Karthika Deepam 28 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 డిసెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 1234 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాబుకు బారసాల చేద్దామని అనుకుంటున్నామని కోటేశ్, శ్రీవల్లి చెబుతారు. సరే.. అందరినీ పిలిచి బ్రహ్మాండంగా చేద్దాం అంటుంది దీప. మనం పిలిచినా కూడా ఎవ్వరూ రారు అక్క అంటుంది శ్రీవల్లి. ఎందుకు అంటే.. ఆ రుద్రాణిని కాదని ఎవ్వరూ మన ఫంక్షన్ కు రారు అక్క అంటారు శ్రీవల్లి. కోటేశ్. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. ఎవ్వరూ రాకపోతేనేం. మనమే ఉన్నంతలో బాగా చేసుకుందాం.. అంటారు. ఇంతలో కోటేశ్ ను తన తమ్ముడు ఆదిత్యతో పోల్చుతాడు కోటేశ్. తర్వాత కార్తీక్ బయటికి వెళ్తాడు. మరోవైపు మోనితను నర్సమ్మ అయ్యగారు కనిపించడం లేదు ఏంటి అని అడుగుతుంది. కార్తీక్ ఇక్కడ ఉన్నాడు అంటుంది. కనిపించడం లేదు కదా అని అడిగా అంటుంది. నిజమే.. నా కార్తీక్ బాబు కనిపించడం లేదు.
నా కొడుకును ఎవరో ఎత్తుకెళ్లారు. వాడినీ ఎత్తుకెళ్లాలి. నా బతుకు ఏంటో.. కొడుకు లేడు.. మొగుడు లేడు.. ఉన్నదల్లా గుండెల నిండా ప్రేమ అంటుంది. కార్తీక్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి అంటుంది మోనిత. ఇలా ఒంటరిగా ఉండటం కష్టం కదమ్మా అంటుంది నర్సమ్మ. అవును.. కార్తీక్ ను గుర్తు చేసుకుంటూ బతుకుతున్నా అని అంటుంది. పెళ్లయిన వాడు అంటూ సౌందర్య గారు అన్నారు కదా అంటే.. తనకు కోపం వస్తుంది. ఇంతకుముందు ప్రియమణి అనే పని అమ్మాయి పని ఎందుకు మానేసిందో తెలుసా? నీలాగే పనికిమాలిన ప్రశ్నలు వేసింది. అందుకే.. తను తన సొంతూరు తాడికొండకు వెళ్లిపోయింది అని చెబుతుంది మోనిత. నీ పని కూడా ఉండాలంటే ఇక నుంచి అటువంటి ప్రశ్నలు అడగడం ఆపేయ్ అంటుంది.
మరోవైపు రుద్రాణి.. కార్తీక్ గురించి సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తన పనోడు వచ్చి రేపు శ్రీవల్లి కొడుకుకు నామకరణం చేస్తున్నారట అని అంటాడు. సరేరా పెట్టుకోనివ్వు.. ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కదా అంటుంది. ఇంతలో రత్నసీత… సౌందర్య దగ్గరికి వెళ్లి మోనిత కొడుకును ఎవరు ఎత్తుకెళ్లారో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను చూపిస్తుంది. దీంతో సౌందర్య, ఆనంద రావు షాక్ అవుతారు.
కట్ చేస్తే.. కోటేశ్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బాబు నామకరణం కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. బయట పిల్లలు ఇద్దరూ తొక్కుడుబిళ్ల ఆడుతుంటారు. శౌర్యకు రాయి కాళ్లకు గుచ్చుకుంటుంది. దీంతో అమ్మా అని ఏడుస్తుంది. దీంతో కార్తీక్ బయటికి వచ్చి చూస్తాడు. ఎందుకు చెప్పులు వేసుకోకుండా ఆడావు అని అడుగుతాడు. దీంతో చెప్పులు తెగిపోయాయి అని చెబుతుంది.
దేవుడా… చెప్పులు కూడా కొనివ్వలేని స్థితికి నన్ను తీసుకొచ్చావా అని అనుకుంటాడు కార్తీక్. సరే.. చెప్పులు కొనిస్తానులే అని దీప చెబుతుంది. మరోవైపు మోనితను సౌందర్య పిలుస్తుంది. నీ కొడుకును నేను ఎత్తుకెళ్లానా.. నా కొడుకు ఎత్తుకెళ్లాడా.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మోనిత.
తల్లి కావడం అనేది గొప్ప వరం. దాన్ని నువ్వు నీ స్వార్థానికి వాడుకున్నావు. పుట్టిన బిడ్డను సైతం అడ్డం పెట్టుకొని మమ్మల్ని సాధించాలని చూస్తున్నావు. అనుకోగానే అన్నీ అయిపోవు. ఏదో ఒకటి రెండు నీ కపట నాటకాలతో నిజం అయ్యాయి కావచ్చు కానీ.. అబద్ధాలతో ఎన్నాళ్లు నువ్వు ఇలా నెట్టుకురాగలవు.. అంటుంది సౌందర్య.
నీకొడుకును ఎవరో ఎత్తుకెళ్లారు అన్నావు కదా.. చూడు.. ఈ వీడియో చూడు నీకే అర్థం అవుతుంది.. అని చెప్పి వీడియో చూపిస్తుంది సౌందర్య. దీంతో మోనిత షాక్ అవుతుంది. ఏం మోనిత.. మాటలు పడిపోయాయా.. ఇప్పుడు మాట్లాడవేంటి.. నువ్వొచ్చిన మొదటి రోజే నిన్ను ఇంట్లోంచి గెంటేసేదాన్ని. కానీ.. నీ వంకర బుద్ధి నాకు తెలుసు.. అందుకే నిన్ను ఏమనలేదు అంటుంది సౌందర్య.
ఇంతలో ఆదిత్య తన బ్యాగు తీసుకొచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపో అంటాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపో అంటుంది సౌందర్య. ఇది సౌందర్య ఇల్లు అని గుర్తుపెట్టుకో. నువ్వు ఏవైనా వేషాలు వేయానుకుంటే ఇంటి బయట వేయి. ఇంకోసారి ఈ గడప తొక్కాలని ప్రవర్తించకు అంటుంది.
కట్ చేస్తే బాబు నామకరణం పూజ జరుగుతూ ఉంటుంది. బాబుకు ఏం పేరు పెట్టాలని నిర్ణయించారు అని అడుగుతాడు పంతులు. రంగరాజు అని అంటుంది అప్పుడే వచ్చిన రుద్రాణి. దీంతో అందరూ షాక్ అవుతారు. బాబును శ్రీవల్లి దగ్గర్నుంచి తీసేసుకుంటుంది రుద్రాణి. బాబును ఇవ్వకుండానే తన ఇంటికి తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
This website uses cookies.