంది. ఒకరి బొమ్మ గీయాలని చెప్పాను కదా. మీరు కానీ.. ఆ బొమ్మను కరెక్ట్ గా గీసి ఇస్తే.. మీ ఫోటోను నా ఇంట్లో పెట్టుకొని పూజిస్తాను అంటుంది. ఆ తర్వాత హిమ ఎలా ఉంటుందో గీతకు చెబుతుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.  

Recent Posts

Gurram Paapi Reddy : ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్..!

Gurram Paapi Reddy  : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…

4 hours ago

INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు

INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…

7 hours ago

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

7 hours ago

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక‌.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాట‌ర్

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…

9 hours ago

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

10 hours ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

11 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

12 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

12 hours ago